» »కేరళలోని అనంత పద్మనాభస్వామిఆలయం

కేరళలోని అనంత పద్మనాభస్వామిఆలయం

Written By: Venkatakarunasri

అనంత పద్మనాభస్వామి 6వ గది తెరిస్తే మొత్తం ప్రపంచం మునిగిపోతుందా? అంతులేని సంపద కల్గిన అనంత పద్మనాభస్వామి ఆలయంలోని 6వ గదిలో ఏముంది?ఆ గది తెరిస్తే మొత్తం భూప్రపంచం మునిగిపోవడం ఖాయమేనా? వెలకట్టలేని నిధులు, నిక్షేపాలతో వుందని ప్రచారం జరుగుతున్న 6వ గది ఇలా ఎంతకాలం మూసుకుని వుంటుంది?

ఆ గదికి వున్న నాగాబంధాన్ని ఎలా ఎప్పుడు?ఎవరు?తొలగించాలి?ఈ ప్రశ్నలకు నిర్దిష్టమైన సమాచారం చెప్పేవారు లేకపోయినా అందరూ చెబుతున్నది ఒక్కటే ఆ గది తలుపు తెరవటం ఎంతమాత్రం మంచిది కాదని. ఇంతకీ ఆ 6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి? ఆ గదిలో దాగిన మిస్టరీ ఏమిటి? ఈ విషయాలను ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

అనంత పద్మనాభస్వామి ఆలయంలోని 6వ గదికి నాగబంధం వున్నట్లు ప్రచారంలో వుంది. ఈ నాగబంధం అనే పదం మనకు మొదట రామాయణంలో వినిపిస్తుంది

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

హనుమంతుడు సీతా దేవిని వెతకటానికి లంకకు బయలుదేరుతున్నప్పుడు దేవతలు అతని బలాన్ని పరీక్షించటానికి సురస అనే నాగ దేవతను పంపించాడట.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

అలా నాగదేవతతో హనుమంతుడి మార్గానికి బంధం వేయటానికి ప్రయత్నం చేయటంతో నాగబంధం అనే పేరు వెలుగులోకి వచ్చింది.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

అనంత పద్మనాభ స్వామి 6వ గదితలుపు పైన నాగుపాము చిత్రాలు వుండటంతో ఆ తలుపునకు నాగబంధం వేసారని సిద్ధపురుషులతో గరుడమంత్రాన్ని ఉచ్చరింపజేస్తే ఆ తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయని ప్రచారంలో వుంది.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

పురాణాల ప్రకారం 8 దిక్కులకు ఒక్కొక్క నాగదేవత కాపలా కాస్తుంటారంట. 6వ గదికి ఏ నాగదేవతను ఆవాహనచేసి నాగబంధం వేసారో మొదట తెలియాల్సివుందట.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

అప్పుడు మాత్రమే ఆ ప్రత్యేక నాగదేవత ద్వారా బంధింపబడిన నాగాబంధాన్ని నిర్దిష్ట మంత్రాన్ని సిద్ధపురుషులతో పలికించితెరవవచ్చునట.అయితే ఇంతకీ ఆ సిద్ధపురుషులు ఎక్కడ దొరుకుతారన్న ప్రశ్నకు ఎవరివద్దా సరైన సమాధానం లేదు.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

అనంతపద్మనాభుడు శయనించిన ప్రదేశానికి సమీపంలో వున్న ఆ గది తెరిస్తే పద్మనాభుని నిద్రకు భంగం వాటిల్లి ప్రపంచం మొత్తం భస్మం అయిపోతుందని కొందరు, ఆ తలుపుల వెనుక నీటి అలలశబ్దం వినిపిస్తుంది కాబట్టి సముద్రం మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందని మరి కొందరు భయపడుతున్నారు.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

