Search
  • Follow NativePlanet
Share
» »లవ కుశలు ఆంజనేయుడిని బంధించిన క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా?

లవ కుశలు ఆంజనేయుడిని బంధించిన క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా?

అమృత్ సర్ కు దగ్గర్లోనే భగవాన్ వాల్మికి మందిరం లేదా రామతీర్థం గురించి కథనం.

అమృత్ సర్ భారత దేశంలో పంజాబ్ రాజ్యంలో ఒక ముఖ్యమైన నగరం. అంతేకాకుండా భారత దేశ పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత చెందిన ప్రాంతం కూడా సాధారణంగా అమృత్ సర్ అన్న తక్షణం మనకు అక్కడి స్వర్ణ దేవాలయం గుర్తుకు వస్తుంది. అయితే ఇదే నగరం రామాయణంతో ముడిపడి ఉంది. భారతీయ సంస్కతి సంప్రదాయంలో రామాయణానిది విడదీయలేని బంధం. ఆ పురాణ కథనంలోని ఎన్నో పాత్రలు మనకు నిత్య ఆదర్శాలు. ముఖ్యంగా రామాయణాన్ని రచించిన వాల్మీకి నుంచి మొదలుకొని శ్రీ రాముడి కుమారులైన లవ కుశలు వరకూ మనకు జీవితంలో ఎన్నో విషయాలను బోధిస్తాయి. అటువంటి వాల్మీకి, లవకుశులకు సంబంధించిన ఓ క్షేత్రం గురించిన పూర్తివివరాలు మీ కోసం....

24 గంటలూ గన్ మెన్లతో సెక్యూరిటీ పొందుతున్న అత్యంత పవిత్రమైన వృక్షం24 గంటలూ గన్ మెన్లతో సెక్యూరిటీ పొందుతున్న అత్యంత పవిత్రమైన వృక్షం

ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?

శిధిలాల మీదుగా ప్రయాణం !!శిధిలాల మీదుగా ప్రయాణం !!

రామ రావణ యుద్ధం ముగిసిన తర్వాత

రామ రావణ యుద్ధం ముగిసిన తర్వాత

P.C: You Tube

రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత సీతాదేవిని శ్రీరాముడు అయోధ్యకు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అటు పై కొన్ని కారణాల వల్ల ఆ సీతాదేవిని గర్భవతి అని కూడా చూడకుండా శ్రీరాముడు అడవులకు పంపిస్తాడు.

'జీడిపప్పుల నగరం' చూసొద్దామా ..!'జీడిపప్పుల నగరం' చూసొద్దామా ..!

వాల్మీకి మహర్షి ఆశ్రయం కల్పిస్తాడు

వాల్మీకి మహర్షి ఆశ్రయం కల్పిస్తాడు

P.C: You Tube

అడవులకు వెళ్లిన సీతాదేవికి వాల్మీకి మహర్షి ఆశ్రయం కల్పిస్తాడు. ఆ ఆశ్రమమే అమృత్ సర్ కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న భగవాన్ వాల్మీకి తీర్థ స్థల్. దీనినే రామ తీర్థం అని కూడా పిలుస్తారు. దీనిని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు.

డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!డాన్స్ లు చేస్తే దేవుడు దిగి రావలసిందే!

ఈ రామతీర్థం లేదా భగవాల్ వాల్మీకి తీర్థ స్థల్

ఈ రామతీర్థం లేదా భగవాల్ వాల్మీకి తీర్థ స్థల్

P.C: You Tube

ఈ రామతీర్థం లేదా భగవాల్ వాల్మీకి తీర్థ స్థల్ లోనే ఆ సీతాదేవి కవల పిల్లలకు జన్మనిస్తుంది. వారివురే లవ కుశలు. వీరిద్దరూ తండ్రి శ్రీరాముడికి తగ్గ వారసులు. పరాక్రమంలో తండ్రిని మించినవారు. అందుకే వారి పేర్లు ఈ విశ్వం అంతమయ్యేంత వరకూ ఉంటాయి.

తాజ్ మహల్ గురించిన ఈ నిజాలు మీకు తెలుసా!!తాజ్ మహల్ గురించిన ఈ నిజాలు మీకు తెలుసా!!

అశ్వమేథ యాగం

అశ్వమేథ యాగం

P.C: You Tube

ఇదిలా ఉండగా శ్రీరాముడు అదే సమయంలో అశ్వమేథ యాగం చేస్తారు. యాగ ధర్మాన్ని అనుసరించి ఒక గుర్రాన్ని స్వేచ్ఛగా వదులుతారు. ఆ గుర్రం తిరిగిన ప్రాంతం అంతా ఆ రాజు పాలన కిందికి వస్తుంది. ఇది ఆ కాలంలోని ధర్మాన్ని అనుసరించి నిర్థారించిన నియమం.

