Search
  • Follow NativePlanet
Share
» »అందరూ మరిచే అహ్మదాబాద్ ఆకర్షణలు !

అందరూ మరిచే అహ్మదాబాద్ ఆకర్షణలు !

అహ్మదాబాద్ పట్టణం గుజరాత్ రాష్ట్రానికి గుండెకాయ వంటిది. సాంస్కృతిక పరంగా, వాణిజ్యం పరంగా రాష్ట్రంలో ప్రధానమైన నగరం. కళలు, యాత్రలు, వాణిజ్యం వీటి అన్నిటి మధ్యా ఈ నగరం లో నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మంచి ఊపు అందుకుంది. అంతా పాత కొత్తల కలయిక గా వుంటుంది. ఒకవైపు పురాతనమైన మహాత్మా గాంధి సబర్మతి ఆశ్రమం మరియు సిడి సైయాద్ మాస్క్ నుండి మరోవైపు డిజైనర్ మరియు ఆర్టిస్ట్ స్టూడియో ల వరకూ ఇక్కడ కలవు. తిండి ప్రియులకు అద్భుత రుచులు కల అనేక స్థానిక శాకాహార వంటకాలు అహ్మదాబాద్ ను మరచి పోలేని ప్రదేశంగా చేస్తాయి. అహ్మదాబాద్ లో ఎన్నో పర్యాటక ఆనందాలు. వాటిలో మందు ప్రియులకు ఇష్టమయ్యే వైన్ ఒకటి.

ప్రధాన ఆకర్షణలు
జామా మసీద్
ఇండియా లో ఆరు జామా మసీదులు ఉన్నప్పటికీ, అహ్మదాబాద్ లోని జామా మసీదు వంటి అద్భుత నిర్మాణం మీరు మరెక్కడా చూడరు. ఈ జామా మసీదును క్రి. శ. 1452 సం. లో పట్టణ వ్యవస్థాపకుడు, సుల్తాన్ అహ్మద్ షా కట్టించాడు. ఈ మసీద్ నగరం మధ్యలో వుంటుంది. దీని శిల్ప శైలి హిందూ మరియు ముస్లిం శిల్ప శైలి లో వుంది. దీనికి కారణం, ఇక్కడ పడగొట్టబడిన హిందూ మరియు జైన్ దేవాలయాల కట్టడ భాగాలను మసీదు నిర్మాణంలో వాడారు. మసీదుకు 260 స్తంభాలు, 15 డోములు వుండి చూస్తె మరచిపోలేని ఆకర్షణగా వుంటుంది.

హతీసింగ్ జైన్ టెంపుల్
గుజరాత్ లో జైన మతస్తుల జనాభా అధికం. ఈ మతస్తుల మతపర కళలు ఎంత సుందరమైనవి అనే అంశం హతీసింగ్ జైన టెంపుల్ చూస్తె తెలుస్తుంది. ఈ టెంపుల్ 1845 సంవత్సరంలో షెట్ హతీసింగ్ అనే వ్యాపారి నిర్మించాడు. దీనిని 15 వ జైన తీర్తంకరుడైన శ్రీ ధర్మనాథ కు అంకితం ఇచ్చారు. టెంపుల్ కాంప్లెక్స్ అంతా పూర్తి తెల్లటి మార్బుల్ రాయి. ప్రతి ఒక్క భాగం కూడా అందమైన నగిషీలతో చెక్కబడి వుంటుంది.

సిది సయ్యద్ మాస్క్
ఈ మాస్క్ లేదా మసీదుని సిద్ది సయ్యద్ అనే గుజరాత్ చివరి సుల్తాన్ కొలువులో కల ఒక సైనికుడు నిర్మించాడు. ఎంతో బిజి గా వుండే ప్రదేశంలో కల ఈ మసీదు చాలా అందంగా వుంటుంది. అహమదాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టి ట్యూట అఫ్ మేనేజ్ మెంట్ సంస్థ తమ లోగో కి సైతం ఈ మసీదు లోని ఆర్ట్ వర్క్ ని నమూనా గా తీసుకుంది. ఈ మసీదు సందర్శనలో ఇక్కడ కల కదిలే గోపురాలు చూడటం మరువకండి. ఒక గోపురం ముట్టుకుంటే మిగిలిన గోపురాలు కదులుతాయి. దీనిని ఎలా నిర్మించారా అనేది పరిశోధించ టానికి గాను బ్రిటిష్ వారు ఈ నిర్మాణం కొంత పడగొట్టటం కూడా జరిగింది. కాని నేటికి, ఈ మిస్టరీ పరిష్కారం కాలేదు. మహిళలకు ఈ మసీదులోకి ప్రవేశం లేదు.

