• Follow NativePlanet
Share
» »ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

సాధారణంగా మనమంతా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలనే చూసి ఆనందిస్తాం. ఒకటికి రెండు సార్లు సైతం ఆ ప్రదేశాలకు వెళతాము. ఇప్పటికి మీరు ఎన్నో ప్రదేశాలు చూసి వుంటారు. అయినప్పటికీ ఇంకా కొన్ని మిగిలి వుంటాయి. వాటిని మీరు సందర్శించి వుండరు. కాని ఇప్పటికి ఎవరూ సాధారణంగా వెళ్ళని ప్రదేశాలు అనేకం కలవు. వాటిలో కొన్నిటిని మీకు అందిస్తున్నాము పరిశీలించండి. ఒక సారి పర్యటించి సగర్వంగా ఆ ప్రదేశాల గురించి అందరికి వెల్లడించండి.

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

సెయింట్ మేరీస్ ఐలాండ్

సెయింట్ మేరీస్ ఐలాండ్ ను కోకోనట్ ఐలాండ్ మరియు తాన్సేపార్ ఐలాండ్ అనికూడా అంటారు. ఇవి మొత్తంగా నాలుగు ద్వీపాలు అరేబియన్ సముద్రం కి దగ్గరిగా కర్నాటక లోని ఉడిపి లో మాల్పే కోస్తా తీరంలో కలవు. ఇవి లావా వెదజల్లబడి ఏర్పడి నట్లు చెపుతారు. ఈ ద్వీపాలు ఇండియా లో 26 వ భూ గర్భ స్మారకాలు. ఇవి ' జియో టూరిసం కు ప్రసిద్ధి.

Pic credit: Wiki Commons

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్

ప్రపంచంలో ఇది మాత్రమే ఫ్లోటింగ్ పార్క్. ఈ నేషనల్ పార్క్ తేలియాడే మొక్కల తో ఏర్పడింది. స్థానికంగా వీటిని ఫూమ్ది అంటారు. ఈ పార్క్ స్థానికంగా పిలువబడే సాంగీ అనబడే అంతరించిపోతున్న డాన్సింగ్ జింకలకు ప్రసిద్ధి.

Pic credit: Wiki Commons

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

డిబ్రూ - సైఖోవా నేషనల్ పార్క్

విభిన్న జీవ వైవిధ్యం కల ఈ పార్క్ లో హార్స్ లు, వివిధ రకాల అంతరించిపోతున్న పక్షులు, ప్రసిద్ధ సాలిక్స్ చెట్లు (వీటితో క్రికెట్ బాట్ లు తయారు చేస్తారు)కలవు. ప్రపంచం లోని 34 రిజర్వు ప్రాంతాలలో ఈ పార్క్ ఒకటి. ఇక్కడ కల బ్రహ్మపుత్ర నదిలో బోటు విహారం చేయటం మరువకండి.

Pic credit: Wiki Commons

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

బెలూం కేవ్స్

ఈ గుహలు సుమారు 3229 మీటర్ల పొడవు వుంటాయి. భారత దేశ ఉపఖండం లో బెలూం గుహలు రెండవ అతి పెద్ద మరియు పొడవైన గుహలు. ఇది ఒక సహజమైన అండర్ గ్రౌండ్ కేవ్ గా ఇది ఏర్పడింది. అండర్ గ్రౌండ్ లో కల నదీ ప్రవాహం ఒకటి నిరంతరం ప్రవహించ టం తో ఈ గుహ ఏర్పడినట్లు చెపుతారు.

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

ఖజ్జియార్

ఈ ప్రదేశం చాలా అందమైన ప్రదేశం. ఈ ఖజ్జియార్ ప్రదేశాన్ని ఇండియా యొక్క స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. హిమాచల్ ప్రదేశ రాష్ట్రంలోని చంబ జిల్లా లో కల సుందరమైన ఈ హిల్ స్టేషన్ పూర్తిగా దేవదారు అడవులు కలిగి వుంది. ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా వుండి మీ సెలవుల విహారానికి తప్పక న్యాయం చేస్తుంది.

Pic credit: Wiki Commons

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

దోయర్స్

ఈ ప్రదేశం ఒక వాలీ. ఇది హిమాలయ పర్వత ప్రాంతం మరియు ఈశాన్య ప్రాంతాల అడవుల మధ్య కలదు. ఇక్కడ కల ఆకర్షనలలో జలదపర వైల్డ్ లైఫ్ సాన్క్చురి, గోరుమర నేషనల్ పార్క్, రసిక్ బిల్ బర్డ్ సంక్చురి , బుక్సా టైగర్ రిజర్వు లుప్రదానమైనవి. ఈ అరుదైన ప్రదేశాలు తప్పక చూడదగినవి.

Pic credit: Wiki Commons

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

పితోర్ ఘర్

పితోర్ ఘర్ ను ' లిటిల్ కాశ్మీర్' అని అంటారు. ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ లోని కుమావొన్ ప్రాంతంలో కలదు. ఇక్కడ నుండి మీరు మౌంట్ కైలాష్ మరియు మానస సరోవర్ యాత్రా స్థలాలు కూడా దర్శించవచ్చు. సాహస క్రీడాకారులకు ఈ ప్రదేశం ఒక స్వర్గం వలే వుంటుంది. అనేక పర్యాటక ఆకర్షణలు చూడవచ్చు.

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

ఇండియాలో ఈ కొత్త ప్రదేశాలు మీకు తెలుసా ?

ఇలా వీజ పూన్చీర

ఈ ప్రదేశం అనేక సుందర దృశ్యాలు కలిగి వుంది. ప్రత్యేకించి పర్యాటకులు ఇక్కడ సూర్యోదయ , సూర్యాస్తమయాలు ఆనందిస్తారు. పర్వత శ్రేణుల మధ్య వుండటంచే ఇలావీఝాపూన్చీర ప్రదేశం ఒక మంచి ట్రెక్కింగ్ ప్రదేశం కూడాను. అనేకమంది ట్రెక్కింగ్ ప్రియులు ఈ ప్రాంతంలో మీరు చూడవచ్చు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతాలు మరింత సుందరంగా కనపడతాయి. ఇక్కడి లోయలోని ప్రవాహాలు మరింత ఉధృతమై, కన్నులకు విందు చేస్తాయి.

Pic Credit: Wiki Commons

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి