» »వేసవిలో నదీ జలాల నురుగుల పై

వేసవిలో నదీ జలాల నురుగుల పై

Written By: Beldaru Sajjendrakishore

వేసవిలో వాతావరణం చల్లగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాలని మనస్సు ఉవ్విళ్లూరుతుంటుంది. ఇంటు వంటి చల్లని ప్రదేశాలకు భారత దేశంలో కొదవు లేదు. అయితే అదే వేసవిలో నదీ జలాల పై సయ్యాటలాడాలంటే మాత్రం రివర్ రాఫ్టింగ్ కు వెళ్లాల్సిందే. ఇందుకు భారత దేశంలోని కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయి. అందులో ఇండస్ నది, కులుమనాలి లోని నది, యమునా నది జాలల అలల పై సయ్యంటూ రబ్బరు బోటులో దూసుకుపోవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగిలుస్తుంది. వీటితో పాటు భారత దేశంలో మరికొన్ని రివర్ రాఫ్టింగ్ కు అనుకూలమైన ప్రాంతాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. ఇండస్ నది, జమ్ము కాశ్మీర్

1. ఇండస్ నది, జమ్ము కాశ్మీర్

Image source

రివర్ రాఫ్టింగ్ లో ప్రాథమిక దశలో ఉన్న వారు కూడా ఎంచక్కా లడక్ లోని ఇండస్ నదిలో బోటు ప్రయాణం చేయవచ్చు. సాంకేతిక పరిభాషలో రివర్ రాఫ్టింగ్ లో గ్రేడ్ 1 ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సుమారు 25 కిలోమీటర్ల మేర రివర్ రాఫ్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

2.కులు...మనాలి, హిమాచల్ ప్రదేశ్

2.కులు...మనాలి, హిమాచల్ ప్రదేశ్

Image source

బియాస్ నదీ జలాలాల్లో కులు మనాలి వద్ద రివర్ రాఫ్టింగ్ చేయడానికి దేశంలోని నలుమూలల నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. గ్రేడ్ 1 గ్రేడ్ 3 లెవెల్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వివిధ దశల్లో మొత్తం 14 కిలోమీటర్ల మేర ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

3.యమునా నది, ఉత్తరాఖండ్

3.యమునా నది, ఉత్తరాఖండ్

Image source

ఉత్తరాఖండ్ లోని యమునా నది రివర్ రాఫ్టింగ్ హబ్ గా చెప్పవచ్చు. ఇక్కడ నైన్ బాగ్ నుంచి జూడ్డో, యుమునా బ్రిడ్జ్ టు జుడ్డో అనే రెండు మార్గాల్లో రివర్ రాఫ్టింగ్ జరుగుతుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో ఒక్కక్కదాని పొడవు దాదాపు 9 కిలోమీటర్లు

4.గంగానది, రుషికేష్

4.గంగానది, రుషికేష్

Image source

గంగానదిలో రివర్ రాఫ్టింగ్ మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో సందేహం లేదు. ఇక్కడ బ్రహ్మపురి నుంచి రిషికేష్ (9 కిలోమీటర్లు), శివపురి నుంచి రుషికేష్ (16 కిలోమీటర్లు), మెరైన్ డ్రైవ్ నుంచి రిషికేష్ (24 కిలోమీటర్లు) కౌడియాల నుంచి రిషికేష్ (36 కిలోమీటర్లు) అనే నాలుగు మార్గాల్లో రివర్ రాఫ్టింగ్ అందుబాటులో ఉంటుంది. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 కు అవకాశం కల్పించేలా పరిసరాలు ఉంటాయి.

5.టాన్స్ నది, ఉత్తరాఖండ్

5.టాన్స్ నది, ఉత్తరాఖండ్

Image source

టాన్స్ నదీజాలాల్లో అ రివర్ రాఫ్టింగ్ త్యంత కఠినంగా కూడి ఉంటుంది. దాదాపు 10 కిలోమీటర్ల పొడవైన మార్గంలో కేవలం గ్రేడ్ 3 రివర్ రాఫ్టింగ్ కు అవకాశం ఉంటుంది. నిష్ణాతులు మాత్రమే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేయగలరు.

6.కామేంగ్ రివర్

6.కామేంగ్ రివర్

Image source

అరుణాచల్ ప్రదేశ్ లోని కామేంగ్ నదిలో రివర్ రాఫ్టింగ్ ఛాలెంజింగ్ తో కూడుకున్నది. ఇక్కడ గ్రేడ్ 4 మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొత్తం ప్రయాణం 25 కిలోమీటర్లు.

7.లోహిత్ రివర్

7.లోహిత్ రివర్

Image source

అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ నదీ జలాలు క్రీడలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ తో పాటు కయాకింగ్ కు కూడా అనుమతి ఉంది. అనుభవజ్జులకు మాత్రమే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కు అనుమతి గ్రేడ్ 4 అందుబాటులో ఉంటుంది. మొత్తం ప్రయాణ దాదాపు 100 కిలోమీటర్లు.

8సిప్టి రివర్

8సిప్టి రివర్

Image source

హిమాచల్ ప్రదేశ్ లోని పలు పర్యాటక కేంద్రాలను నదీ జలాల్లో ప్రయాణిస్తూ చూడాలనుకునే వారు సిఫ్టి రివర్ లో రాఫ్టింగ్ చేయవచ్చు. మొత్తం ప్రయాణ దూరం 180 కిలోమీటర్లు. దశల వారిగా జరిగే ఈ ప్రయాణం పూర్తి చేయడానికి ఆరు రోజుల సమయం పడుతుంది.