శ్రీ స్వామినారాయణ్ టెంపుల్

శ్రీ స్వామినారాయణ్ టెంపుల్ అంతా చాలావరకు టేక్ వుడ్ నిర్మాణం. పై భాగాలకు ఆకర్షణీయ రంగులు వేశారు. అయితే ఇక్కడ కల అన్ని చెక్కడాలు మతపరమైన మూర్తులు కావు. కొన్ని చెక్కడాలు సాంప్రదాయ దుస్తులలో కల సాధారణ వ్యక్తి, 1857 సిపాయిల కలహం దృశ్యాలు కలవు. లోపలికి వెళితే చాలు కళ్ళు మిరుమిట్లు గొలిపే బంగారు మరియు చాన్దిలీయర్లు కనపడతాయి. హిందువులకు ఈ టెంపుల్ ఒక గొప్ప యాత్రా స్థలం. ఇక్కడ యాత్రి కులకు ఒక గెస్ట్ హౌస్ కూడా కలదు.

దాదా హరి ణీ వావ్
వావ్ అంటే మెట్ల బావి అని గుజరాత్ లో చెపుతారు. గుజరాత్ లో నీరు చాలా విలువైనది. ఇక్కడ నీటిని నిలువ చేస్తారు. దాదా హరి ణీ వావ్ వద్ద కల స్టెప్ వెల్ లేదా మెట్ల బావి తప్పక చూడాలి. ఇది దశ భుజ ఆకారంలో వుండి అత్యంత ఆకర్షణీయంగా వుంటుంది. మెట్లు దిగి మీరు లోపలి వరకు వెళ్లి అక్కడ గోడలపై కల అద్భుత సంస్కృత మరియు అరబ్బీ లిఖితాలు చెక్కినవి చూడవచ్చు.

అందరూ మరిచే అహ్మదాబాద్ ఆకర్షణలు !

అడలాజ్ ణీ వావ్
ఈ మెట్ల బావి గుజరాత్ లోని వండర్స్ లో ఒకటి. దీనిని రాణి రూడా బాయ్ క్రి. శ. 1499 లో నిర్మించినది. ఈ బావి అహ్మదాబాద్ కి 18 కి. మీ. ల దూరంలో ఉత్తరంగా వుంది. ఈ బావిని అయిదు లెవెల్స్ గా విభజించారు. దీనికి అందమైన స్తంభాలు,పక్షి బొమ్మల చెక్కడాలు , పూవులు, చేపలు మొదలైన చెక్కడాలు కలవు. బావి యొక్క ప్రతి భాగం అందంగా వుంటుంది. ఇక్కడే మాతా రాణి రుదాబాయ్ టెంపుల్ ఒకటి ప్రవేశంలోనే కలదు. ప్రతి సందర్శకుడు, ఇప్పటికి అక్కడే వున్నదని భావిస్తున్న మాటా రాణి రూదాబాయ్ ని ప్రార్ధించి లోపలి వెళతాడు. ఈ బావిని హిందూ రాణి నిర్మించినప్పటికీ, దాని నిర్మాణ పని తనం అంతా ముస్లిం శిల్ప శైలిని చూపుతుంది. ఈ బావిలోని ఉష్ణోగ్రతలు, ఎల్లపుడూ బయటి కంటే కూడా ఆరు డిగ్రీలు తక్కువగా వుంది చల్లగా వుంటుంది. ఈ కారణంగా మండు వేసవిలో కూడా ఈ బావిలోని నీరు ఎంతో చల్లగా వుండటం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X