Search
  • Follow NativePlanet
Share
» »కొచ్చి పర్యాటకం ఆనంద దాయకం?

కొచ్చి పర్యాటకం ఆనంద దాయకం?

అరేబియా సముద్ర తీర ప్రాంతానికి చెందిన నగరం కోచ్చి. ఈ నగరం చుట్టు పక్కల ఉన్న పర్యాటక కేంద్రాల కోసం ఇక్కడ చెక్ చేసుకోండి.

భారతదేశ పర్యాటక ప్రపంచపటం పై కేరళలో ప్రముఖ పట్టణమైన కొచ్చిది ప్రత్యేకమైన స్థానం. ఈ కొచ్చి చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రాధాన్యత కలిగినది. అసలు కొచ్చి అన్న పదం కోచెఝు అనే మలయాలం పదం నుంచి వచ్చింది. ఈ పదానికి అర్థం చిన్న సముద్రం. ఇక కొచ్చి చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల వివరాలు మీ కోసం....

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

P.C: You Tube

కొచ్చికి మరో అర్థం బందరు. ఇక్కడ సముద్ర తీర ప్రాంతంతో పాటు ఆహ్లాదకరమైన పచ్చటి పర్వత పంక్తులు, పచ్చటి మైదన ప్రాంతాలు, దేవాలయాలు ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే కొచ్చికి వెళితే ఆ ప్రాంతాలన్నింటినీ మనం చూడొచ్చు.

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

P.C: You Tube

కొచ్చిలో చూడదగిన ప్యాలెస్‌‌లలో డచ్ ప్యాలెస్ ఒకటి. ఈ ప్యాలెస్‌ను భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు పోర్చుగీసువారు నిర్మించారు. అదేవిధంగా అటు పై డచ్ వారు పున:నిర్మించారు. అందువల్లే ఈ ప్యాలెస్‌కు డచ్ ప్యాలెస్ అని పేరు వచ్చింది. ఈ ప్యాలెస్‌లో రామాయణానికి సంబంధించిన వర్ణచిత్రాలను కూడా మనం చూడొచ్చు.

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

P.C: You Tube

కేరళ సంప్రదాయ కళల్లో కథాకళి కూడా ఒకటి. కథకళిని కేరళలో మీరు ఏ సందర్భంలోనైనా చూడొచ్చు. ఈ కథాకళి సాహిత్యం, సంగీతం, చిత్రకళ, నటన తదితరాల కలయిక అని చెప్పవచ్చు. రామయణ, మహాభారత కథలను పురుషులు, స్త్రీలు కథాకళి రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు.

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

P.C: You Tube

కొచ్చిలో చూడదగిన మరో ముఖ్యమైన స్థలం యహోది సినగాగ్. ఇక్కడ గాజుతో తయారుచేసిన వివిధ రకాల ల్యాంపులను, స్లాండ్లియర్స్‌ను మనం చూడొచ్చు. ఇక్కడకు ఒక్కసారి వెళితే జీవితంలో మరిచిపోలేని అనుభూతి మిగులుతుంది. శనివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకూ ఇక్కడ సందర్శకుల ప్రవేశానికి అనుకూలం.

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

P.C: You Tube

ఇది మానవ నిర్మిత దీపం. క్రీస్తుశకం 1933లో ఇసుక డ్రెడ్జింగ్ ద్వారా ఈ విల్లింగ్టన్ దీపాన్ని నిర్మించారు. విమానాశ్రయం, పోర్ట్, రైల్వేటర్మినల్ కూడా ఈ ద్వీపంలో ఉండటం గమనార్హం.

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

కొచ్చిలో చూడదగిన ప్రాంతాలు

P.C: You Tube

అరేబియన్ సముద్ర తీర ప్రాంతంలో పోర్ట్ కొచ్చి అనే చిన్న గ్రామం ఉంది. చైనీస్ ఫిషింగ్ నెట్స్, సినగాగ్, డచ్ స్మశానం, చర్చ్ లు వంటివి ఎన్నో చూడదగిన ప్రాంతాలు. ఇక్కడ ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ భారత దేశంలో అత్యంత ప్రాచీన చర్చ్. భారత దేశంలో మొదట నిర్మించిన చర్చి కూడా ఇదే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X