Search
  • Follow NativePlanet
Share
» »అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ మణిపురి

అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ మణిపురి

By Beldaru Sajjendrakishore

అడ్వెంచర్ టూరిజం. పర్యాటక రంగంలో ఇటీవల బాగా పాపులర్ అవుతున్న విధానం. మారుతున్న జీవన శైలితో ప్రకతికి దూరంగా నాలుగు గోడల మధ్యనే మనం ఎక్కువగా పనిచేస్తున్నాం. అయితే వీలున్నప్పుడు దూరమైన ప్రకతిలో గడపడానికి ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారి కోసం అనేక రాష్ట్రాలు రివర్ రాఫ్టింగ్, కేవింగ్, డైవింగ్, రక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, విండ్ సర్ఫింగ్ తదితర సహసక్రీడలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇందులో ఏ ఒకటో రెండో ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులను అనుసరించి అందుబాటులో ఉంటాయి. అయితే మణిపురి రాష్ర్టం మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ రకాల అడ్వెంచర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరింకెందుకు ఆలస్యం ఓ సారి మణిపురిని చుట్టేసి వద్దామా....

1. రాఫ్టింగ్...

1. రాఫ్టింగ్...

Image source

ప్రక`తిని ముఖ్యంగా జలక్రీడలను ఆస్వాధించే వారికి రాఫ్టింగ్ బాగా నచ్చుతుంది. కదిలే నదితో సమానంగా మనసు ఉరకలు వేస్తేంటే ప్రత్యేక బోటులో ఆ నదీ జలాలతో పోటీ పడుతూ రివ్వున ముందుకు సాగిపోవడం మరపురాని అనుభూతి. అటువంటి అనుభూతిని అందించడానికి మణిపురిలో అనేక ప్రాంతాలు మీకు సదా ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ రాఫ్టింగ్ ల్యామ్డన్ ఇన్ స్టిట్యూట్ నుంచి నందల్ ఇన్ బాగ్ వరకూ 16 కిలోమీటర్ల పాటు కొనసాగుతుంది. దాదాపు 2 గంటలు పట్టే ఈ రాఫ్టింగ్ మధురానుభూతిని కలిగిస్తుందనడలో సందేహం లేదు.

2.కేవింగ్

2.కేవింగ్

Image source

సదా అన్వేషణ గుణమున్న వారికి ఈ విధానం బాగా నచ్చుతుంది. భూమి అంతర్భాగంలో ఇంకా ఏముందో చూడాలని భావించే వారికి కేవింగ్ అత్యంత ఇష్టమైన అడ్వెంచర్. భూమి అంతర్భాగంలోకి గుహల ద్వార వెలుతూ అక్కడి సహజ సిద్దంగా ఏర్పడిన శిలలను, అందులో కనిపించే శిలాజాలను చూస్తూ ముందుకు వెలితే కలిగే అనుభూతిని నేరుగా ఆస్వాధించాల్సిందే. ఇటువంటి వారికి మణిపురిలోని ఉక్రల్, తమెంగ్లాగ్ జిల్లా ఆహ్వానం పలుకుతోంది. ఇక్కడ ఆకాశాన్ని తాకే శిఖరాలు కలిగిన పర్వతాలతో పాటు భూమి లోపలికి తీసుకువెళ్లే అనేక గుహలు కలిగిన పర్వతాలు కూడా ఎన్నో ఉన్నాయి.

3.రాక్ క్లైంబింగ్

3.రాక్ క్లైంబింగ్

Image source

ఎతైన, కఠిన శిలలను ఎగబాకడమే రాక్ క్లైంబింగ్. మణిపురి భౌగోళిక పరిస్థితులను అనుసరించి దాదాపు ప్రతి చోట రాక్ క్లైంబింగ్ కు అనువైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో రాక్ క్లైంబింగ్ ను ఇష్టపడే వారికి మొదటి ఛాయిస్ మణిపురినే. ఈ క్రీడ వల్ల పట్టుదల, కఠిన శ్రమ అలవడుతాయని మానసిక నిపుణులు కూడా చెబుతుంటారు.

