Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడి శివుడికి కేవలం మట్టిబొమ్మ ఇస్తే చాలు మీకోరికలేవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి

ఇక్కడి శివుడికి కేవలం మట్టిబొమ్మ ఇస్తే చాలు మీకోరికలేవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి

ఇక్కడ శివుడికి డబ్బు,బంగారం, వెండి కానుకలు అవసరం లేదు, కేవలం మట్టిబొమ్మ ఇస్తే చాలు మీకోరికలు ఇట్టే తీరుతాయి.

ఇక్కడ శివుడికి డబ్బు,బంగారం, వెండి కానుకలు అవసరం లేదు, కేవలం మట్టిబొమ్మ ఇస్తే చాలు మీకోరికలు ఇట్టే తీరుతాయి.

మీరు ఇల్లు కట్టాలన్నా, ఉద్యోగం, పెళ్ళి, పెళ్లై ఎన్నో సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టడం లేదు ఇలాంటి కోరికలు మాత్రమే కాదు ..ఏదైనా కష్టం వచ్చినా, సమస్యలు చుట్టిముట్టినా అనుకున్న పని సరైన సమయాయానికి జరగనప్పుడు మనలో చాలా మంది దేవుణ్ని ఆశ్రయిస్తారు. మనసులోని కోరికలు చెప్పుకోవడానికి..అవి నెరవేర్చమని కోరుకోవడానికి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వుంటారు. తమ కోరికలు నెరవేరినప్పుడు అందుకు కృతజ్ఞతగా ఆ దైవానికి తాము అనుకున్న మొక్కులు చెల్లిస్తుంటారు. ఆ మొక్కులు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. అది డబ్బు రూపంలో, బంగారం, వెండి లేదంటే తలనీలాల రూపంలో మొక్కులు చెల్లిస్తుంటారు. కానీ ఇక్కడి శివుడికి అవేవీ అక్కర్లేదు. కేవలం మట్టిబొమ్మలు ఇస్తే చాలు మీ మొక్కులు నెరవేరుతాయి! మరి ఇటువంటి మహత్తర శివుడి కొలువుదీరిన ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

మహాశివుడు కొలువుదీరిన ఈ క్షేత్రం

మహాశివుడు కొలువుదీరిన ఈ క్షేత్రం

మహాశివుడు కొలువుదీరిన ఈ క్షేత్రం, కర్ణాటక రాష్ట్రం బెల్తంగడి తాలూకా, సూర్య గ్రామంలో దర్శనమిస్తుంది.సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలకు 12 కిలోమీటర్ల దూరంలో వుందీ క్షేత్రం. ఇక్కడ శివరుద్ర స్వామి లింగ రూపంలో వెలిశాడని ప్రతీతి.

ఈ క్షేత్రంలో కనిపించే జంట శిలలను పార్వతీ పరమేశ్వరులు

ఈ క్షేత్రంలో కనిపించే జంట శిలలను పార్వతీ పరమేశ్వరులు

ఈ క్షేత్రంలో కనిపించే జంట శిలలను పార్వతీ పరమేశ్వరులుగా స్థానికులు భావిస్తుంటారు. దేవాలయం సమీపంలో ఒక అందమైన ఉద్యానవనం ఉంది. అలాగే ప్రవేశద్వారం వద్ద ఉన్న పెద్ద కోనేరు సందర్శకులను ఆకట్టుకుంటుంది.

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం ఇక్కడ సదాశివ రుద్రస్వామి ఆవిర్భావానికి సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. భ్రుగు మహర్షి తపస్సుకు మెచ్చి వారు ఇక్కడ వెలసినట్టుగా చెబుతారు. భ్రుగు మహర్షి తన శిష్యులతో కలిసి ఇక్కడ తపమాచరించగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై కోరిన వరమిచ్చారట. ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ ప్రాంతంలో శిలారూపాల్లో వెలిశారని స్థలపురాణం. ఈ విలలకు కొంత దూరంలో ఉన్నవి భ్రుగు మహర్షి పాదముద్రలే అని చెబుతారు స్థానికులు.

పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు

పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు

పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు ప్రతి రోజూ సూర్యోదయ సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి పచ్చిక మేసేవాడు, అలా తింటుండగా ఓ రోజూ ఒక మనిషి కంటపడి బందియై కైలాసానికి పోయే అర్హత కోల్పోయి భూలోకంలోనే ఉండిపోయాడట. అప్పుడాయన కైలాస ప్రవేశాన్ని కోరుతూ శివుడిని ప్రార్థించాడట. అయితే మట్టి శివలింగాన్ని స్థాపించాడు కానీ, పూజకు బిల్వ పత్రాలను సమర్పించాలనుకున్నాడు.

