» »ఆత్మహత్యలకు పాల్పడేటట్లు జనాలను హిప్నటైజ్ చేస్తోన్న ఢిల్లీలోని భయానక భవనం !

ఆత్మహత్యలకు పాల్పడేటట్లు జనాలను హిప్నటైజ్ చేస్తోన్న ఢిల్లీలోని భయానక భవనం !

Written By: Venkatakarunasri

కొన్ని స్థలాలు అందమైనవిగా వున్నా దగ్గరకు వెళితే అక్కడ కొంత భయానకం ఆవహిస్తుంది. ఏదైనా ఒక స్థలం గురించి మనం అనుకున్నంత సామాన్యంగా వుండదు. తెల్లగా ఉండేవన్నీ పాలు కావు కొన్ని అందమైన స్థలాలు కూడా అద్భుతాలు కావు. ఏంటి ఈ వ్యాసంలో చెప్పబోతున్నాను అనుకుంటున్నారా?

నేను వ్యాసంలో చెప్పాలని అనుకునే స్థలం ఒక ఒక భయంకరమైన ప్రదేశం. ఆశ్చర్యం ఏమంటే ఇక్కడ బాలీవుడ్ సినిమా "పీకె" చిత్రంలోని ఒక సీన్ ఈ స్థలంలో చిత్రీకరించారు. ఇదొక పురాతనమైన స్మారకం. ఈ స్మారకాన్ని అగ్రసేన్ కీ బావోలి అని పిలుస్తారు.

ఆత్మహత్యలకు పాల్పడేటట్లు జనాలను హిప్నటైజ్ చేస్తోన్న ఢిల్లీలోని భయానక భవనం !

ఎక్కడుంది?

ఎక్కడుంది?

ఈ అగ్రసేన్ కీ బావోలి స్మారకం వుండేది మన భారతదేశ రాజధాని ఢిల్లీలో. ఇది ఒక ఢిల్లీలోని అత్యంత పురాతనమైన స్మారకం. పీ.కె సినిమా రిలీజ్ అయినతర్వాత ఈ స్థలానికి అనేకమంది పర్యాటకులు సందర్శించుటకు రావటం జరుగుతోంది. ఇది న్యూఢిల్లీ దగ్గర కోనాట్ ప్రదేశం సమీపంలోని హేయ్లే రోడ్ లో ఇరుకైన సందులో ఉంది.

ప్రయాణం

ప్రయాణం

ఈ అగ్రసేన్ కీ బావోలికి జంతర్ మంతర్ నుంచి సుమారు 1.5 కి.మీ దూరంలో వుంది. ఇండియా గేట్ నుంచి 2 కి.మీ దూరంలో వుంది. ఈ స్మారకం ప్రవేశం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంల వరకు పర్యాటకులకు ప్రవేశం కలదు.

అగ్రసేన్ కీ బావోలి లేదా ఉగ్రసేన్ కీ బావోలి

అగ్రసేన్ కీ బావోలి లేదా ఉగ్రసేన్ కీ బావోలి

ఎరుపు రంగులో ఇసుకరాయి ప్యానెల్ దాని మీద అధికారికంగా ఉగ్రసేన్ కీ బావోలి అని రాసివుంది. భారతదేశం యొక్క రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చే సమయంలో అంటే 1911 సంతర్వాత ఈ స్మారకం కనుమరుగైంది.

PC: Anupamg

బావోలి అంటే ఏమిటి?

బావోలి అంటే ఏమిటి?

బావోలి అంటే తెలుగు భాషలో పుష్కరిణి లేదా కొలను. ఇది ఒక అద్భుతమైన వాస్తు నిర్మాణాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా మెట్లతో నిర్మించబడిన అంతస్థు వలె కనపడుతుంది. ఇక్కడి సౌందర్యం చూసి అనందించవలెను.

PC: Deepak Kumar

భారత పురాతత్త్వ శాస్త్రం ప్రకారం

భారత పురాతత్త్వ శాస్త్రం ప్రకారం

భారతదేశం యొక్క పురాతత్త్వ శాస్త్ర సమీక్ష ప్రకారం, అగ్రసేన్ కీ బావోలి 58.2 మీటర్లు మరియు 13.71 మీటర్ల భూమి లోపల వ్యాపించివున్నది. దీనిని రాతికట్టడం అని కూడా పిలుస్తారు. స్మారక చిహ్నాన్ని నాలుగు దశలుగా విభజించవచ్చు. ఇక్కడ సుమారు 108 మెట్లు వున్నట్లుగా కనపడుతుంది.

