Search
  • Follow NativePlanet
Share
» »కోటగిరి - కోటల యొక్క పర్వతం !

కోటగిరి - కోటల యొక్క పర్వతం !

By Mohammad

తమిళనాడు .. 'దేవాలయాల భూమి' గా అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అందరూ దేవాలయాలను చూడటానికి వస్తున్నారంటే .. మీరు పొరబడినట్లే! ఈ ప్రాంతంలో దేశ ప్రసిద్ధి గాంచిన ఊటీ, కొడైకెనాల్, కూనూర్ వంటి హిల్ స్టేషన్ లు లు కూడా కలవు. ఊటీ, కూనూర్ లకు ఏమాత్రం తీసిపోనివిధంగా సమీపంలోనే మరో హిల్ స్టేషన్ కలదు. అదే కోటగిరి హిల్ స్టేషన్! మీరు ఊటీ వెళ్ళటానికి లాంగ్ ట్రిప్ వేసుకుంటే కోటగిరి ని తప్పక చూసిరండి.

ఇది కూడా తమిళనాడులోని నీలగిరి జిల్లాలో, సముద్రమట్టానికి 1793 మీటర్ల ఎత్తున కలదు. మిగితా రెండు హిల్ స్టేషన్ లతో పోలిస్తే ఇది కాస్త చిన్న. అయినప్పటికీ వాతావరణం పరంగా ఏమాత్రం తీసిపోదు.

ఏలగిరి - ఔరా ! అనిపించే సాహస క్రీడలు !ఏలగిరి - ఔరా ! అనిపించే సాహస క్రీడలు !

కోటగిరి అంటే కోటల యొక్క పర్వతం అని అర్థం. పూర్వం కోటల అనే స్థానిక గిరిజన ఇక్కడ నివాసం ఉండేది. వీరు సాధారణంగా బయటి ప్రదేశాలతో మిళితమవరు. జనాభా గత చివరి లెక్కలో 1000 గా చూపించబడింది.

కోటగిరి ట్రెక్కింగ్ లకు ప్రసిద్ధి. ఇక్కడ గమ్యస్థానాలకు చేరుకోవటానికి అనేక ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి . వ్యూ పాయింట్లు, జలపాతాలు, పార్కులు, దేవాలయాలు మొదలైనవి ఇతర ఆకర్షణలుగా నిలిచాయి.

కొడనాడ్

కొడనాడ్

దీనిని తెరమినల్ కంట్రీ అని పిలుస్తారు. ఇది కోటగిరి కి 25 కి. మీ ల దూరంలో కలదు. కోటగిరి మొత్తం అందాలను ఈ వ్యూ పాయింట్ వద్ద నుండి చూడవచ్చు. సాగర్ డ్యాం, పచ్చిక మైదానాలు, మోయర్ నది, రంగస్వామి శిఖరం లు కనపడతాయి.

చిత్రకృప : Hari Prasad Sridhar

రంగస్వామి శిఖరం

రంగస్వామి శిఖరం

రంగస్వామి పిల్లర్ కోటగిరి కి 24 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 1794 మీటర్ల ఎత్తులో కలదు. గ్రామస్థులకు ఇది స్థానిక దేవత. నీలగిరి పర్యాటకులకు ఈ శిఖరం ప్రధానమైనది. శ్రీరంగ స్వామి పాదముద్రలు శిఖరం అడుగు భాగాన దర్శనం ఇస్తాయి.

చిత్రకృప : Buvanesh Subramani

స్నో గార్డెన్

స్నో గార్డెన్

కోటగిరి మెయిన్ రోడ్, సముద్రమట్టానికి 2677 మీటర్ల ఎత్తులో స్నో డెన్ గార్డెన్ కలదు. నీలగిరి పర్వతాలలో దోడబెట్ట తర్వాత అధిక ఎత్తుకల శిఖరం స్నో డెన్ గార్డెన్. రోడ్డు మార్గం నుండి ఇక్కడికి చేరుకోవడం సులభం.

చిత్రకృప : Prof tpms

లాంగ్ వుడ్ షోలా

లాంగ్ వుడ్ షోలా

లాంగ్ వుడ్ షోలా అనేది ఒక అడవి. ఈ అడవి కనుమరుగవుతున్న జంతుజాలాలకు, పక్షులకు ఆవాసం. బర్డ్ వాచింగ్ కు, ట్రెక్కింగ్ కు అనువైనది.

చిత్రకృప : Michael varun

నీలగిరి మ్యూజియం

నీలగిరి మ్యూజియం

బ్రిటీష్ పాలన నుండి కోటగిరి కి గల చరిత్రను ఇక్కడ గమనించవచ్చు. ఇది పెతకళ్ బంగళాలో కలదు. దీనిలోనే జాన్ సుల్లివర్ మెమోరియలు మరియు నీలగిరి డాక్యుమెంటేషన్ కలదు. అరుదైన మొక్కలు, పక్షులు కూడా సంరక్షించబడుతున్నాయి.

చిత్రకృప : Indian Grey Thrush

జాన్ సుల్లివన్ మెమోరియల్

జాన్ సుల్లివన్ మెమోరియల్

జాన్ సుల్లివన్ మెమోరియల్ కోటగిరి కి 2 కి. మీ ల దూరంలో కలదు. ఇది జాన్ సుల్లివన్ యొక్క నివాసం. అతని కారణం చేతనే ఇప్పటికీ ఇక్కడ తేయాకు తోటలను అధికంగా సాగు చేస్తున్నారు. ప్రవేశ రుసుము : రూ. 10/- మరియు సందర్శన సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.

Hari Prasad Sridhar

నెహ్రూ

నెహ్రూ

కోటగిరి కి కేవలం 3 కి. మీ ల దూరంలో ఉన్న నెహ్రూ పార్క్ ఒక ప్రవేట్ పార్క్. ఇందులో కోట తేగల ఆలయం, మహాత్మాగాంధీ సమావేశ హాలు ఉన్నాయి. పిల్లలు ఆడుకోవటానికి విశాల మైదానం ఉంది. ప్రతి సంవత్సరం మర్చి నుండి జూన్ వరకు గులాబీ ఫ్లవర్ షో లు నిర్వహిస్తారు .

చిత్రకృప : Prof. Mohamed Shareef

ఎల్క్ ఫాల్స్

ఎల్క్ ఫాల్స్

ఎల్క్ ఫాల్స్ కోటగిరి 7 కి. మీ ల దూరంలో కలదు. ఈ జలపాతం మిమ్మలను తప్పక ఆనంద పరుస్తుంది. జలపాతం చుట్టూ విరబూసే నారింజ పంటలు, కొండలు ఇక్కడి ఆకర్షణలు.

చిత్రకృప : Tutul Chowdhury

సెయింట్ కేథరిన్ వాటర్ ఫాల్స్

సెయింట్ కేథరిన్ వాటర్ ఫాల్స్

ఈ జలపాతాలు రెండు పాయలుగా చీలి సుమారు 250 అడుగుల ఎత్తు నుండి కింద పడతాయి. మేట్టుపలయం నుండి కోటగిరి వెళ్ళే మార్గం లో అరవేను ప్రదేశంలో ఇదికలడు. ఈ జలపాతాలను పూర్తిగా చూడాలంటే, మీరు డాల్ఫిన్స్ నోసే వ్యూ పాయింట్ కు వెళ్ళాలి. రోడ్డు మార్గంలో వాటర్ ఫాల్ పై భాగానికి కూడా వెళ్ళవచ్చు. కోటగిరి కి 29 కిలోమీటర్ల దూరంలో కలదు.

చిత్రకృప : Sandip Bhattacharya

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

కోటగిరి నుండి కోయంబత్తూర్ 66 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

మెట్టుపాలాయం సమీప రైల్వే స్టేషన్. కోయంబత్తూర్ వరకు రైలు లో చేరుకొని, అక్కడి నుండి మెట్టుపాలాయం చేరుకోవాలి. ఇక్కడి నుండి మౌంటెన్ ట్రైన్ ఎక్కికూనూర్ / ఊటీ ఏళ్ళవచ్చు. ఇక్కడ మనము కూనూర్ వరకు వెళ్లి, అక్కడి నుంచి స్థానిక బస్సులలో లేదా టాక్సీ లలో కోటగిరి చేరుకోవచ్చు

బస్సు మార్గం

కోయంబత్తూర్ అన్ని విధాలా అనువైనది. కూనూర్ నుండి ఆరవేను మీదుగా కోటగిరి చేరుకోవచ్చి. కూనూర్ నుండి 20 కి. మీ ల దూరంలో కోటగిరి కలదు.

చిత్రకృప : Prof tpms

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X