మట్టితో బిల్వ పత్రాల ఆకారాన్ని తయారు చేసి వాటినే భక్తితో సమర్పించి

మట్టితో బిల్వ పత్రాల ఆకారాన్ని తయారు చేసి వాటినే భక్తితో సమర్పించి

సమయానికి అవి కనిపించకపోవడంతో, మట్టితో బిల్వ పత్రాల ఆకారాన్ని తయారు చేసి వాటినే భక్తితో సమర్పించి శివుడు అనుగ్రహాన్ని పొంది కైలాస ప్రవేశం అర్హత పొందాడు. ఈ కారణంగానే ఇక్కడ మట్టి బొమ్మలతో మొక్కుచెల్లించే సంప్రదాయం మొదలైందని అంటారు. ఇది పూర్వకాలం నుండి తరతరాలుగా సంప్రదాయంగా వస్తుందని అక్కడి స్థానికులు చెబుతుంటారు.

ఆలయంలోని నంది విగ్రహం వద్ద ఉన్న శిలాశాసనం

ఆలయంలోని నంది విగ్రహం వద్ద ఉన్న శిలాశాసనం

ఆలయంలోని నంది విగ్రహం వద్ద ఉన్న శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయం పదమూడో శతాబ్దం నాటిది. ఇటీవలే దీన్ని ధర్మస్థల దర్మాధికారి వీరేంద్ర హెగ్గడే పునరుద్దరించారు. భక్తులపాలిట కొంగుబంగారమైన శివరుద్రుడిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల జిల్లాల నుండే కాదు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ఇక్కడ వెలసిన లింగాలు పేదల దేవుళ్లుగానూ

ఇక్కడ వెలసిన లింగాలు పేదల దేవుళ్లుగానూ

ఇక్కడ వెలసిన లింగాలు పేదల దేవుళ్లుగానూ, మన్నుమొక్కుబడి దేవుళ్లుగానూ ప్రసిద్ది.

మిగతా ఆలయాలకు లేని ఒక ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది

మిగతా ఆలయాలకు లేని ఒక ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది

ఎలాంటి ఆచ్ఛాదనా లేని ఈ శిలలున్న ప్రాతంలో అడుగుపెట్టిన భక్తులెవరూ మాట్లాడరు. తమ కోరికను మనసులోనే చెప్పుకుంటారు. మిగతా ఆలయాలకు లేని ఒక ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది. అదే మొక్కులు చెల్లించే విధానం. మనం ఏ కోరిక కోరుకుంటే అలాంటి మట్టి బొమ్మను స్వామికి సమర్పించాలి.

ముందుగా మొక్కుకుని ఇల్లు కట్టుకున్న వారు

ముందుగా మొక్కుకుని ఇల్లు కట్టుకున్న వారు

ముందుగా మొక్కుకుని ఇల్లు కట్టుకున్న వారు ... వాహనం కొనుక్కున్నవారు ... ఇల్లు కట్టుకోవాలన్న కోర్కె తీరితే ఇంటి బొమ్మ, వాహనం కొనుక్కున్నవారు కోర్కెతీరితే వాహనం బొమ్మ... పిల్లలు కావాలన్న కోర్కె తీరితే పసివాడి బొమ్మ... ఏదైనా విలువైన వస్తువు కనిపించకుండా పోయి, దానికోసం స్వామికి మొక్కుకుని అది దొరికిన అలాంటి బొమ్మ...ఇలా ఏ కోరిక తీరితే దానికి సంబంధించిన ఒక మట్టిబొమ్మను ఇక్కడి స్వామికి ఇస్తుంటారు భక్తులు.

శివయ్య మంచి మనసుకి ఇంతకన్నా మంచి నిదర్శనం

శివయ్య మంచి మనసుకి ఇంతకన్నా మంచి నిదర్శనం

అలాగే ఇక్కడి ఉద్యానవనం దాటి లోపలకి వెళ్తే గుట్టలు గుట్టలుగా ఉన్న రకరకాల బొమ్మలు కనిపిస్తాయి మనకి. వీటన్నింటిని చూస్తే కొత్తవాళ్ళు ఆశ్చర్యపోతారు.భక్తులు చెల్లించే బొమ్మలన్నీ గుట్టలు గుట్టలుగా ఉంటాయి. శివయ్య మంచి మనసుకి ఇంతకన్నా మంచి నిదర్శనం ఏముంటుంది?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X