Search
  • Follow NativePlanet
Share
» »అక్కులం సరస్సులో విహరించడం..పిక్నిక్ అనుభవం.. సూపర్ గా ఉంటుంది..

అక్కులం సరస్సులో విహరించడం..పిక్నిక్ అనుభవం.. సూపర్ గా ఉంటుంది..

అక్కులం సరస్సులో విహరించడం..పిక్నిక్ అనుభవం.. సూపర్ గా ఉంటుంది..

"గాడ్స్ ఓన్ కంట్రీ" గా పేర్కొనే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. బ్రిటిష్ వారు ఈ నగరాన్ని త్రివేండ్రం అని పిలిచేవారు. ఇలా త్రివేండ్రం పేరుతో చలామణి అవుతున్న ఈ నగరాన్ని, 1991 సంవత్సరం లో ఇక నుండి తిరువనంతపురం గా పేర్కొనాలని ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది. దక్షిణ భారతదేశం లో, పశ్చిమ కోస్తా తీరం దక్షిణ భాగం అంచున భారతమాత పాదాల చెంతన ఉంటుందీ నగరం. నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ అనే సంస్థ ఈ మధ్యనే 'తప్పక సందర్శించవలసిన' ప్రాచీన ప్రదేశాల జాబితాలో ఈ నగరాన్ని కూడా జేర్చింది. '10 గ్రీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా' లిస్టు లో ఉన్న ఈ నగరాన్ని, మహాత్మా గాంధీ 'ఎవర్ గ్రీన్ సిటీ అఫ్ ఇండియా' గా పేర్కొన్నారు.

తిరువనంతపురమనే ఈ నగరం పేరుకు కారణమైన వేయి తలల అనంత శేషునిపై పవళించిన పద్మనాభస్వామి, ఈ నగర నడిబొడ్డున పద్మనాభస్వామి ఆలయం లో కొలువై ఉన్నాడు. పశ్చిమ కోస్తా తీరం లో ఏడు కొండలపై ఉండే ఈ నగరం ఎంతో అభివృద్ధి చెందింది, అయినప్పటికీ తన ప్రాచీన గత వైభవాన్ని కోల్పోలేదు. పురాణ గాధల ఆధారం గా పరశురాముడు, ఈ ప్రదేశం కోసం సముద్రునితో మరియు వరుణుడితో పోరాడాడు అని, అలాగే, వామనుని చే పాతాళ లోకానికి అణచదొక్కబడ్డ బలి చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని విశ్వసిస్తారు.

కరమణ నదీ తీరం, అక్కులం సరస్సు సుందర నేపధ్య దృశ్యాలు

కరమణ నదీ తీరం, అక్కులం సరస్సు సుందర నేపధ్య దృశ్యాలు

కరమణ నదీ తీరం, అక్కులం సరస్సు సుందర నేపధ్య దృశ్యాలు సందర్శకులను కదలనీయవు. తిరువనంతపురం వెళ్ళినపుడు సందర్శకులు నాయర్ డ్యాం, జూలాజికల్ పార్క్, వన్యప్రాణుల అభయారణ్యం మరచిపోకుండా చూడదగ్గ ప్రదేశాలు. కృత్రిమ జీవనం నుండి విరామం తీసుకుని ప్రకృతి ఆరాధన కోసం వచ్చిన సందర్శకులకు ఇక్కడ సంతోషం లభిస్తుంది. అలాగే, తిరువనంతపురం లోని 'హ్యాపీ ల్యాండ్ వాటర్ థీమ్ పార్క్' వయోబేధం లేకుండా సందర్శకులందరినీ అలరిస్తుంది. షాపింగ్ ఇష్టపడే వారికోసం చాలై బజార్ ఉంది.

PC:Suniltg

గోల్డెన్ బీచ్ లు, కొబ్బరి చెట్లతో కనువిందు చేసే సముద్ర తీరాలు

గోల్డెన్ బీచ్ లు, కొబ్బరి చెట్లతో కనువిందు చేసే సముద్ర తీరాలు

గోల్డెన్ బీచ్ లు, కొబ్బరి చెట్లతో కనువిందు చేసే సముద్ర తీరాలు, మంత్రముగ్ధులను చేసే బ్యాక్ వాటర్స్, ఘనమైన వారసత్వ సంపద, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ఇంకా కొన్ని సమీప స్థలాలను సందర్శించడానికి సుదూర ప్రదేశాలనుండి టూరిస్టులు ఇక్కడకు వస్తూంటారు.