అయితే ఈ గది తెరవటానికి ప్రయత్నించిన వారికి కీడు తప్పదని అందరూ మూకుమ్మడిగా చెబుతుండడం విశేషం.ఈ వాదనకు వారు ఆధారాలు కూడా చూపిస్తున్నారు.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

అనంత పద్మనాభస్వామి ఆలయంలో అనంత సంపద నేలమాళిగలో దాగివుందని కోర్టులో పిటీషన్ వేసిన సుందరరాజన్ అనే వ్యక్తి ఆ నేలమాళిగ తెరిచిన కొద్దిరోజులకే అనారోగ్యంతో మరణించాడు.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

నేలమాళిగలు తెరవటానికి సుప్రీంకోర్టు నిర్మించిన సభ్యులలో ఒకరితల్లి హటాత్తుగా చనిపోయింది.మరొకరికి కాలువిరిగింది.సంపద లెక్కించిన అధికారులు కొందరు అనారోగ్యం పాలయ్యారు.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

దాంతో 6వ గదిని తెరవాలని ప్రయత్నించిన వారికి కీడుతప్పదన్న ప్రచారం వూపందుకొంది.ఈ ఆలయాన్ని నిర్మించిన ట్రావెన్కో రాజ వంశీయుల వాదన వేరే విధంగా వుంది.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

ప్రభుత్వం ఆ గదులను తెరుస్తూ వుంటే తాను ఏమీ చేయాలేని దుస్థితిలో ఏడవటం తప్ప ఏమీచేయలేక పోతున్నానని ఈ రాజవంశానికి చెందిన తిరునాళ్ మార్తాండవర్మ ఒక ఇంటర్యూలో వాపోయారు.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

మిస్టరీగా మారిన అనంతపద్మనాభస్వామి ఆలయం 6వ గదిలో ఒక శక్తివంతమైన స్థంభం వుందట.ఆ 6వ గది తెరవగానే ఆ స్థంభం విరిగి ఆలయం మొత్తం ఒక్క సారిగా కుప్పకూలిపోతుందని చెబుతున్నారు.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

పద్మనాభస్వామి ఆలయంలోని అనంత సంపదను కాపాడటానికి ట్రావెన్కో రాజులు కావాలనే ఆలయాన్ని అలా నిర్మించారట.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

శత్రురాజులు ఎవరైనా తమ రాజ్యాన్ని ఓడించి ఆ గదితలుపులు తెరవటానికి ప్రయత్నిస్తే ఆ గుడి కుప్పకూలి వారంతా మరణిస్తారని అలా స్వామివారి సంపాదనను శత్రువులకు చిక్కకుండా వుండటానికే ట్రావెన్కో రాజులు ఈ విధమైన నిర్మాణం చేపట్టారట.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

శత్రురాజుల సంగతేమోగానీ పద్మనాభుని అనంత సంపదమీద ఇప్పటికే చాలా మంది కళ్ళు వున్నాయి. ఆ సంపద గురించి రకరకాల కధనాలు ప్రచారంలో వున్నాయి.ఆ సంపదను వెలికితీస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ధనికదేశంగా మారుతుందని కొందరు ఊరిస్తూ వుంటే,మరి కొందరేమో ఆ సంపదకోసం ప్రయత్నిస్తే మొదటికే ముప్పువచ్చి ప్రపంచం మొత్తం కల్లోలమవుతుందని హెచ్చరిస్తున్నారు.

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

6వ గదికి వున్న ప్రత్యేకత ఏమిటి

ఇంతకీ పద్మనాభుని 6వ గదిలో అనంతసంపద ఉందా?వుంటే అది ఎప్పటికి బయటకు వస్తుంది?ప్రాణాలకు తెగించి 6వ గది తెరిచే ధైర్యం ఎవరు చేస్తారు?ఇవన్నీ చిక్కు ప్రశ్నలే.ఈ ముడివిప్పటం కేవలం ఆ అనంత పద్మనాభుడి వల్లే అవుతుందేమో.