• Follow NativePlanet
Share
» »400 ఏళ్లుగా .. నిరంతరం వెలిగే జ్యోతి... ఎక్కడవుందో తెలుసా..?

400 ఏళ్లుగా .. నిరంతరం వెలిగే జ్యోతి... ఎక్కడవుందో తెలుసా..?

నిరంతరం వెలిగే జ్యోతిని అఖండజ్యోతి అంటారు. కొన్ని దేవాలయాలలో అఖండ జ్యోతిని వెలిగించి నిరంతరం దానిని సంరక్షిస్తుంటారు. ఈ అఖండజ్యోతిని పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు, పూజిస్తారు, ఈ దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ఇంధనంను ఉచితంగా అందజేస్తారు.

ఈ అఖండ జ్యోతిని పూజించడం వలన శుభం జరుగుతుందని నమ్ముతారు. దీపపు కుందెనలలో వత్తులను ఉంచి దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ఇంధనంగా నువ్వులనూనె, లేదా ఆవు నెయ్యి మరియు నువ్వులనూనె మిశ్రమం, లేదా ఆముదమును ఉపయోగిస్తారు.

దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ఆక్సిజన్ గాలి అందేలా ఈదురు గాలుల నుంచి, వానల నుంచి సంరక్షించేందుకు తగిన ప్రదేశంలో భద్రపరుస్తారు.

400ఏళ్లుగా.. నిరంతరం వెలిగే జ్యోతి

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

నిత్యపూజలకు నిదర్శనం

నిత్యపూజలకు నిదర్శనం

ఆ దేవాలయంలో దీపం నాలుగు వందల సంవత్సరాలుగా వెలుగుతూనే వుంది. అచంచలమైన భక్తి విశ్వాసం, ఆ గ్రామస్తుల నిత్యపూజలకు నిదర్శనం.

pc: youtube

నిరంతరంగా వెలుగుతున్న నందాదీపం

నిరంతరంగా వెలుగుతున్న నందాదీపం

గ్రామంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నందాదీపం నిరంతరంగా వెలుగుతున్న ఆశ్చర్యకరమైన స్టోరీ ఇది.

pc: youtube

అవునూరు సిరిసంపదలు

అవునూరు సిరిసంపదలు

పూర్వికులు వెలిగించిన దీపాన్ని గ్రామస్థులు భక్తితో కాపాడుతున్నారు. జ్యోతి వెలిగితేనే అవునూరు సిరిసంపదలతో తులతూగుతుందనేది వారి విశ్వాసం.

pc: youtube

తరతరాలుగా వెలుగుతున్న నందా దీపం

తరతరాలుగా వెలుగుతున్న నందా దీపం

సిరిసిల్ల జిల్లాలోని అవునూర్ లోని సీతారామస్వామి దేవస్థానంలో నందాదీపం తరతరాలుగా వెలుగుతోంది.

pc: youtube

భక్తిభావాన్ని చాటుకుంటున్న గ్రామస్థులు

భక్తిభావాన్ని చాటుకుంటున్న గ్రామస్థులు

ఈ దీపానికి 400ఏళ్ల చరిత్ర వుందనేది ప్రతీతి. నిత్యం ధూపదీప నైవేద్యాలతో సీతారామచంద్రస్వామిని పూజిస్తూ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు గ్రామస్థులు.

pc: youtube

ప్రజల నమ్మకం

ప్రజల నమ్మకం

జ్యోతి వెలిగినంత కాలం తమ గ్రామంలోని సిరిసంపదలకు లోటువుండదనేది ఇక్కడ ప్రజల నమ్మకం.

pc: youtube

నాలుగు తరాల గ్రామస్థులు

నాలుగు తరాల గ్రామస్థులు

నందాదీపంగా పిలిచే ఆ జ్యోతి వెలుగులకు 400 ఏళ్ల చరిత్రకు ఆధారం లేకపోయినా దీపం నిరంతరం వెలుగుతూనే వుంటుందని నాలుగు తరాల గ్రామస్థులు పేర్కొంటున్నారు.

pc: youtube

కొంగుబంగారం

కొంగుబంగారం

ఆలయంలో కొలువు తీరిన సీతారామస్వామి భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు.

pc: youtube

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

పీచర వంశీయులు ఇక్కడ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఆలయం మానేరు నదీ తీరంలోని పచ్చని పొలాల మధ్య వుండటంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది.

pc: youtube

మానవులకు, దేవునికి వున్న బంధం

మానవులకు, దేవునికి వున్న బంధం

ఈ విధంగా గత 400ల సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం కలక్కుండా వెలుగుతున్న ఈ దీపం మానవులకు, దేవునికి వున్న బంధాన్ని తెలియజేస్తుంది.

pc: youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి