Search
  • Follow NativePlanet
Share
» »నయన మనోహరం ... 'బనవాసి' !!

నయన మనోహరం ... 'బనవాసి' !!

మధుకేశ్వర ఆలయ మండపంలో ఏకశిలతో మలచిన ఏడడుగుల నంది విగ్రహం అందరి దృష్టిని కట్టిపడేస్తుంది. నృత్యప్రదర్శనలు నిర్వహించే ‘త్రిలోక మంటపం’ మరో అద్భుత కట్టడం.

By Mohammad

బనవాసి ఒక పురాతన ఆలయ పట్టణం. ఈ పట్టణం దూరంగా పశ్చిమ కనుమలలోని లోతైన అడవులు లోపల నిర్మించబడి ఉంది. ఇది ఉత్తర కన్నడ జిల్లాలో వార్ధా నది ఒడ్డున ఉంది. పచ్చదనం పరచుకున్న గిరులు, గుబాళించే విరుల వనాలు, ఆహ్లాదం కలిగించే లోయలు, దశాబ్దాల నాటి నిర్మాణాలు 'బనవాసి'లో ప్రత్యేక ఆకర్షణలు.

ఇది కూడా చదవండి : బెంగళూరులో మోస్ట్ పవర్ ఫుల్ దేవుడు !!

బనవాసి పేరు వెనుక కధ

బనవాసి అన్నపేరు 'బన' మరియు 'వాసి ' అన్న పదాలు నుండి వస్తుంది. 'బనా' అనగా 'అడవి' మరియు 'వాసి ' అనగా 'వసంత' అని అర్ధం . ఈ పట్టణ౦ పేరు సాహిత్యపరంగా ఒక అడవి నుండిఅప్పుడే వికసించిన వసంత౦గా చెప్పవచ్చు . బనవాసి కర్ణాటక లోని అతి పురాతన పట్టణాలలోఒకటిగా గుర్తించబడింది, మహాభారతం లో కుడా దీని ప్రస్తావన కలదు.

ఇది కూడా చదవండి : కర్ణాటకలోని దివ్య ముక్తిస్థల క్షేత్రాలు !

స్ధల ప్రాధాన్యత ఏమిటి?

ఈ పట్టణం లోని మధుకేశ్వర ఆలయం వలన దీనికి గొప్ప ప్రజాదరణ వచ్చినది. ఈ ఆలయము 9 వ శతాబ్దం లో, నిర్మించబడింది. ఈ ఆలయమును దర్శించుటకు యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

బనవాసి ప్రయాణంలో పర్యాటకులు 9 వ శతాబ్దంలో 'కదంబ' సామ్రాజ్యంలో నిర్మింఛిన మధుకేశ్వర ఆలయంను తప్పక సందర్శించవలెను. ఇది దాని అందమైన మరియు ప్రత్యేకమైన నిర్మాణ చెక్కడములు మరియు నమూనాలు కారణంగా యాత్రికులలో ప్రసిద్ధి చెందింది.

ఇది కూడా చదవండి : కర్ణాటకలోని మురుడేశ్వర దర్శనం !

మధుకేశ్వర దేవాలయం

మధుకేశ్వర దేవాలయం

మధుకేశ్వర ఆలయం లోపల మరియు ఆవరణ లోను విష్ణువు మరియు విష్ణువు యొక్క అలంకరించబడిన విగ్రహాలు సందర్శించవచ్చు.

చిత్రకృప : Ajaya.n.g

ఏకశిల

ఏకశిల

పర్యాటకులు ఏకశిల తో చేయబెడిన త్రిలోక మంటపము నందు భూమి, స్వర్గము మరియు పాతాళంలు ప్రదర్శించబడుతుంటాయి.

చిత్రకృప : Ajaya.n.g

గణపతి

గణపతి

ఈ తీర్ధయాత్ర స్థలము యొక్క ప్రధాన ఆకర్షణ గణేశుని విగ్రహం. ఇది ఇక్కడ ఒక సగమే ఉంటుంది. ఈ విగ్రహం యొక్క మిగిలిన సగం వారణాసి లో ఉన్నదని యాత్రికులు నమ్ముతారు.

చిత్రకృప : Deepti deshpande

నరసింహ స్వామి

నరసింహ స్వామి

ఈ గణేషుని విగ్రహమే కాకుండ, నరసింహ స్వామి విగ్రహం కూడా ఈ మధుకేశ్వర ఆలయం లో చూడవచ్చు.

చిత్రకృప : Deepti deshpande

నాగేంద్రుని శిల్పం

నాగేంద్రుని శిల్పం

ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు భక్తులు ఐదు పడగల నాగేంద్రుని శిల్పం కూడా చూడవచ్చు. ఈ శిల్పం 2 వ శతాబ్దం లోనిది. జాగ్రత్తగా చూస్తే యాత్రికులు ఈ నాగ శిల్పం పై ఒక శిలాశాసనం (ప్రాకృత భాషలో) గమనించవచ్చు.