PC: Anupamg

స్మారక మూలాలు

స్మారక మూలాలు

కొందరి అంచనా ప్రకారం తుగ్లక్ లేదా ఇబ్రహిం లోడి నిర్మాణంలో అగ్రసేన్ కీ బావోలిని నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే ఎవరు ఖచ్చితంగా నిర్మించారు అని చెప్పటానికి ఏ పురాణాలూలేవు. దానికి బదులుగా ఒక స్థానిక కథనం ప్రకారం.....

PC: Prateek Rungta

మహాభారత కాలంలో నిర్మాణం

మహాభారత కాలంలో నిర్మాణం

అయితే ఒక స్థానిక కథనం ప్రకారం మహారాజు అగ్రసేన్ చక్రవర్తి నిర్మించాడని చెప్పవచ్చును. మహాభారత కాలంలో హరియాణ ఆగ్రోహ అనే ప్రాచీన పట్టణంలో అతను జీవించెనని నమ్ముతారు.

PC: Supreet Sethi

ఇదొక భయంకరమైన స్థలం

ఇదొక భయంకరమైన స్థలం

అగ్రసేన్ కీ బావోలి ఒక భయంకరమైన స్థలం (హంటెడ్ ప్లేస్) అని పిలుస్తారు. ఇక్కడి పుష్కరిణిలో నీళ్ళు లేవు. కొంచెం మాత్రం మిగిలివుంది. ఇక్కడ విశేషంగా ఆత్మహత్యలకు పాల్పడేటట్లు జనాలను హిప్నటైజ్ చేసే శక్తి వుందని చెప్పవచ్చును.

PC: Anupamg

ఆత్మహత్య కేసు

ఆత్మహత్య కేసు

ఆత్మహత్య కేసులు కూడా వార్తాపత్రికలలో అధిక సంఖ్యలో సంఘటనలు ఇక్కడ జరిగాయి. ఇది జూన్ 2007 లో ఒక హిందూ వార్తాపత్రికలో ప్రచురించబడింది. అదేమంటే ఆ సమయంలో నీటి మట్టం "కేవలం నాలుగు నుంచి ఐదు అడుగుల లోతు మాత్రమే" వుందని గుర్తించబడినది.

PC: Himanshu Nagar

ఆత్మహత్య చేసుకొనేవిధంగా ప్రేరేపిస్తుంది

ఆత్మహత్య చేసుకొనేవిధంగా ప్రేరేపిస్తుంది

ఈ స్థలం ముఖ్యంగా ఆత్మహత్య చేసుకొనేవిధంగా ప్రేరేపిస్తుంది అంట. అదే విధంగా సూర్యాస్తమయం అవుతూ వుందంటే ఈ స్థలంలో ఒక్క పర్యాటకుడు కూడా వుండడు. స్థలం ఖాళీచేసి వెళ్ళిపోతారు. ఈ ప్రదేశం భయంకరమైన ప్రదేశాల జాబితాలో చేర్చబడినది.

108 మెట్లు

108 మెట్లు

ఇక్కడ 108 మెట్లు వున్నాయి. ఇక్కడ మర్చిపోయి సాయంసమయాలలో వుంటే వారికి అనేక భయానకమైన అనుభవాలు ఎదురౌతాయంట. ఈ విధమైన అనుభవాల వల్ల సాయంత్రం సమయాలలో సందర్శకులకు ఈ స్థలం మూసివేయబడింది.

PC: Anupamg

మిస్టీరియస్ ఆత్మహత్యలు

మిస్టీరియస్ ఆత్మహత్యలు

అగ్రసేన్ కీ బావోలి లోపల నీరు వుంది. ఆ నలుపురంగులో వున్న నీరు ఆత్మహత్య చేసుకొనేందుకు వారిని ప్రేరేపిస్తుందంట. ఇక్కడి నీరు ఆశ్చర్యకరంగా నలుపు రంగులో వుంటుంది, రహస్యంగా జనాలు ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతూవుంటారు.

PC: Prateek Rungta