» »ఆసక్తిదాయకమైన గోల్కొండ కోట యొక్క హాంటెడ్ స్టోరీ

ఆసక్తిదాయకమైన గోల్కొండ కోట యొక్క హాంటెడ్ స్టోరీ

Written By: Venkatakarunasri

గోల్కొండ కోట ... దాదాపు హైదరాబాద్ పర్యటన చేసేవారు తప్పక దీనిని సందర్శిస్తారు. కుతుబ్ షాహీ రాజుల హయాంలో నిర్మించిన ఈ భారీ కట్టడాన్ని చూస్తే ఎవ్వరికైనా ఔరా! అని అనిపించకమానదు. కోటలోని గోడలు, కింద చప్పట్లు కొడితే ... అక్కడెక్కడో కొండ పైన ఉన్న రాణి మహల్ వరకు వినిపించే శబ్దం నేటికీ ఆశ్చర్యచకితులను చేస్తాయి. కోట గురించి మరిన్ని విశేషాలు

అద్భుతమైన కట్టడాలు, పురాతన కోటలు,ఆహ్లాదకరమైన పార్కులతో పాటు గోల్కొండ కోట దెయ్యాలకు, ఆత్మలకు నిలయమా?

కాకతీయరాజులు, బహమనీసుల్తానులు, కుతుబ్షాహీ సుల్తానులతో పాటు ఒక అమర ప్రేమను కూడా తనలో దాచుకుందా ఈ చారిత్రకకట్టడం.

ప్రేమ కోసం ప్రాణాలను అర్పించిన తారామతి ఆత్మ దెయ్యంలా మారి గోల్కొండకోటలో తిరుగుతోందా?అసలు ఎవరు ఆ తారామతి?

ఏమిటా ప్రేమకథ ?

చంద్రముఖి సినిమాను తలపించే ఎంతోఆసక్తిదాయకమైన గోల్కొండ కోట యొక్క హాంటెడ్ స్టోరీని ఈ వ్యాసంలో తెలుసుకుందాం

ఆసక్తిదాయకమైన గోల్కొండ కోట యొక్క హాంటెడ్ స్టోరీ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

హైదరాబాద్ మహానగర శివార్లలో గల ఈ గోల్కొండకోట పూర్వం మంగళగిరిగా పిలవబడేది. క్రీశ 1143ప్రాంతంలో ఒక పశువులకాపరికి ఇక్కడ ఒక దేవతా విగ్రహం దొరికింది.ఈ విషయం తెలుసుకున్న అప్పటికాకతీయ రాజులు ఆ ప్రాంతం చాలావిశిష్టమైనదిగా భావించి ఇక్కడ ఒక మట్టి కోటనిర్మించారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

పశువులుకాసే ఒక గొల్లవాని కారణంగా నిర్మితమైనందున ఈ కోటను గొల్లకొండగా పిలిచేవారని కాలగమనంలో గొల్లకొండకాస్త గోల్కొండగా రూపాంతరం చెందిందని చారిత్రుకుల భావన.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

అప్పటినుండి 2శతాబ్దాలు ఈ కోట కాకతీయుల పాలనలోనే వుండేది.1364 లో ఈ కోట బహమనీసుల్తానుల వశమైంది.1518లో కులీకుతుబ్ షా బహమనీసుల్తానులను ఓడించి గోల్కొండరాజధానిగా కులీకుతుబ్ షాహీ సామ్రాజ్యంగా నెలకొల్పాడు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

కులీకుతుబ్ షాహీ సుల్తానులపాలనలో గోల్కొండ మిక్కిలిప్రాశాస్త్యాన్ని పొందింది.అప్పటినుండి 60సం ల కాలంలో వరుసగా మొదటిముగ్గురు సుల్తానులు గ్రానైట్ తో గోల్కొండకోటను పునర్నిర్మించి దాని పరిధిని 5కి.మీలకు విస్తరించారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

1590లో కోట చుట్టూ 15కిమీ ల కొలత గల ఒకపెద్ద ప్రాకారాన్ని నిర్మించారు.తరువాత కుతుబ్ షాహీ పాలకులు 1686లో తమరాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్ కు మార్చివేసారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

1687లో హైదరాబాద్ ను సువిశాలమొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయాలని లక్ష్యంతో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దండెత్తి వచ్చాడు.కానీ గోల్కొండకోట శత్రుదుర్భేజ్యమైనందువలన మొఘల్ సేనలు కోటను వశపరచుకోలేకపోయాయి.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