4. ట్రెక్కింగ్

4. ట్రెక్కింగ్

Image source

ప్రక`తితో మమేకమవుతూ వీచే చల్లగాలిని, ఎదురొచ్చే గువ్వలను పక్షులను చూస్తూ కనుచూపు మేరలో కనిపించే పచ్చని చెట్లను దాటుకుంటూ అలా నడిచిపోతుంటే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేము. చాలా వరకూ దట్టమైన అడవుల్లో ఈ ట్రెక్కింగ్ కొనసాగుతుంది. ఇటువంటి దట్టమైన అడువులు ఎన్నో మనకు మణిపురిలో కనిపిస్తాయి. అంతేకాకుండా నిపుణులైన గైడ్ లు కూడా అందుబాటులో ఉంటారు. దీంతో మిగిలిన ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే మణిపురికి ట్రెక్కింగ్ కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఉక్రుల్ నుంచి తమాంగ్ వరకూ ఉన్న పదుల సంఖ్యల అటవీ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది.

5. విండ్ సర్ఫింగ్

5. విండ్ సర్ఫింగ్

Image source

నీటి అలల పై గాల్లో తేలియాడుతూ ముందుకు సాగిపోయే క్రీడే విండ్ సర్ఫింగ్. ఈ క్రీడకు కూడా మనకు మణిపురి పర్యాటక శాఖ రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. లాక్టోర్ సరోవరం సమీపంలో నిపుణుల మధ్య మనం విండ్ సర్ఫింగ్ అనుభూతిని ఎటువంటి భయం లేకుండా పొందవచ్చు.

6. స్థానిక క్రీడలన్నెంటినో...

6. స్థానిక క్రీడలన్నెంటినో...

Image source

మణిపురికి పర్యాటకానికి వెళ్లినప్పుడు కేవలం మనమే సాహసయాత్రలు చేయడమే కాకుండా స్థానిక క్రీడలను కూడా ఆస్వాధించే ఏర్పాటును అక్కడి టూరిజం శాఖ చేసింది. ముఖ్యంగా యూబిలక్పీ (కొబ్బరిబోండాంతో రబ్బి లాంటి క్రీడ), ఇయాంగ్ తనాబా (బోట్ రేసింగ్), మక్నా (మణిపురి కుస్తీ), తాగ్ తా మరియు సరిత్ సరత్ (మణిపురి మర్షల్ ఆర్ట్) వంటిని చూడవచ్చు.

7. హస్తకళలను మూటగట్టుకుని

7. హస్తకళలను మూటగట్టుకుని

Image source

మణిపురి సాహస క్రీడలకు, అడ్వెంచర్ టూరిజానికే కాకుండా అక్కడి హస్తకళలకు కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ముఖ్యంగా రంగురంగుల పూసలతో హారాలు, తెల్లని, ఎర్రని దారాలతో నేసిన దుస్తులు కూడా మనం తీసుకుని రావచ్చు.

8 మరింత సమాచారం కోసం...

8 మరింత సమాచారం కోసం...

Image source

దేశంలోని చాలా చోట్ల మణిపురి రాజధాని ఐన ఇంపాల్ కు రవాణా మార్గాలు ఉన్నాయి. అక్కడ ఆ రాష్ర్టం పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో సంప్రదించి మనకు కావాల్సిన అడ్వెంచర్ టూరిజం స్పాట్ ఎక్కడ ఉందో ఎలా వెళ్లాలో తదితర వివరాలన్నీ కనుగొనవచ్చు.

డైరెక్టరేట్ ఆఫ్ టూరిజం

ఇంపాల్ వెస్ట్, నార్త్ ఏ ఓ సీ

మనిపురి 795001

E-mail: manipurtsm@gmail.com

E-mail: mtqueries@gmail.com

Phone: (0385) 242 1794

Fax: (0385) 245 0964

Read more about: river rafting travel tourism
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more