Search
  • Follow NativePlanet
Share
» »భారత స్వర్ణయుగంలోని సంపద మొత్తం ఈ గుహల్లోనే అందుకే రహస్యంగా అన్వేషణ

భారత స్వర్ణయుగంలోని సంపద మొత్తం ఈ గుహల్లోనే అందుకే రహస్యంగా అన్వేషణ

భారతదేశంలో అనేక రహస్య గుహాలయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని శిల్ప సంపదకు నిలయం కాగా, మరికొన్నింటిలో అనాటి వాస్తుశైలి కనిపిస్తుంది. మరికొన్నింటిలో రహస్యంగా నిధి దాగి ఉంది. అందువల్లే భారత దేశంలో ప్రాచీన దేవాలయాలతో పోలిస్తే ఈ గుహాలయాల్లోనే ఎక్కువ పరిశోధనలు జరుగుతుంటాయి. ఇటువంటి కోవకు చెందినదే బీహార్ లోని ఒక గుహాలయం. ఈ గుహాలయాలు అటు బౌద్ధులకు, ఇటు జైనులకు కాక వేరే ధర్మానికి చెందినవి. వారికి ధనం పై ఏ మాత్రం ఆసక్తి ఉండేది కాదు. అందువల్లే భారత స్వర్ణయుగంగా పేర్కొనే మౌర్యుల కాలంలో పోగైన సంపదలో దాదాపు 20 శాతం ఈ గుహలో రహస్యంగా దాచి ఉంచారని చెబుతారు. ఇందుకు సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube

చరిత్ర, పురావస్తు శాస్త్రవేత్తలను అనుసరించి బాబర్ గుహలు భారత దేశంలో అత్యంత ప్రాచీన గుహలు. అందువల్లే ఈ గుహలు చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలతో పాటు సాధారణ ప్రజలను కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

హనీమూన్ రైలులో వెలుతూ...బాహుబలి దున్నలను చూస్తూబారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
ఇక్కడ పరిశోధకులకు అడుగడుగునా కొత్త విషయాలను తెలుస్తాయి. అంతేకాకుండా ప్రతి మీటరు దూరానికి ఓ శాసనం కనబడుతుంది. దీంతో నిత్యం ఇక్కడ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
ఇక్కడ అధ్యయనం జరుగుతున్న కొద్దీ అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకి వస్తున్నాయి. అందువల్లే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నా ఇంకా పరిశోధనలకు ఎంతో అవకాశం ఉంది.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలను అనుసరించి ఈ గుహలన్నీ క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందినవని తెలుస్తోంది. అంతటి ప్రాచీన గుహలైనందువల్లే ఇక్కడ పరిశోధనలకు అంతటి ప్రాధాన్యత అని తెలుస్తోంది.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
బారబర్ గుహల ప్రాంతం కొన్ని గుహల సమూహం. అవన్నీ కూడా కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా ఒకవైపున ఉన్న గుహలను బరాబర్ గుహలని అంటే మరొకవైపున ఉన్న గుహలను నాగార్జున గుహలని పిలుస్తారు.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
బాబార్ గుహల సముదాయంలో మరో నాలుగు ఉప గుహలు ఉండగా నాగార్జున గుహల్లో మూడు చిన్న గుహలు ఉన్నాయి. అంటే ఈ గుహల సముదాయంలో మొత్తం ఏడు గుహలు ఉన్నట్టు అర్థమవుతోంది.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
ఈ గుహలన్నింటిలో చిత్రవిచిత్రమైన శాసనాలు, స్మారకాలు, శిల్పాలను మనం చూడవచ్చు. ఈ గుహాల సముదాయాలను సాత్ఫర్వ, ఘోరత్ గిరి, హఫ్తాఖాన్ అనే ఇతర పేర్లతో పిలుస్తారు. సత్ అంటే ఏడు ఘర్ అంటే ఇల్లు అని అర్థం.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
మహాభారతంలో ఈ ప్రాంతం ప్రస్తావన ఉంది. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని ఘోరాత్ గిరి అని పిలిచేవారు. ఇప్పటికీ బ్రాహ్మి లిపిలో ఈ గుహల లోపలి భాగంలో అక్కడక్కడ ఘోరాత్ గిరి అని రాసి ఉండటం మనం చూడవచ్చు.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
ముఖ్యంగా మౌర్యుల కాలంలో ఈ బారాబర్ గుహలు అత్యంత వైభవంగా ఉన్నాయి. ఈ గుహలను మౌర్య చక్రవర్తులు తొలిపించి అజీవకులకు దానంగా ఇచ్చారని ఇక్కడ ఉన్న శిలాశాసనాలను అనుసరించి తెలుస్తోంది.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
ఈ గుహలల్లో మౌర్య చక్రవర్తి అశోకుడు, అతని మనుమడు దశరథుడుకు చెందిన శిలాశాసనాలు ఎన్నో కనిపిస్తున్నాయి. భారత దేశం అనేక మతాలు, ధర్మాలకు జన్మభూమి. పురాతన భారత దేశంలో అజీవకులు అనే ధర్మం ఉండేది.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
అయితే ఈ ధర్మం ప్రస్తుతం పూర్తిగా నశించిపోయింది. అజీవకులు ఈ గుహల్లో ఉండటం వల్లే ఈ గుహల సందర్శనం, పరిశోధన అత్యంత కుతూహలంగా మారింది. ఈ అజీవకులు విచిత్రమైన మనస్తత్వం కలిగి ఉంటారు.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
అజీవకులు మూలత: నాస్తికులు. అంతే కాకుండా విచిత్రమైన సంప్రదాయాలను పాటిస్తారు. ఈ అజీవకులు బౌద్ధ, జైన ధర్మాలకు సంబంధించిన కొన్ని సిద్ధాంతాలను పాటించేవారు.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
భారత దేశంలోని వేదాలను శాస్త్రాలను వీరు చదివినా అందులోని విషయాలను అనుసరించడంలో మాత్రం ఆసక్తిని చూపించేవారు కాదు. ప్రతి జీవిలోనూ ఆత్మ ఉందని నమ్మేవారు.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
అయితే ఆ జీవి ప్రతి నడవడికకు దేవుడు కారణం కాదని సూర్యుడు, సౌర్య మండలంలోని ఒక విచిత్ర శక్తి కారణమని నమ్మేవారు. ధనానికి అసలు ప్రాధాన్యత ఇచ్చేవారు.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
అందుకే రాజులు తమ సంపదను ఈ అజీవకులు నివసించే ప్రాంతంలో దాచిపెట్టేవారని, క్లిష్ట సమయంలో వాటిని వాడుకొనేవారని చెబుతారు.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
అందువల్లే భారత దేశం స్వర్ణయుగంగా పేర్కొనే మౌర్యుల కాలంలో ఈ గుహల్లోనే ఎక్కువ నిధులు దాచిపెట్టారని చెబుతారు. అందువల్లే ఇప్పటికీ ఈ గుహల్లో ఆ సంపద జాడ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతారు.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
మౌర్యుల కాలంలో ముఖ్యంగా బిందుసారుడి కాలంలో ఈ ధర్మం ఉచ్చస్థితిని అనుభవించింది. అయితే ఈ ధర్మం లోని పూర్వాపరాలు లిఖిత రూపంలో కాక, మౌఖిక రూపంలో ఉండేవని చెబుతారు.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
అందువల్లే వాటికి సంబంధించిన విషయాలు మనకు ప్రస్తుతం లిఖిత రూపంలో దొరకడం లేదు. అయతే ఈ గుహల్లో ఉన్న కొన్నిరాతి స్తంభాలు మాత్రం మనకు అజీవకుల జీవన విధానాలను తెలియజేస్తున్నాయి.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
ఈ రాతి గహల గోడలు అత్యంత నునుపుదనాన్ని కలిగి ఉంటాయి. ఈ గుహల్లో బుద్దుని శిల్పం కనిపించదు. అయితే బౌద్ధధర్మం ఆరాధనకు వాడే స్థూపం మనకు కనిపిస్తుంది.

బారాబర్ గుహలు, బీహార్

బారాబర్ గుహలు, బీహార్

P.C: You Tube
ఈ గుహల్లో కేవలం రాతి నిర్మాణమే కాకుండా అక్కడక్కడ కొయ్యవాడటం కూడా మనకు కనిపిస్తుంది. గుహాలయాల్లో కొయ్యవాడటం చాలా అరుదైన విషయం. ఇటువంటి విధానాన్ని భారత దేశంలోని మిగిలిన ఏ గుహల్లోనూ మనం చూడలేము.

ఇక్కడ పెళ్లిచేసుకొంటే కొన్ని గంటల్లోనే వైధవ్యం

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more