చివరికి గోల్కొండకు చెందిన ఒక రాజద్రోహి మొఘల్ సైన్యమిచ్చే కానుకలకు ఆశపడి కోట రహస్యాలను శత్రుసైన్యానికి చేరవేయటంతో ఔరంగజేబు గోల్కొండ కోటను వశపరచుకున్నాడు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

తరువాత మొఘల్ సైన్యాలు గోల్కొండ కోటను ధ్వంసం చేసాయి.గోల్కొండ కోట హిందూ,మరియు ఇస్లామిక్ సమ్మిళిత శైలిలో నిర్మితమైన ఒక అపురూపకట్టడం.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

400అడుగుల ఎత్తుగల ఒక గ్రానైట్ కొండలో 4ప్రత్యేక కోటలు,మరియు దుర్గం చుట్టూ అద్భుతమైన ప్రాకారంతో సుందరంగా వుంటుంది ఈ కోట. ప్రకారంపై కోటకు రక్షణగా 87బురుజులు నిర్మించారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

శత్రువులపై దాడి చేయటానికి బురుజులలో అమర్చిన పెద్ద పెద్ద ఫిరంగులు ఇప్పటికి కూడాఅక్కడ దర్శించవచ్చు 8ప్రవేశ ద్వారాలు,4లిఫ్ట్ బ్రిడ్జీలు, ఇంకా అందులో అసంఖ్యాకమైనరాజభవనాలు, గదులు, దేవాలయాలు, మస్జిద్ లు,భాండాగారాలుఇతర నిర్మాణాలు ఈ ఖిలా లో కలవు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

తూర్పు వైపు గల బాలాహిస్సార్ గేట్ కోటకు ప్రధాన ప్రవేశ ద్వారం అద్భుతమైన డిజైన్ లతో చూడ ముచ్చటగా వుంటుంది. కోటకు ఆగ్నేయభాగంలో గల మరోప్రవేశ ద్వారం పేరు ఫతేదర్వాజా ఈ ద్వారం గుండా ప్రవేశించి విజయం సాధించడంవలన మొఘల్ సైన్యం ఫతేదర్వాజా అని నామకరణం చేసారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

ఈ దర్వాజా అద్భుతమైన ఎకోసౌండ్ ఎఫెక్ట్ కు ప్రసిద్ధి. ఇక్కడ ఒక నిర్దేశిత స్థలంలో చప్పట్లు కొట్టినట్లయితే కొండపై 1000 మీ ల దూరంలో గల బాలాహిస్సార్ బలదారి అనే భవనంలో వినిపిస్తుంది.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ వజ్రాల వెలికితీతకు మరియు వజ్రాలవ్యాపారానికి మిక్కిలి ప్రసిద్దిగానుండెడిది. ప్రపంచప్రసిద్ధి గాంచిన ఎన్నో వజ్రాలు ఇక్కడ లభ్యమయ్యాయి.అంతేకాక భారతమకుటం కోహినూర్ వజ్రం కూడా కుతుబ్ షాహీ ల వద్ద వుండడిదని చరిత్ర చెబుతోంది.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

ప్రజలకు కనువిందుచేసే ఎన్నో నివాసగృహాలు,పరిపాలనాభవనాలు, గోల్కొండలో కలవు.శిలా ఖానా, శవాల స్నానగది, బరీబౌలీ అంబర్ ఖానా,నగీనా బాగ్,రాతిని తొలిచినిర్మించిన దేవాలయం,భారామతిచే నిర్మించబడిన మస్జీద్.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

అక్కన్న,మాదన్నల కార్యాలయాలు, రామదాసు జైలు,దర్బార్ హాల్, రాయల్ కోట్లు,మహాల్సు ఇంకాకుతుబ్ షాహీల పాలనకు ఉపయోగపడిన అనేక నిర్మాణాలు ఇక్కడ కలవు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

బాలాహిస్సార్ గేటునుండి 360మెట్లు ఎక్కగానే బాలాహిస్సార్ బాలదారి అనుపేరు గల ఒక భవనం వస్తుంది.దీనిపై భాగంలో కొండశిఖరాన తారామతిగాన మందిర్, ప్రేమ మతి నృత్యమందిర్ అను రెండుగృహాలు వున్నాయి.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

