Search
  • Follow NativePlanet
Share
» »మురుడేశ్వర చుట్టూ ఉన్న బీచ్‌లు చూసొద్దాం

మురుడేశ్వర చుట్టూ ఉన్న బీచ్‌లు చూసొద్దాం

మురుడేశ్వర చుట్టు పక్కల ఉన్న బీచ్‌ల జాబితా చాలా ఉంది.

భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి ఎతైన శివుడి విగ్రహం ఉన్న మురుడేశ్వర భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ధార్మిక క్షేత్రం. ముఖ్యంగా హిందూ భక్తులు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు. అయితే మురుడేశ్వర ధార్మిక క్షేత్రంగానే కాకుండా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా పేరొందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ బీచ్‌లు ఉండటమే ఇందుకు కారణం.

 మురుడేశ్వర బీచ్

మురుడేశ్వర బీచ్

P.C: You Tube

మురుడేశ్వరలో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన బీచ్‌లల్లో మురుడేశ్వర బీచ్‌ కూడా ఒకటి. ఈ బీచ్‌ను ప్రతి ఏడాలి లక్షల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ బీచ్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.

ఆల్వెకూడి బీచ్

ఆల్వెకూడి బీచ్

P.C: You Tube

మురుడేశ్వరకు కూతవేట దూరంలోనే అల్వెకూడి బీచ్ ఉంటుంది. స్థానికులు ఎక్కువగా ఇష్టమైన బీచ్ అల్వెకూడి బీచ్. ముఖ్యంగా వీకెండ్ సమయంలో ఎక్కువ మంది ఇక్కడకు వస్తుంటారు. అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

బైలూర్ బీచ్

బైలూర్ బీచ్

P.C: You Tube

బైలూర్ బీచ్ మురుడేశ్వర నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అటు స్నేహితులతోనే కాకుండా కుటుంబ సభ్యులతో కూడా సరదాగా గడపడానికి ఈ బీచ్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుకే మురుడేశ్వరను సందర్శించిన వారు తప్పకుండా ఈ బీచ్‌కు వెలుతూ ఉంటారు.

మంకి బీచ్

మంకి బీచ్

P.C: You Tube

మంకిబీచ్ మురుడేశ్వర నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక్క కర్నాటకలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఈ బీచ్ మంచి ప్రాచూర్యం చెందినది. ఈ బీచ్ చాలా అందంగా ఉంటుంది. అందుకే విదేశీయులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఈ బీచ్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

నఖుడా బీచ్

నఖుడా బీచ్

P.C: You Tube

నఖుడా బీచ్‌ను తంగినగుండి బీచ్ అని కూడా అంటారు. ఇది మురుడేశ్వర నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నాటకలో అతి బీచ్‌లలో ఇది కూడా ఒకటి. వారాంతాల్లో ఎక్కువ మంది ఇక్కడకు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X