Search
  • Follow NativePlanet
Share
» » తెలుగు రాష్ట్రంలో కూడా పండరీపురం

తెలుగు రాష్ట్రంలో కూడా పండరీపురం

By Kishore

పాండురంగడు అన్న తక్షణం మన మదిలో మహారాష్ట్రలోని చంద్రభాగ నదీ తీరాన ఉన్న పండరీపురమే గుర్తుకు వస్తుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో కూడా పాండురంగడు స్వయంగా వెలిశాడు. అది కూడా ఒక భక్తుడి కోరిక మేరకు. ఇక ఆ భక్తుడు చనిపోయినప్పుడు అతని ఆత్మను తనలోకి ఐక్యం చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు ప్రత్యక్షంగా చూశారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ అప్పటి వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా. ఇందుకు సంబంధించిన వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకొందాం.

ఆ బహిస్టు వల్లే కాశీ చౌడేశ్వరీ దేవి మన చెంతకు వచ్చింది రుజువు ఇదిగో

1. ఎక్కడ ఉంది

1. ఎక్కడ ఉంది

P.C: YouTube

కృష్ణ జిల్లాలోని ప్రముఖ పట్టణమైన చిలకలపూడిలో పాండురంగడు స్వయంభువుగా వెలిసిన దేవాలయం ఉంది. దీనిని కీర పండరీక్షేత్రం అని అంటారు. ఇది విజయవాడ నుంచి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది.

2. స్వయంభువుగా

2. స్వయంభువుగా

P.C: YouTube

ఇక్కడ పాండురంగడు తన భక్తుడైన నరసింహం కోసం స్వయంభువుగా వెలిసినట్లు చెబుతారు. నరసింహం 1889 ఏప్రిల్ 4న ప్రస్తుత బొబ్బిలికి దగ్గరగా ఉన్న ఉత్తరావెల్లి గ్రామంలో జన్మించాడు. ఆయనకు చిన్నతనం నుంచే దైవ భక్తి ఎక్కువ.

3. నరసింహం అనే వ్యక్తి

3. నరసింహం అనే వ్యక్తి

P.C: YouTube

ఈ క్రమంలోనే పొట్టకూటి కోసం నరసింహం తన 18వ ఏట చిలకల పూడి వచ్చి అక్కడ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఆయన ఆలోచనలన్నీ ఎప్పుడూ భక్తి మార్గంలోనే ప్రయాణించేవి. ముఖ్యంగా పాండురంగడు అంటే నరసింహానికి మక్కువ ఎక్కువ.

4. మహారాష్ట్రలోని పండరీపురం

4. మహారాష్ట్రలోని పండరీపురం

P.C: YouTube

ఈ క్రమంలోనే ఒకసారి నరసింహం ఒకసారి మహారాష్ట్రలోని పండరీపురం వెళ్లాడు.అ క్కడే శ్రీ మహీపతి గూండామహారాజ్ అనే గురువును నరసింహం చూసి అతని శిష్యుడైపోయాడు.

5. పాండురంగోపాసన విధానన్ని

5. పాండురంగోపాసన విధానన్ని

P.C: YouTube

నరసింహం భక్తికి ఆకర్షితుడైన శ్రీ మహీపతి గుండామహారాజ్ అతనికి పాండురంగోపాసన విధానన్ని తెలియజేయడమే కాకుండా ఒక తులసీమాలను, శ్రీ విఠల మహామంత్రాన్ని కూడా ఉపదేశించాడు.

6. నిత్యం పాండురంగ నామస్మరణ

6. నిత్యం పాండురంగ నామస్మరణ

P.C: YouTube

అటుపై నరసింహం తన స్వగ్రామన్ని చేరుకొని నిత్యం పాండురంగ నామస్మరణ చేసేవాడు. ఒకరోజు స్వస్థలంలో పాండురంగ దేవాలయం నిర్మించాలని భావించాడు. ఈ విషయాన్ని పండరీపురం వెళ్లి తన గురువైన మహీపతి గుండా మహారాజుకి తెలియజేశాడు.

7. చంద్రభాగ నదీ తీరం నుంచి

7. చంద్రభాగ నదీ తీరం నుంచి

P.C: YouTube

ఆయన సూచనమేరకు పండరీపురంలోని చంద్రభాగ నదీ తీరం నుంచి రాళ్లను తీసుకువచ్చి పాండురంగడి విగ్రహం ముందు పెట్టి గురుశిష్యులు ఇద్దరూ ధ్యానంలో మునిగిపోయారు.

8. ఒక దివ్యజ్యోతి ఒక రాయిలోకి ప్రవేశించింది

8. ఒక దివ్యజ్యోతి ఒక రాయిలోకి ప్రవేశించింది

P.C: YouTube

ఇంతలో పాండురంగడి విగ్రహం నుంచి ఒక దివ్యజ్యోతి ఒక రాయిలోకి ప్రవేశించింది. అంతేకాకుండా శుక్లనామ సంవత్సరం, కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం రోజున పాండురంగడి విగ్రహం చిలకలపూడిలో ఆవిర్భవిస్తుందని అశీరవాణి పలుకుతుంది.

9. అందరూ స్వామివారి విగ్రహం ఆవిర్భావానికి ఎదురుచూస్తూ ఉన్నారు

9. అందరూ స్వామివారి విగ్రహం ఆవిర్భావానికి ఎదురుచూస్తూ ఉన్నారు

P.C: YouTube

దీంతో నరసింహం దేవుడి ముందు పెట్టిన రాళ్లను తీసుకొని సంతోషంగా తన ఊరికి వెళుతాడు. ఆ రాళ్లతోనే మొదట భూమి పూజ చేసి దేవాలయం నిర్మాణం ప్రారంభిస్తాడు. దేవాలయం నిర్మాణం పూర్తయ్యింది. ఇక అందరూ స్వామివారి విగ్రహం ఆవిర్భావానికి ఎదురుచూస్తూ ఉన్నారు.

10. క్షుణంగా తనిఖీలు

10. క్షుణంగా తనిఖీలు

P.C: YouTube

విషయం తెలుసుకొన్న కొందరు గ్రామ పెద్దలు ఇందులో ఏదో మోసం ఉందని భావించి ఆలయం లోపల ఎవరూ లేకుండా క్షుణంగా తనిఖీలు నిర్వహించారు. అటు పై దేవాలయానికి కూడా తలుపులు మూసి తాళం వేసేశారు.

11. శుక్లనామ సంవత్సరం, కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం నాడు

11. శుక్లనామ సంవత్సరం, కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం నాడు

P.C: YouTube

అయినా సరిగ్గా శుక్లనామ సంవత్సరం, కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం నాడు అంటే 13.11.1929న ఒక దివ్య వెలుగు ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. దీంతో అందరూ ఆత్రంగా ఆ దేవాలయం ద్వారాలు తెరిచి చూడగా గర్భగుడిలో 3 అడుగుల ఎతైన పాండురంగడి విగ్రహం ఉంది.

12. అచ్చు పండరీపురంలోని విగ్రహం వలే

12. అచ్చు పండరీపురంలోని విగ్రహం వలే

P.C: YouTube

ఈ విగ్రహం అచ్చు పండరీపురంలోని విగ్రహం వలే ఉంది. అంతేకాకుండా భక్తులు కూడా ఇక్కడ విగ్రహం పాదాలను తాకుతూ దైవ దర్శనం చేసుకోవచ్చు. ఇక ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ దేవాలయంలో రాధ, రుక్మిణి, సత్యభామ తదితర ఉపాలయాలు కూడా ఉన్నాయి.

13. దాదాపు 400 ఏళ్లనాటి అశ్వర్థ చెట్టు ఉంది

13. దాదాపు 400 ఏళ్లనాటి అశ్వర్థ చెట్టు ఉంది

P.C: YouTube

ఇక ఇదే ఆలయ ప్రాంగణంలో దాదాపు 400 ఏళ్లనాటి అశ్వర్థ చెట్టు ఉంది. ఈ చెట్టు కింద భూమి పొరల్లో ఇప్పటికీ ఒక యోగి ధ్యానం చేస్తూ ఉన్నాడని భక్తులు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇదే ఆవరణంలో సహస్ర లింగ కైలాస మంటపం కూడా ఉంది.

14. ఆయన నుంచి ఒక కాంతి వెలువడి

14. ఆయన నుంచి ఒక కాంతి వెలువడి

P.C: YouTube

పాండురంగుడి పరమ భక్తుడైన నరసింహం 16.1.1974లో స్వర్గస్తులయ్యారు. ఆ సమయంలో ఆయన నుంచి ఒక కాంతి వెలువడి ఆలయంలో ఉన్న పాండురంగడిలో ఐక్యమయ్యింది. ఈ విషయాన్ని అప్పటి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆ పత్రికల క్లిప్పింగ్స్ ను మనం ఇప్పటికీ ఆలయంలో చూడవచ్చు.

 15. ప్రత్యేక ఉత్సవాలు

15. ప్రత్యేక ఉత్సవాలు

P.C: YouTube

ఈ ఆలయంలో ఆషాడ, కార్తీక మాసాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ నగరాల నుంచి కూడా పెద్దసంఖ్యలో ఇక్కడకి భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయం ఇప్పటికీ నరసింహం వారసుల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X