9.జన్ స్కార్ రివర్ , లడక్

9.జన్ స్కార్ రివర్ , లడక్

Image source

అటు శీతాకాలంలోనే కాకుండా ఇటు వేసవిలో కూడా జన్ స్కార్ నదిలో నీళ్లు చల్లగా ఉంటాయి. పర్వత లోయల గుండా సాగే ఈ ప్రయాణ థ్రిల్ గా ఉంటుంది. దాదాపు 120 కిలోమీటర్ల ప్రయాణంలో గ్రేడ్ 3, గ్రేడ్ 4 మాత్రమే అందుబాటులో ఉంటుంది.

10.పారాపోల్ కూర్గ్

10.పారాపోల్ కూర్గ్

Image source

దక్షిణ భారత దేశంలో రివర్ రాఫ్టింగ్ కు అనుకూలమైన నది పారాపోల్ మాత్రమే. కర్ణాటకలోని కూర్గ్ లో ఈ నది రెండు పాయలుగా విడిపోతుంది. అందులో ఉపరితల పాయలో గ్రేడ్ 4, గ్రేడ్ 5 మాత్రమే అందుబాటులో ఉంటుంది. కింది పాయలో గ్రేడ్ ఆరు, ఏడు అందుబాటులో ఉంటుంది. దీంతో ఈ రెండు మార్గంల్లో రాఫ్టింగ్ లో అనుభవజ్జులు మాత్రమే ప్రయాణం చేయడానికి అనుమతి. మొత్తం ప్రయాణ దూరం 150 కిలోమీటర్లు.

11.భగీరతి నది, ఉత్తరాఖండ్

11.భగీరతి నది, ఉత్తరాఖండ్

Image source

ఉత్తరాఖండ్ లోని భగీరతి నది జలాలలు వేసవిలో రివర్ రాఫ్టింగ్ కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. మొత్తం ప్రయాణ దూరం 150 కిలోమీటర్లు. బేసిక్ తెలిసిన వారి నుంచి అనుభవజ్జులు కూడా ఈ నదిలో రివర్ రాఫ్టింగ్ చేయడానికి అనుకూలం.

12.అలకనందా రివర్, ఉత్తరాఖండ్

12.అలకనందా రివర్, ఉత్తరాఖండ్

Image source

ఉత్తరాఖండ్ లోని అలకనంద నదిలో రివర్ రాఫ్టింగ్ సుదీర్ఘ ప్రయాణంతో కూడుకుని ఉంటుంది. మొత్తం ఆరు రోజుల పాటు వివిధ దశల్లో సాగుతుంది. మనం కావాలనుకుంటే ఒక దశ ముగించిన తర్వాత వెనక్కు వచ్చేయవచ్చు. ఒక్కొక్క దశ దాదాపు 25 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఇక్కడ గ్రేడ్ 4, గ్రేడ్ 5 అందుబాటులో ఉంటుంది.

13. కుండలీక రివర్, మహారాష్ర్ట

13. కుండలీక రివర్, మహారాష్ర్ట

Image source

మహారాష్ట్రలోని కిండలీ నదీ జాలలు కోలాడ్ లోని జలాశయంలోకి వెళ్లే ప్రాతంలో రివర్ రాఫ్టింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ దూరం 10 కిలోమీటర్లు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం రివర్ రాఫ్టింగ్ విషయంలో ప్రాచూర్యం పొందుతోంది.

14. టీస్సా రివర్, డార్జిలింగ్

14. టీస్సా రివర్, డార్జిలింగ్

Image source

టీస్సా నదీ రంగీత్ నదితో కలిసే ప్రాంతం గుండా దాదాపు 309 కిలోమీటర్ల మేర రివర్ రాఫ్టింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రయాణ దూరం కొంత కఠినంగా ఉంటుంది. అందువల్ల అనుభవజ్జులు మాత్రమే ఇక్కడ రాఫ్టింగ్ చేయాటనికి అనుకూలమని చెబుతారు.

15.బ్రహ్మపుత్రా రివర్, అరుణాచల్ ప్రదేశ్

15.బ్రహ్మపుత్రా రివర్, అరుణాచల్ ప్రదేశ్

Image source

This river is one of the best places for river rafting in India. The starting point of rafting is at Tuting and the end is situated in Pasighat. It takes approximately a week to cover the entire stretch. The rafting expedition makes one well aware of the life, culture and tradition of Arunachal Pradesh.

Level of difficulty: Challenging
Distance Covered: The starting point of rafting is at Tuting and the end is situated at a distance of 180 kms in Pasighat.
భారత దేశంలో రివర్ రాఫ్టింగ్ కు అత్యంత అనుకూలమైన ప్రాంతాల్లో అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవహించే బ్రహ్మపుత్ర నదీ ఒకటి. టూటింగ్ తో మొదలయ్యి పాసీఘాట్ తో ముగుస్తుంది. మొత్తం ప్రయాణ దూరం 180 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు వారం. వివిధ దశల్లో ప్రయాణం సాగుతుంది.

Read more about: river rafting, india