Search
  • Follow NativePlanet
Share
» » మరో పదమూడు రోజుల్లో సూర్యకిరణాలు తాకే ఈ విగ్రహాన్ని చూస్తే మోక్షం ఖచ్చితం

మరో పదమూడు రోజుల్లో సూర్యకిరణాలు తాకే ఈ విగ్రహాన్ని చూస్తే మోక్షం ఖచ్చితం

అరసవెళ్లి సూర్య నారాయణ స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

హిందూ ధార్మిక ప్రపంచలో మోక్షానికి అంతులేని ప్రాధాన్యత ఉంది. ఈ మోక్షం కోసం ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాల సందర్శన వల్ల పాపం పోయి పుణ్యం లభిస్తుందని దీని వల్ల స్వర్గ లోప ప్రాప్తి అటు పై మోక్షం ఖచ్చితమని చెబుతారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సదరు పుణ్యక్షేత్రాల్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా జరుగుతాయి. అటువంటి సంఘటనలు జరిగే సమయంలో అక్కడి స్వామివారిని సందర్శిస్తే మోక్షం ఖచ్చితమని చెబుతారు. ఈ నేపథ్యంలో మరో పదమూడు రోజుల్లో సూర్యకిరణాలు తాకే ఆ ఆదిత్యుడి విగ్రహం ఉన్న అరసవెళ్లి పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube

కురు పాండవుల యుద్ధంలో జరగబోయే బంధునాశనాన్ని చూడలేనని బలరాముడు తీర్థయాత్రలకు బయలు దేరుతాడు. అలా తీర్థయాత్రలు చేస్తున్న బలరాముడు ప్రస్తుతం శ్రీకాకుళం ఉన్న ప్రాంతానికి వస్తాడు. అప్పుడు అక్కడ కరువు ఎక్కువగా ఉంటుంది.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
తమను ఈ బాధ నుంచి విముక్తి చేయాల్సిందిగా అక్కడి ప్రజలు బలరాముడిని ప్రార్థిస్తారు. దీంతో బలరాముడు తన ఆయుధమైన నాగలితో భూమి పై పొడిచి నీరు వచ్చేలా చేస్తారు.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
నాగలి నుంచి నీరు వచ్చి నదిగా ప్రవహించడం వల్ల దీనిని నాగావళి అని అంటారు. ఇక ఈ నాగావళి తీరంలో ఐదు విశిష్ట దేవాలయాలను నిర్మించారు. అందులో నాల్గవది శ్రీకాకుళం పట్టణంలో వెలిసిన ఉమారుద్ర కోటేశ్వరస్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
ఆ ఆలయాన్ని ప్రతిష్టించిన సమయంలో దేవతలు అందరూ వెళ్లి అక్కడి పరమేశ్వరుడిని దర్శించుకుని వెనుతిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఇంద్రుడు కూడా ఉమారుద్ర కోటేశ్వరస్వామిని సందర్శించుకోవాలని అక్కడికి వెళ్లాడు.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
అయితే అప్పటికే కాలాతీతమైనందువల్ల ద్వార పాలకులుగా ఉన్న నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు కాలాతీతమైనందువల్ల ఇప్పుడు పరమేశ్వరుడిని సందర్శించడం కుదరదని చెబుతారు.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
అయితే ఇంద్రుడు వారితో వాగ్విదానికి దిగుతాడు. అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహంతో తన కొమ్ములతో ఒక విసురు విసురుతాడు. దీంతో ఇంద్రుడు రెండు పర్లాంగుల దూరంలో పడుతాడు.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
ఇంద్రుడు పడిన ఆ స్థలాన్నే ఇంద్ర పుష్కరిణి అంటారు. అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్య భగవాడుని ప్రార్థిస్తాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమై నీవు పడిన చోట వజ్రాయుద్ధంతో తవ్వమని చెప్పగా ఇంద్రుడు అలాగే చేస్తాడు.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
దీంతో అక్కడ సూర్యభగవానుడి విగ్రహంతో పాటు ఉష, ఛాయ, పద్మిని విగ్రహాలు లభిస్తాడు. అటు పై ఇంద్రుడు దేవాలయం నిర్మిస్తాడు. అదే ఈ నాటి అరసవెళ్లి క్షేత్రం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
ఇక ఈ ఆలయంలో సూర్య భగవాడుని పూజించిన వారు అన్ని కష్టాలూ తొలిగిపోయి హర్షంతో వెలుతారు కాబట్టి ఈ గ్రామాన్ని హర్షవల్లి అని పిలిచేవారు. ఆ హర్షవెళ్లే కాలక్రమంలో అరసవెళ్లి అయ్యిందని చెబుతారు.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
ఈ దేవాలయంలో ఏడాదికి రెండు సార్లు సూర్య కిరణాలు ఉదయం, సాయంత్ర సమయంలో గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలను తాకుతాయి. ఆ సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతి ఏటా మార్చి 9, 10,11, 12 తేదీల్లో అదే విధంగా అక్టోబర్ 1,2,3,4 తేదీల్లో స్వామివారిని ఆదిత్యుని తొలికిరణాలు ఇక్కడ స్వామివారిని తాకుతాయి.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
మొదట పాదాలమీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన విషయాన్ని చూడటానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దీని వల్ల సర్వపాపాలు తొలిగి పోతాయని భక్తులు నమ్ముతారు.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
చరత్రపుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాలయాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజుల్లో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీస్తు శకం 545 లో నిర్మించినట్లు తెలుస్తోంది.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
కళింగ దేశ రాజధానిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శానానికి వెళ్లి తమకు సూర్య దేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్న వించారు.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
ఆ సోదరుల దైవ భక్తి పై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్య దేవాలయానికి అర్చకులుగా నియమించారు. వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

అరసవెళ్లి, సూర్యనారాయణ స్వామి దేవాలయం.

P.C: You Tube
శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీ కాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలోనే ఈ గ్రామం ఉంటుంది.

మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లాలనుకొంటే ఇక్కడికి వెళ్లండిమీ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లాలనుకొంటే ఇక్కడికి వెళ్లండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X