చిత్రకృప : Deepti deshpande

శిలాశాసనం

శిలాశాసనం

శిలాశాసనం నుండి సేకరించిన సమాచారం ప్రకారం, శిల్పం ఏర్పాటు విహార మరియు ఒక తొట్టి నిర్మాణము తర్వాత రాణి శివస్కంద నాగశ్రీ ద్వారా ఇక్కడ ప్రతిష్టిపబడినది. దేశం నలు మూలల నుండి శివభక్తులు శివరాత్రి సందర్భంలో మధుకేశ్వర ఆలయం సందర్శిస్తారు.

చిత్రకృప : Deepti deshpande

నంది విగ్రహం

నంది విగ్రహం

ఆలయ మండపంలో ఏకశిలతో మలచిన ఏడడుగుల నంది విగ్రహం అందరి దృష్టిని కట్టిపడేస్తుంది. నృత్యప్రదర్శనలు నిర్వహించే ‘త్రిలోక మంటపం' మరో అద్భుత కట్టడం.

చిత్రకృప : Dineshkannambadi

మంటపం

మంటపం

భారీ స్తంభాలు, మంటపం పైకప్పు అద్భుత శిల్పకళతో ఉట్టిపడుతుంటాయి. మహాశిల్పిగా ప్రసిద్ధి చెందిన ‘అమరశిల్పి జక్కన' ఈ ఆలయంలో శిల్పకళను తీర్చిదిద్దాడని అంటారు.

చిత్రకృప : Dineshkannambadi

నంది కన్నులు

నంది కన్నులు

మధుకేశ్వరాలయంలో నంది కన్నులు రెండు వైపులా చూస్తున్నట్లు ఉంటాయని భక్తులు ఆనంద పారవశ్యానికి లోనవుతారు.

చిత్రకృప : Deepti deshpande

పార్వతి దేవి

పార్వతి దేవి

ఎడమకన్నుతో ఈశ్వరుడిని, కుడి కన్నుతో పార్వతిని చూస్తున్నట్లు నంది కళ్లను తీర్చిదిద్దడం ఓ విశిష్టతగా భావిస్తారు.

చిత్రకృప : Deepti deshpande

సందర్శకులు

సందర్శకులు

ఇక్కడ అర్చనలు చేసేందుకు, అద్భుత శిల్పకళను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీ సంఖ్యలో వస్తుంటారు.

చిత్రకృప : Deepti deshpande

కందబోత్సవం

కందబోత్సవం

రాష్ట్ర ప్రభుత్వం కదంబోత్సవం పేరుతొ ఒక భారీ కార్యక్రమం నిర్వహించే సమయం ఈ ఆలయ పట్టణం సందర్శించడానికి ఉత్తమ సమయం.

చిత్రకృప : Deepti deshpande

ప్రతి ఏటా డిసెంబర్ నెల

ప్రతి ఏటా డిసెంబర్ నెల

ఈ ఉత్సవం ప్రతి ఏటా డిసెంబర్ నెలలోజరుగుతుంది. ఈ కార్యక్రమంలో యక్షగానం మరియు సంగీత ప్రదర్శనలు వంటి శాస్త్రీయ నృత్త్య రూపాలతో ఒక సాంస్కృతిక మహోత్సవం జరుగుతుంది.

చిత్రకృప : Dineshkannambadi

బనవాసి లో చూడవలసిన ఇతర ఆకర్షణలు

బనవాసి లో చూడవలసిన ఇతర ఆకర్షణలు

పంపా వనము, సిర్సి, వార్ధా నది, శాస్త్రలింగ, శ్రీ మారికాంబ ఆలయం, సొండా మఠము, శ్రీ హనుమాన్ పద్మావతి దేవి జైన్ ఆలయం, కురువతి బసవేశ్వర ఆలయం, సిద్దేశ్వర ఆలయం, వరసిద్ధి వినాయక ఆలయం, మైలార లింగేశ్వర ఆలయం మరియు ఇతరములు చూడదగ్గవి. బనవాసిలో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

చిత్రకృప : Dineshkannambadi

బనవాసి ఇలా చేరండి !

బనవాసి ఇలా చేరండి !

బనవాసి బెంగుళూర్ నుండి 374 కిలోమీటర్ల దూరంలో ఉంది. హుబ్లి విమానాశ్రయం ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. హవేరి, బనవాసి పక్కపక్కన ఉండే రైల్వే స్టేషన్లు. ఇవి ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి . ఈ పట్టణం ఇతర నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది గనుక రాకపోకలు ఒక సమస్య కాదు.

చిత్రకృప : Deepti deshpande

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X