PC:PC:Mohan K

తిరువంతపురం నుండి 10 కి.మీ. దూరంలో అక్కులం సరస్సు

తిరువంతపురం నుండి 10 కి.మీ. దూరంలో అక్కులం సరస్సు

తిరువంతపురం నుండి 10 కి.మీ. దూరంలో అక్కులం సరస్సు ఉంది. ఇది మంచి పిక్నిక్ స్పాట్. ఇది పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. అక్కులం సరస్సులో మనం బోటింగ్ చేయవచ్చు. అప్పుడు మనకు చల్లని గాలులు, నీటి మీద అలలు ఎంతో హాయిని కలిగిస్తాయి. నిస్సందేహంగా ఇక్కడ ఆకర్షణాలు అనుభవించవచ్చు.

PC:Easa Shamih

ఇది ఒక టూరిస్ట్ విలేజ్

ఇది ఒక టూరిస్ట్ విలేజ్

అక్కులం సరస్సు నిజానికి వేలి సరస్సు యొక్క బాగం. ఇది సెలయేరు,అరేబియా సముద్రం కలిసే కూడలిలో ఉంది. ఇది దక్షిణ కేరళలో ఉన్న కొన్ని పిక్నిక్ స్పాట్స్ లో ఇది ఒకటిగా ఉంది. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉండటం వల్ల ఎక్కువగా సందర్శకులు వస్తుంటారు. పెద్దలకే కాదు, పిల్లలకోసం కూడా అందమైన ఉద్యానవనాలున్నాయి. ఇక్కడ బస చేయటానికి రిసార్ట్స్ ఉన్నాయి. ఈత, వాటర్ స్పోర్ట్స్ మొదలైన అనేక రకలైన క్రీడలు ఉన్నాయి.

PC: Akhilan

బోట్ క్లబ్ :

బోట్ క్లబ్ :

అలక్కుం సరస్సు వద్ద బోట్ క్లబ్ ను 1989 నుండి విధినిర్వణ కొరకు ప్రారంభించారు. బోటింగ్ సౌకర్యాలు బాగున్నాయి. స్పీడ్ పడవలు, సఫారి పడవలు, పెడల్ బోట్లు ద్వారా విహరిస్తు అక్కులం టూరిస్ట్ విలేజ్ ను చేరుకోవచ్చు. అలాగే పెడల్ బోట్లును స్వయంగా మీరు ప్రయత్నించవచ్చు. సంప్రదాయక శైలి కేటువాల్లు (ఇంటి పడవ) కూడా రాత్రి సమయంలో అందుబాటులో ఉంటుంది.

PC: Akhilan

 గైడ్ తో పాటు ఇతర ఆట సౌకర్యాలను

గైడ్ తో పాటు ఇతర ఆట సౌకర్యాలను

పెద్దల కోసం స్విమ్మింగ్ సూట్ తప్పనిసరిగా అందిస్తారు. అలాగే గైడ్ తో పాటు ఇతర ఆట సౌకర్యాలను అందిస్తున్నారు. అలాగే కొత్త రైడ్ మరియు స్నాక్ బార్ తో పిల్లలు కోసం పార్కులు అందంగా నిర్వహిస్తున్నారు. అలాగే కొత్తగా ప్రారంబించిన మ్యూజికల్ ఫౌంటెన్ పర్యాటలకు అమితంగా ఆకర్షిస్తుంది.

PC:Suniltg

బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు

బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం అనుమతించబడదు. అలాగే మధ్యం సేవించే వారికి పెనాల్టీతో పాటు జైలు శిక్ష విదిస్తారు. అలాగే పర్యాటకుల, ప్రేమికలు ఇక్కడ బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం, అసభ్యంగా ప్రవిర్తించడానికి వీలు లేకుండా నిషేధింపబడ్డారు. ఆయుర్వేద మసాజ్ కు వెళ్లేటప్పుడు టూరిజం శాఖ ఆమోదించిన ఆయుర్వేద కేంద్రాలకు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది.

PC:Mohan K

పడవల్లో ప్రయాణించాలనుకునే వారికి

పడవల్లో ప్రయాణించాలనుకునే వారికి

పడవల్లో ప్రయాణించాలనుకునే వారికి జాకెట్లు ధరించడం ఉత్తమం. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో స్థానికి పోలీస్ స్టేషన్ టెలిఫోన్ నెంబరు దగ్గర ఉంచుకోవాలి. పెడల్ పడవ లేదా బోట్ లో ప్రయాణించే ముందుగా సూచనలు చదవడం ఉత్తమం.

అక్కులం పర్యటనకు అనుకూల సమయం

అక్కులం పర్యటనకు అనుకూల సమయం

ఏడాది పొడవునా ఈ టూరిస్ట్ విలేజ్ తెరచి ఉంటుంది. ముఖ్యంగా వేసవి సీజన్లో ఎక్కువ మంది పర్యాటకలు ఇక్కడ సందర్శిస్తుంటారు.

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

ఈ పర్యాటక గ్రామానికి 10కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది. అలాగే త్రివేండ్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఈ టూరిస్ట్ విలేజ్ కు సుమారు 7కిలోమీటర్ల దూరంలో ఉంది.

PC:Easa Shamih

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X