ఇక్కడ తారామతి, ప్రేమ మతిఅను పేరు కలఇద్దరు నర్తకీలు నివసించేవారు.వీరు ఇక్కడ నృత్యం చేస్తుంటే సుల్తాన్ దర్బార్ నుండి చూసి ఆనందించేవారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

రోజూ వేల సంఖ్యలో టూరిస్టులు వస్తూవుంటారు.వచ్చి అపూర్వమైన అనుభూతికి లోనౌతూవుంటారు.కానీ కొంతమంది అవాంచిత దృశ్యాలవల్ల భయానకఅనుభూతికి లోనయ్యామని అంటూవుంటారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

ఈ కోటలో ఆత్మలు,దెయ్యాలు,సంచరిస్తూవుంటాయనే ప్రచారంలో వుంది.చాలా మంది గోల్కొండను ఒక హాంటెడ్ ప్లేస్ గా భావిస్తారు.వారు కొన్ని అవాంచిత ఘటనలవల్ల తాము తీవ్రంగా భయపడినట్లు చెబుతారు

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

మధ్యాహ్నసమయంలో మరియు సాయంత్రం 6గంటలు దాటాక కాళ్ళగజ్జెల శబ్దాలు, అదృశ్య గానాలు, ఎవరో ఏడుస్తున్నట్లు వింత శబ్దాలు వినపడుతున్నాయని అంటుంటారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

అందర్నీ మిక్కిలి భయకంపితులని చేసే విషయంఏంటంటే తారా మతి ఆత్మ రాయల్ కోట్ హాల్ లో నృత్యం చేస్తూ కనిపించటంతన ప్రేమను సఫలం చేసుకునే ప్రయత్నంలో దుర్మరణం చెందడంవల్ల తారామతి ఆత్మదెయ్యంలా మారి గోల్కొండకోటలో తిరుగుతూ వుందని చాలామంది అభిప్రాయం.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

తను ప్రేమించిన భాగమతికి గుర్తుగా భాగ్యనగరాన్ని నిర్మించిన మహమ్మద్ కుతుబ్ షా మనమడైన 7 వ కుతుబ్ షాహీ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్ షాకాలంలో తారామతి,ప్రేమమతిఅనే ఇద్దరు సోదరీమణులు గోల్కొండ రాజ్యంలో నర్తకిలుగా వుండేవారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

వారు అపురూప సౌందర్యరాసులువారిని చూసారంటే ఎవరైనా ముగ్ధులై తమ్ముతాము మరిచిపోయు వారినలాగే చూస్తుండి పోయేవారుఅంతటి మనోహరమైన సౌందర్యం వారిది. అంతకుమించి వారు గొప్పనృత్యకారిణులు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

తారామతి గొప్పగాయని.వారు గోల్కొండలో సరాయిఅనే విడిదిమందిరంలో నృత్యంచేస్తూ గోల్కొండకు విచ్చేసే యాత్రికులనువర్తకులను వినోదపరిచేవారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

ఒక సారి తారామతి గానంచేస్తుండగా ఆ మధురమైన పాటరాజదర్బారులో వున్న సుల్తాన్ చెవిలో పడింది.ఆ మనోహరమైనగాత్రానికి ముగ్ధుడైపోయిన సుల్తాన్ తన సేవకులతో ఆమె వివరాలను కనుక్కొని వారిని దర్బారుకు పిలిపిస్తాడు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

అబ్దుల్ కుతుబ్ షాహీ తారామతి అందాన్ని చూసి ప్రేమలో పడతాడు.తారామతి కూడా సుల్తాన్ ప్రేమను అంగీకరిస్తుంది.వెంటనే సుల్తాన్ తన నివాసమునకు ఉపరితలంలో గల రెండు మందిరాలను వారి నివాసానికి కేటాయించాడు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

అవే గోల్కొండ కోట శిఖరభాగాన గల తారామతి గానమందిరం, ప్రేమవతినృత్యమందిరం. వారు అక్కడినుండి నృత్యం చేస్తుంటే సుల్తాన్ తన దర్బారునుండి చూసి ఆనందించేవాడు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

తారామతి సుల్తాన్ ను మెప్పించడానికి రెండుభవనాల మధ్య తాడుకట్టుకునిఆ తాడు పై నృత్యం చేసేది.సుల్తాన్ తారా మతికి రాజధానిలో వున్నతస్థానాన్ని కల్పించాడు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

