Search
  • Follow NativePlanet
Share
» »కాన్పూర్‌లో ఈ పర్యాటక ప్రాంతాలను చూశారా?

కాన్పూర్‌లో ఈ పర్యాటక ప్రాంతాలను చూశారా?

కాన్పూర్‌లో చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన జాబితా ఇదే.

ఉత్తర ప్రదేశ్‌లో కాన్పూర్ రెండో అతి పెద్ద నగరం. ఇది పురాణ, చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన నగరం. కర్ణుడి పేరుమీదనే ఈ నగరానికి కాన్ఫూర్ అన్న పేరు వచ్చిందని చెబుతారు. ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో ఈ కాన్పూర్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొంది. 1959లో ఇక్కడ ఐఐటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కాన్పూర్ పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఈ నేపథ్యంలో ఇక్కడ పర్యాటకంగా పేరొందిన ప్రదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

అలెన్ ఫారెస్ట్ ఝూ

అలెన్ ఫారెస్ట్ ఝూ

P.C: You Tube

ఈ జంతుప్రదర్శనశాల భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఇక్కడ అంతరించే స్థితికి చేరుకొన్న జాతులను సంరక్షించడమే ఇందుకు కారణం. అంతేకాకుండా ఇక్కడ అందమైన ఉద్యానవనం కూడా ఉంది. అదేవిధంగా అక్వేరియం కూడా ఆకర్షిస్తుంది.

జైన్ గ్లాస్ దేవాలయం

జైన్ గ్లాస్ దేవాలయం

P.C: You Tube

జైన్ గ్లాస్ దేవాలయం మహేశ్వరీ మహల్‌లో ఉంది. ఈ దేవాలయం జైన సంస్క`తిని ప్రతిబింబిస్తుంది. ఈ దేవాలయం మొత్తం గాజును నిర్మితమైనది. అందువల్లే ఈ దేవాలయాన్ని చూడటానికి మిగిలిన మతస్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఈ దేవాలయం ప్రాగణంలో గాజుతో తయారు చేసిన జైన తీర్థాంకరుల విగ్రహాలను మనం చూడొచ్చు.

బుద్ధ బార్గడ్

బుద్ధ బార్గడ్

P.C: You Tube

బుద్ధ బార్గడ్ అనేది ఒక రావి చెట్టు పేరు. కాన్పూర్‌లో మనం చూడవలసిన ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇది ప్రముఖమైనది. మొదటి సిపాయిల తిరుగుబాటుకు ఈ రావి చెట్టుకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడే 144 మంది ఉద్యమకారులను ఉరితీశారని చెబుగారు. అందుల్లే ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొంది.

బిత్తంగావ్ దేవాలయం

బిత్తంగావ్ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయానికి పురాణ ప్రాధాన్యత ఉంది. ఈ దేవాలయం గోపురం ఎత్తు 15.41 మీటర్లు. పెద్ద పెద్ద ఇటుకలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం గుప్తుల కాలంలో నిర్మించారని చెబుతారు. అందువల్లే ఈ దేవాలయం వాస్తుశైలి పై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం వాస్తు శైలిని చూడటానికి విదేశీయులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

ఫూల్ బాగ్

ఫూల్ బాగ్

P.C: You Tube

ఇది కాన్పూర్ లో ఉన్న అత్యంత ప్రాచీన ఉద్యానవనాల్లో ఒకటి. సాయంకాలంలో ఇక్కడకు స్థానికులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడికి దగ్గర్లో గణేశ శకంర్ విద్యార్థి స్మారక హాల్, కే.ఈ.ఎం హాల్, తదితర ఎన్నో పర్యాటక కేంద్రాలను మనం చూడొచ్చు. అందువల్లే కాన్పూర్ పర్యాటకానికి వెళ్లినవారు ఇక్కడికి తప్పకుండా వెలుతూ ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X