Search
  • Follow NativePlanet
Share
» »సాహసాలు చేసే ధైర్యం లేకుంటే మీకు ఈ కథనం నచ్చదు?

సాహసాలు చేసే ధైర్యం లేకుంటే మీకు ఈ కథనం నచ్చదు?

సాహస క్రీడలకు సంబంధించిన కథనం.

సాహసం సేయరా డింబకా అని అప్పుడెప్పుడో ఎస్వీ రంగారావు ఓ సినిమాలో డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ ఎవర్ గ్రీన్. ముఖ్యంగా ప్రకతి మొత్తం పచ్చగా కనిపించే ఈ కాలంలో అటువంటి సాహసాలు చేయడానికి భారత దేశంలోని ఎన్నో ప్రాంతాలు రారమ్మని పిలుస్తున్నాయి. ఈ ఆహ్వానాన్ని యువత అందిపుచ్చుకుంటోంది. దీంతో భారత దేశంలో ప్రాచూర్యం పొందిన సాహస క్రీడలకు సంబంధించిన వివరాలు మీకు అందిస్తున్నాం. అంతే కాకుండా క్రీడలకు అనుకూలమైన ప్రాంతాలు కూడా ఈ కథనంలో చెబుతున్నాం. మరెందుకు ఆలస్యం చదవండి. వచ్చే వీకెండ్ లో అక్కడికి వెళ్లండి.

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

P.C: You Tube

ప్రక`తి ఆస్వాధిస్తూ అలా ముందుకు సాగిపోవడాన్నే క్లుప్తంగా ట్రెక్కింగ్ అంటారు. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో ఈ సాహసక్రీడను బ`ందాలుగా నిర్వహిస్తారు. వేసవితో పాటు వీకెండ్ సమయంలో ట్రెక్కింగ్ కోసం తమ కాళ్లకు, గుండెకు పనిచెబుతారు.

మోటార్ బైకింగ్

మోటార్ బైకింగ్

P.C: You Tube

ఈ సాహస క్రీడను బ`ందంగా కంటే ఒంటరిగా చేయాడానికి ఎక్కవ మంది ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా భారత దేశంలో లేహ్ మనాలి మార్గంతో పాటు పశ్చిమకనుమలతో కూడిన దక్షిణ భారత దేశం మోటార్ బైకింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

రివర్ రాఫ్టింగ్

రివర్ రాఫ్టింగ్

P.C: You Tube

ఎగిసిపడే అలలను చీల్చుకొంటూ రబ్బరు బోట్లలలో ముందుకు సాగిపోవడాన్ని రివర్ రాఫ్టింగ్ అంటారు. భారత దేశంలో రుషికేష్ రివర్ రాఫ్టింగ్ కు పెట్టింది పేరు. ఇదక దక్షిణాదిలో కబిని జలాలు రివర్ రాఫ్టింగ్ కు అనుకూలంగా ఉంటాయి.

హాట్ ఎయిర్ బెలూనింగ్

హాట్ ఎయిర్ బెలూనింగ్

P.C: You Tube

పెద్ద బెలూన్ లో ఆకాశంలో ఎగురుతూ భూమి పై ఉన్న అందాలను చూడాలనుకునేవారికి హాట్ ఎయిర్ బెలూనింగ్ తప్పకుండా నచ్చుతుంది. ఇండియాలో రాజస్థాన్ లోని జైపూర్, ముంబైకు దగ్గరగా ఉన్ననోలావాలా భౌగోళిక, వాతావరణ పరిస్థితులు హాట్ ఎయిర్ బెలూనింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

స్కూబా డైవింగ్

స్కూబా డైవింగ్

P.C: You Tube

సముద్రంలోకి వెళ్లి జలచరాలను వాటి సహజ ఆవాసాల్లో చూడాలనుకొనేవారికి స్కూబా డైవింగ్ రారమ్మని ఆహ్వానం పలుకుతూ ఉంది. అండమాన్ నికోబార్, గోవా, మురుడేశ్వర రారమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి. నిపుణుల సహకారం తప్పకుండా ఉండాల్సిందే.

వైల్డ్ సఫారీ

వైల్డ్ సఫారీ

P.C: You Tube

భారత దేశంలో అనేక అభయారణ్యాలు ఉన్నాయి. వీటిలో ఎన్నో జంతువులు, పక్షులను సంరక్షిస్తూ ఉన్నారు. వాహనం లేదా ఏనుగు పై ఈ అభయారణ్యాల గుండా వెలుతూ అక్కడి అందాలను ఆస్వాధించడమే వైల్డ్ సఫారీ. జిమ్ కార్పెట్, కన్హా, పెంచ్ నేషనల్ పార్క్ లో వైల్డ్ లైఫ్ సఫారీని చాలా బాగా ఆస్వాధించవచ్చు.

ఫ్లెయింగ్ ఫాక్స్

ఫ్లెయింగ్ ఫాక్స్

P.C: You Tube

ఎతైన రెండు బండరాళ్ల మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన తాళ్లను పట్టుకుని వేలాడుతూ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్లడమే ఫ్లెయింగ్ ఫాక్స్. హంపి వద్ద తరుచుగా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు.

వాటర్ రప్పెలింగ్

వాటర్ రప్పెలింగ్

P.C: You Tube

వర్షాకాలంలో ఎక్కవగా వాటర్ రప్పెలింగ్ కు అవకాశం ఉంటుంది. వాటర్ ఫాల్స్ రాళ్ల మీదుగా తడుస్తూ తాళ్ల సహకారంతో కిందికి దిగడమే ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రత్యేకత.

పర్వతాల పై సైక్లింగ్

పర్వతాల పై సైక్లింగ్

P.C: You Tube

ఇది ఒక వినూత్నమైన సాహసక్రీడ. ఎత్తైన పర్వతాల్లో, లోయల ప్రాంతంలో సైక్లింగ్ చేయడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడిప్పుడే ఈ క్రీడకు భారత దేశంలో ఆదరణ పెరుగుతూ ఉంది. ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన సైకిల్స్ కవాల్సి వస్తుంది. వాటి ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X