అబ్దుల్ కుతుబ్ షాహీ,తారామతి మరియు ప్రేమవతికి కోటకు వెలుపల తారామతి బరదారి అనేపేరుతో ఒక సుందరమైన,విశాలమైన భవనాన్ని నిర్మించాడు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

భాగమతి,మహమ్మద్ కుతుబ్ షాహీ ప్రేమలాగానే తమ ప్రేమ కూడా చరిత్రలో నిలిచిపోవాలనీ తారామతికలలు కన్నది.అబ్దుల్ కుతుబ్ షాహీ కోసం ఆమె ఒక మస్జిద్ ను నిర్మించింది. అదే ఇప్పటికీ కోటలోగల తారామతీ మస్జిద్.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

భాగమతి,మహమ్మద్ కుతుబ్ షాహీ ప్రేమలాగానే తమ ప్రేమ కూడా చరిత్రలో నిలిచిపోవాలనీ తారామతికలలు కన్నది.అబ్దుల్ కుతుబ్ షాహీ కోసం ఆమె ఒక మస్జిద్ ను నిర్మించింది. అదే ఇప్పటికీ కోటలోగల తారామతీ మస్జిద్.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

అంత పెద్దసుల్తాన్ ఇలా ఒక సాధారణనర్తకి ప్రేమలో పడటం ఆమెకు రాజ్యంలో ప్రాబల్యంపెరిగిపోతుండటం రాజధానిలో కొంత మందికి గిట్టలేదు.వారు తారామతిసుల్తానులమధ్య విభేదాలు సృష్టించటానికి ప్రయత్నించసాగారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

ఈ విషయాన్ని గ్రహించిన సుల్తాన్ అబ్దుల్ కుతుబ్ షాహీ తారామతిని తననుండి దూరం చేయటానికి గట్టిప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా జరగకుండా వుండాలంటే తారా మతిని వివాహంచేసుకోవాలని నిశ్చయించుకుంటాడు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

ఈ విషయం తెలియగానే తనప్రేమ సఫలమవుతున్నందుకు తారామతి చాలా ఆనందపడింది.కానీ కొద్దిరోజులలోనే సుల్తాన్ తో తనవివాహం జరక్కుండానే తారామతి ఆకస్మికంగా మరణించింది.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

ఆరోగ్యంగా వున్న తారామతి వున్నట్లుండి మరణించటంవెనుక ఏమైనా కుట్రదాగుందాఅనే విషయాలు ఎక్కడాలభ్యంకాలేదు.తారామటిపై తనకువున్న ప్రేమకు గుర్తుగా అబ్దుల్ కుతుబ్ షాహీ తారామతిని కేవలం కుతుబ్ షాహీ కుటుంబీకులను మాత్రమే సమాధి చేసే కుతుబ్ షాహీ సమాధులలో ఖననంచేయించాడు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

తన ప్రేమ సఫలం కాకుండానే మరణించిన తారామతి ఆత్మ దెయ్యంలా మారి గోల్కొండకోటలో తిరుగుతూ నృత్యం చేస్తూ సందర్శకులకు కనిపిస్తూందని చెపుతారు.తారామతి ఆత్మతో పాటు,కుతుబ్ షాహీల ఆత్మలుకూడా గోల్కొండ కోటలో సంచరిస్తూంటాయని అంటారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

ఖభూతర్ ఖానాలో గల పాత్రలు వాటంతటవే ఒక చోట నుండి మరో చోటకు కదలటం,కోటలో గల చిత్రపటాలు,ఉదయానికల్లా తలక్రిందులవ్వటం,గోల్కొండ శిథిలాల అంతారాలలోకి వెళ్ళిన సందర్శకులకు బాడీలెస్ షాడోస్ కనిపించటం ఇందుకు నిదర్శనంగా చెప్తారు.

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

గోల్కొండ దెయ్యంతో తారామతి ప్రేమకథ

సందర్శన సమయం

ఉదయం 9 నుండి సాయంత్రం 5 : 30 వరకు.

లైట్ షోలు : మొదటి షో : 6:30 pm - 7:20 pm & సెకండ్ షో : 7:30 pm - 8:20 pm.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

గోల్కొండ కోట చేరుకోవటానికి హైదరాబాద్ లో సిటీ బస్సుల సదుపాయం కలదు. మెహదీపట్నం, చార్మినార్ నుండి డైరెక్ట్ గా బస్సులు, ఆటోలు దొరుకుతాయి.