Search
  • Follow NativePlanet
Share
» »హనుమంతుడిని బేడీలతో బంధించిన క్షేత్రం గురించి తెలుసా

హనుమంతుడిని బేడీలతో బంధించిన క్షేత్రం గురించి తెలుసా

బేడి ఆంజనేయస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

ప్రతి జీవిలోని దేవుడిని చూడటం హిందూ సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆ దేవుడని భక్తితో పూజిస్తాము తప్పిస్తే శిక్షించం. అసలు అటువంటి ఆలోచనే మనకు రాదు. పైగా మనుషులు తప్పులు చేస్తే ఆ దేవుడు శిక్షిస్తాడని మనం భావిస్తాం. అటువంటి హిందూమతానికి పుట్టినిల్లు అయిన భారత దేశంలో ఓ చోట ఆ హనుమంతుడిని బేడీలతో బంధించారు. ఆ క్షేత్రం ఏమిటి? ఎందుకు బంధించారు? తదితర వివరాలన్నీ మీ కోసం...

కుర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?కుర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?

శని చూపు పడకూడదంటే ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లండిశని చూపు పడకూడదంటే ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లండి

బేడీ ఆంజనేయస్వామి

బేడీ ఆంజనేయస్వామి

P.C: You Tube

ఈ విచిత్ర దేవాలయం ఉన్నది ఒడిషాలో. ఒడిషాలో పూరిజగన్నాథుడు కొలువై ఉన్న పూరీ క్షేత్రం అత్యంత పవిత్రమైన ధార్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అటువంటి పూరీ క్షేత్రంలోనే జగన్నాథ దేవాలయం ఉంది.

మీకు ఇటువంటి ప్రాంతాలు నచ్చక పోవచ్చు. అయినా ఒక్కసారి ఇటు వైపుమీకు ఇటువంటి ప్రాంతాలు నచ్చక పోవచ్చు. అయినా ఒక్కసారి ఇటు వైపు

బేడీ ఆంజనేయస్వామి

బేడీ ఆంజనేయస్వామి

P.C: You Tube
ఈ దేవాలయాన్ని దరియా మహావీర దేవాలయం అని కూడా పిలుస్తారు. పూరి క్షేత్రంలో చక్రనారాయణ దేవాలయం పశ్చిమ భాగంలో సుభాష్ సర్కిల్ ఉంది. ఇక్కడకు ఎడమ వైపున చక్రతీర్థం ఉంది. దాని పక్కనే దరియా మహావీర దేవాలయం కూడా ఉంది.

బేడీ ఆంజనేయస్వామి

బేడీ ఆంజనేయస్వామి

P.C: You Tube
సామాన్యంగా దరియా అంటే సముద్రం అని అర్థం. అంటే ఈ పూరీ క్షేత్రాన్ని ఆ హనుమంతుడు సముద్రంలో మునిగి పోకుండా కాపాడుతున్నాడని ఇక్కడి వారి నమ్మకం.అందువల్లే ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని దరియా మహావీర హనుమ దేవాలయం అని అంటారు.

బేడీ ఆంజనేయస్వామి

బేడీ ఆంజనేయస్వామి

P.C: You Tube
ఇక ఇక్కడ కొలువై ఉన్న హనుమంతుడిని బేడీలతో బంధించడానికి కారణం పై ఒక కథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం పూరీలో జగన్నాథుడు కొలువైన తర్వాత ఆ స్వామి వారి దర్శనార్థం సముద్రుడు ఈ క్షేత్రానికి వస్తాడు.

బేడీ ఆంజనేయస్వామి

బేడీ ఆంజనేయస్వామి

P.C: You Tube
ఆ సమయంలో ఈ క్షేత్రంలోని వివిధ ప్రాంతాలకు సముద్రంలోని నీరు వెళ్లింది. దీంతో ఆ ప్రాంతంలో అపార నష్టం సంభవించింది. దీంతో ఈ క్షేత్ర రక్షకుడిగా ఉన్న హనుమంతుడిని గురించి జగన్నాథుడు వాకాబు చేస్తాడు.

బేడీ ఆంజనేయస్వామి

బేడీ ఆంజనేయస్వామి

P.C: You Tube
అయితే ఆ సమయంలో ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఆ హనుమంతుడు అయోధ్యకు వెళ్లాడని తెలుస్తుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పూరీ జగన్నాథుడు ఇక పై హనుమంతుడు ఎక్కడికీ వెళ్లకుండా సంకెళ్లతో బంధించండని ఆదేశాలు జారీ చేస్తాడు.

బేడీ ఆంజనేయస్వామి

బేడీ ఆంజనేయస్వామి

P.C: You Tube
దీని వల్ల హనుమంతుడు ఇక్కడే ఉంటాడని ఈ క్షేత్రం సముద్రం పాలు కాకుండా కాపాడుతాడని చెబుతాడు. అందువల్లే ఈ క్షేత్రంలో ఉన్న హనుమంతుడిని బేడి అనుమంత అని పిలుస్తారు. అందువల్లే సముద్రం ఎంత ఉప్పొంగినా ఈ క్షేత్రంలోకి ఒక్క చుక్క కూడా నీరు రాదని స్థానికులు చెబుతారు.

బేడీ ఆంజనేయస్వామి

బేడీ ఆంజనేయస్వామి

P.C: You Tube
ఇక వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో కూడా బేడీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. వేంకటేశ్వర స్వామి, భూ వరమా స్వామి దేవాలయం తర్వాత ఎక్కువ మంది సందర్శించుకొనే దేవాలయం బేడి ఆంజనేయస్వామి క్షేత్రం కావడం గమనార్హం.

బేడీ ఆంజనేయస్వామి

బేడీ ఆంజనేయస్వామి

P.C: You Tube
ఆ రెండు దేవాలయాల్లో నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ బేడీ హనుమాన్ దేవాలయంలోకి నైవేద్యాన్ని తీసుకువస్తారు. ఇక ఇక్కడ ఆంజనేయస్వామిని బంధించడానికి గల కారణం పై కూడా ఒక స్థలపురాణ కథనం ప్రచారంలో ఉంది. దాని ప్రకారం హనుమంతుడు బాలుడిగా ఉన్నప్పుడు ఎక్కువ అల్లరి చేసేవాడు.

బేడీ ఆంజనేయస్వామి

బేడీ ఆంజనేయస్వామి

P.C: You Tube
ఈ క్రమంలోనే ఒకసారి ఒంటె పై వెలుతానని తన తల్లి అంజనీ దేవి వద్ద ఎక్కువ అల్లరి చేసేవాడు. దీంతో అంజనీ దేవి హనుమంతుడిని బేడీలతో బంధించి తాను వచ్చే వరకూ ఇక్కడే ఉండాలని చెప్పి ఆకాశ గంగ వైపు వెళ్లిపోయింది. అటు పై ఎప్పటికీ తిరిగి రాలేదు.

బేడీ ఆంజనేయస్వామి

బేడీ ఆంజనేయస్వామి

P.C: You Tube
అందుల్లే ఇక్కడ ఉన్న ఆంజనేయుడికి బేడి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. తన తల్లి రాక కోసం ఆంజనేయస్వామి ఇక్కడ ఎదురు చూస్తున్నాడని చెబుతారు. ఇలా దేశంలో రెండు చోట్ల అపర పరాక్రమ వంతుడైన ఆంజనేయుడిని బేడీలతో బంధించిన క్షేత్రాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X