Search
  • Follow NativePlanet
Share
» »మనదేశంలో రావణాసురుడు ఆలయాలు ఇవే !

మనదేశంలో రావణాసురుడు ఆలయాలు ఇవే !

By Mohammad

రావణాసురుడు ... ఈయన గురించి ఎవరికి తెలీదు! రామాయణం లో విలన్ గా ఈయన అందరికి సుపరిచితమే. ఇతను 10 శిరస్సులను కలిగిఉంటాడు. సీతాదేవి మీద మనసు పడి, రాముడు లేని సమయాన దొంగచాటుగా ఎత్తుకొని పోతాడు రావణుడు. రావణుడి గురించి ఎవరినైనా అడగండి అతను చెడ్డవాడే అని అంటారు.

ఇది కూడా చదవండి : రామాయణం జరిగిన 20 ప్రదేశాలు !

కానీ మీకొక విషయం తెలుసా ? రావణుడిని దేవునిగా భావించి కొలిచే ఆలయాలు మన దేశంలో ఉన్నాయి. అవును నిజమండి బాబోయ్ ! చెడ్డవాడు అని ముద్రపడ్డ ఈయనను పూజించడం ఏంటి ? అని ఆశ్చర్యపడుతున్నారా ? అయితే విషయంలోకి పోదాం పదండి ..

బిస్రఖ్, ఉత్తరప్రదేశ్

బిస్రఖ్, ఉత్తరప్రదేశ్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిస్రఖ్ అనే గ్రామంలో రావణుడి గుడి ఉన్నది. ఇక్కడ దసరా నాడు మండే అగ్ని గోళాలతో రావణాసురుడిని కాల్చరు. రావణుడు ఇక్కడ పుట్టినట్లు స్థానికులు చెబుతారు. రోజూ వందల సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు.

చిత్ర కృప : Donaldduck100

కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్

కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడలో కూడా రావణాసురుడి ఆలయం ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ మొత్తం మీద ఇక్కడ మాత్రమే రావణాసురుణ్ణి పూజిస్తారు. బీచ్ కు చేరువలో ఉండటంతో, సాయంత్రం వేళ యాత్రికులు వస్తుంటారు. ఆలయంలో రావణ విగ్రహాలు, మహా శివుని విగ్రహం కూడా ఉంది.

కాన్పూర్, ఉత్తర ప్రదేశ్

కాన్పూర్, ఉత్తర ప్రదేశ్

కాన్పూర్ లోని రావణాసురుడు ఆలయాన్ని కేవలం దసరా రోజు మాత్రమే తెరుస్తారు. అప్పుడే భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. రావణుడిని రాక్షసుడిగా కాక ఒక దేవుడిగా దేవుడిగా పూజిస్తారు భక్తులు.

విదిష, మధ్య ప్రదేశ్

విదిష, మధ్య ప్రదేశ్

విదిష అనే ప్రాంతం, భోపాల్ నగరానికి దగ్గరలో ఉంటుంది. ఏటా నిర్వహించే ఉత్సవాల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై రావణాసురుని ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ ఆలయంలో రావణుడి 10 అడుగుల విగ్రహానికి పూజలు చేస్తారు.

మండ్సుర్, మధ్య ప్రదేశ్

మండ్సుర్, మధ్య ప్రదేశ్

మండ్సుర్ పురాతన ప్రదేశం. హరప్పా కాలం నాటి అవశేషాలు ఇక్కడ బయటపడ్డాయి. ఈ ప్రదేశంలో కూడా ప్రసిద్ధి చెందిన రావణాసురుడి ఆలయం కలదు. రావణుడితో పాటు ఆలయంలో మరికొన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి.

చిత్ర కృప : native planet

మండోర్, జోద్పూర్, రాజస్థాన్

మండోర్, జోద్పూర్, రాజస్థాన్

రాజస్థాన్ లోని జోధ్పూర్ లో మౌద్గిల్ బ్రాహ్మణులు ఉన్నారు. వీరు రావణ వంశానికి చెందిన వారుగా భావిస్తారు. వీరు దసరా వేడుకలను జరుపుకొను కానీ, ఆ రోజున రావణాసురుడికి పిండ ప్రధాన చేస్తారు. వీరు తమ వంశ మూల విరాట్ అయినా రావణుడికి గుడి నిర్మిస్తున్నారు.

చిత్ర కృప : Indi Samarajiva

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X