Search
  • Follow NativePlanet
Share
» »ఈ ఆగస్టులో ఇవన్నీ మీరు చేయగలా?

ఈ ఆగస్టులో ఇవన్నీ మీరు చేయగలా?

ఆగస్టులో జరుపుకొనే పండుగలకు సంబంధించిన కథనం.

ఆగస్టు నెలలో దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ఎంతో ముఖ్యమైనది. వారి సంప్రదాయాలను ప్రతిబింభించే ఎన్నో పండుగలను వారు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలను చూడటానికి దేశం నలుమూలల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. అందులో స్నేక్ బోట్, తీజ్, ఓనం, తదితర పండుగలు ముఖ్యమైనవి. ఇక కొన్ని కార్నీవాల్స్ కూడా ముఖ్యమైనవే. గోవా, చెన్నై లలో ఇటువంటి కార్నివాల్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలకు ఇటీవల ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అందువల్లే ఈ ఉత్సవాలకు ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖ ప్రత్యేక నిధులు కూడా విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పండుగలకు సంబంధించిన కథనం.

నెహ్రూ ట్రోఫీ స్కేక్ బోట్ రేస్

నెహ్రూ ట్రోఫీ స్కేక్ బోట్ రేస్

P.C: You Tube

నెహ్రూ మొదటిసారిగా 1952 లోఅలెప్పేను సందర్శించిన సందర్భంగా స్థానికులు ఈ స్నేక్ బోట్ రేస్ తో స్వాగతం తెలిపారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏడాది ఆగస్టు రెండో

శనివారం ఈ స్కేక్ బోట్ పందాలను నిర్వహిస్తారు.

ఎప్పుడు..... ఆగస్టు 11 2018

ఎక్కడ..... పున్నమద లేక్, అలెప్పే

టికెట్స్....రూ.100 నుంచి 3000 వరకూ

తీజ్ ఫెస్టివల్

తీజ్ ఫెస్టివల్

P.C: You Tube

రాజస్థాన్ లో తీజ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 14 మరళా 28, 29 తేదీల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ పండుగ సందర్భంగా రాజస్థానీ మహిళలు చేతులకు కాళ్లకు మెహంది

ధరించి నాట్యం చేస్తారు. చక్కగా అలంకరించిన ఏనుగులు వీధుల్లో ఊరేగిస్తారు.

ఎప్పుడు..... 2018 ఆగస్టు 13, 14, 28, 29

ఎక్కడ..... పున్నమద లేక్, అలెప్పే

స్వతంత్ర్య దినోత్సవం

స్వతంత్ర్య దినోత్సవం

P.C: You Tube

భారత దేశం మొత్తం స్వతంత్ర్య దినోత్సవాన్ని ఆనందోత్సాహల మధ్య జరుపుకొంటారు. అయితే ఢిల్లీలో చాలా బాగా జరుగుతాయి.

 అతచమయమ్ త్రిప్పునీతుర

అతచమయమ్ త్రిప్పునీతుర

P.C: You Tube

ఓనమ్ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అతచమయమ్ త్రిప్పునీతుర ఉత్సవాలను నిర్వహిస్తారు. వీధుల్లో కళాకారులు, ఏనుగులు తిరుగుతూ చూపరులను ఆకట్టు కొంటాయి.

ఎప్పుడు..... 2018 ఆగస్టు 15

ఎక్కడ..... త్రిపునీతుర, కేరళ

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

భారత దేశ వ్యాప్తంగా ఈ నాగపంచమిని నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రామీణ సంప్రదాయంలో నాగపంచమి ఒక భాగం. ఈ పండుగ సందర్భంగా పుట్టకు, నాగుపాములకు పాలుస్తారు. ఈ ఏడాది ఆగస్టు 15న నాగ పంచమిని నిర్వహిస్తారు.

జపాన్ మేళ

జపాన్ మేళ

P.C: You Tube

ఈశ్వరుడి కుమార్తే మానసాదేవిని పూజించే క్రమంలో జపాన్ మేళ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మానసాదేవి ప్రతి రూపాలైన నాగపాములతో గిరిజనులు ఎన్నో విన్యాసాలు నిర్వహిస్తారు.

కొవలాంగ్ పాయింట్ సర్ఫ్, మ్యూజిక్, యోగా ఫెస్టివల్

కొవలాంగ్ పాయింట్ సర్ఫ్, మ్యూజిక్, యోగా ఫెస్టివల్

P.C: You Tube

తమిళనాడులోని చెన్నైకు దగ్గరా ఉన్న కోవెలాంగ్ వద్ద ప్రతి ఏడాది ఈ ఉత్సవం జరుగుతుంది. దేశ విదేశాల నుంచి సర్ఫింగ్ అంటే ఇష్టమున్నవారు ఇక్కడకు ఎక్కవుగా వస్తుంటారు. యోగ, మ్యూజిక్ వీనుల విందుగా ఉంటుంది.

మద్రాస్ వీక్

మద్రాస్ వీక్

P.C: You Tube

ప్రస్తుతం చెన్నై గా పిలువబడుతున్న మద్రాస్ పట్టణానికి పునాది వేసిన సందర్బాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని వారం పాటు నిర్వహిస్తారు. ఈ వారం పాటు చెన్నైలో వాకథాన్, ఫుడ్ ఫెస్టివల్స్, ఫోటో ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూ ఉంటారు.

ఓనమ్

ఓనమ్

P.C: You Tube

కేరళలో అత్యంత ఆనందోత్సవాల మధ్య దాదాపు వారం పాటు ఈ ఉత్సవాలను జరుపుకొంటారు. కేరళ సంప్రదాయాలకు ఈ ఓనమ్ పండుగ ప్రతీక. మహాబలిని తమ ఇంటికి ఆహ్వానించడంలో భాగంగా ఈ ఓనమ్ పండుగ రోజు ఇంటు ముందు రకరకాల పువ్వులతో కలంకరిస్తారు. స్నేక్ బోట్ రేస్ ఇక్కడ సర్వసాధారణం.

తర్నీతర్

తర్నీతర్

P.C: You Tube

గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లాలోని తర్నీతర్ గ్రామంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ముఖ్యంగా దీనిని గ్రామీణ మేళగా చెప్పవచ్చు. గ్రామీణుల ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే స్టంట్స్ ఇక్కడ ప్రత్యేకం. ఆగస్టు 24 నుంచి 27

బోన్ దీరమ్

బోన్ దీరమ్

P.C: You Tube

గోవాలోని దివార్ ద్వీపంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూడటానికి వివిధ దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఇటీవల ఈ ఉత్సవం సందర్భంగా స్ట్రీట్ కార్నీవాల్ నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 25 న ఈ పండుగను నిర్వహిస్తారు.

రక్షాబంధన్

రక్షాబంధన్

P.C: You Tube

అక్కలు, చెల్లెళ్లు తమ సోదరుకు రాఖీ కట్టి ఇళ్లలో పండుగను నిర్వహిస్తారు. మొదట్లో ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఈ పండుగ ప్రస్తుతం భారత దేశం మొత్తం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 26న ఈ పండుగను నిర్వహిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X