రామ తీర్థంలోనే బంధిస్తారు.

రామ తీర్థంలోనే బంధిస్తారు.

P.C: You Tube

ఎవరైనా ఆ గుర్రాన్ని బంధించి ఆ రాజు సైన్యంతో యుద్ధం చేసి గెలిసే వారికి ఆ రాజ్యం దక్కుతుంది. ఈ నేపథ్యంలో శ్రీరాముడు అశ్వమేథ యాగం చేసి వదిలిన అశ్వాన్ని లవ కుశలు ఈ రామ తీర్థంలోనే బంధిస్తారు.

ఎదురిస్తారు

ఎదురిస్తారు

P.C: You Tube

దీనిని విడిపించడానికి వచ్చిన శ్రీ రాముడి సైన్యాన్ని తమ శౌర్య పరాక్రమాలతో ఎదురిస్తారు. అటు పై అశ్వాన్ని విడిపించడానికి వచ్చిన ఆంజనేయుడిని కూడా లవ కుశలు ఇక్కడే బంధించారని స్థల పురాణం చెబుతోంది.

రామయణం

రామయణం

P.C: You Tube

ఇక ఇక్కడే వాల్మీకి మహర్షి రామయణం రచించడాని చెబుతారు. ఆ ఆంజనేయుడిని కట్టేసిన చెట్టు ప్రాంతంలో ప్రస్తుతం దుర్గా దేవి దేవాలయం ఉంది. ఈ దుర్గా దేవి దేవాలయం లాహోర్ గేట్ సమీపంలో ఉంది.

దుర్గాదేవి దేవాలయం

దుర్గాదేవి దేవాలయం

P.C: You Tube

ఈ దుర్గా దేవి దేవాలయం హిందువుల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ పార్వతీ దేవి దుర్గా దేవి రూపంలో నెలకొన్నారు. ఈ దేవాలయాన్ని 20వ శతాబ్దంలో హరసాయిమల్ కపూర్ అనే వ్యక్తి పంజాబ్ లోని గోల్డన్ టెంపుల్ తరహాలో నిర్మించారు.

అనేక మంది దేవతలు

అనేక మంది దేవతలు

P.C: You Tube

ఈ దేవాలయ ప్రాంగణంలో హిందూ దేవతలైన దుర్గాదేవి, సీతా దేవితో పాటు పెద్ద హనుమంతుడి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ దుర్గామాత వివిధ రూపాల్లో చిన్ని చిన్న శిల్పాక`తిలో కనిపిస్తుంది. ఇవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.

సిల్వర్ టెంపుల్

సిల్వర్ టెంపుల్

P.C: You Tube

ఈ దుర్గా దేవి దేవాలయ ద్వారాలను స్వచ్చమైన వెండితో తయారు చేయడవం వల్ల దీనిని సిల్వర్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ దేవాలయంలో అనేక పవిత్రమైన గ్రంధాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని తాళపత్ర గ్రంధాలు కూడా ఉండటం గమనార్హం.

స్వచ్ఛందంగా

స్వచ్ఛందంగా

P.C: You Tube

ఈ దేవాలయాన్ని అత్యంత పవిత్రమైన స్థలంగా స్థానికులు భావిస్తారు. అందుకే స్వచ్ఛందంగా ఈ దేవాలయానికి దాదాపు 200 మీటర్ల వ్యాప్తిలో మాసం, పొగాకును విక్రయించ కుండా స్వయం నియంత్రణ
విధించుకున్నారు.

సరోవరం

సరోవరం

P.C: You Tube

ఈ దేవాలయాన్ని ఒక అందమైన సరోవరం మధ్యలో నిర్మించారు. చూడటానికి అచ్చం గోల్డన్ టెంపుల్ తరహాలోనే కనిపిస్తుంది. ఇక ప్రస్తుత అమృత్ సర్ తో పాటు లాహోర్ ను లవ కుశలు నిర్మించారని చెబుతారు.

బంగారు వర్ణంలో

బంగారు వర్ణంలో

P.C: You Tube

సరోవరం మధ్యలో నిర్మించిన ఈ దేవాలయం అత్యంత సుందరంగా కనిపిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక్కడ ఎక్కువగా మార్బల్ ను వినియోగించి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక గుమ్మటాలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి.

800 కిలోల బంగారు రేకుల తాపడం

800 కిలోల బంగారు రేకుల తాపడం

P.C: You Tube

ఇదిలా ఉండగా భగవాన్ వాల్మీకి తీర్థ స్థల్ లేదా రామతీర్థ లో 8 అడుగుల ఎత్తైన వాల్మీకి విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఈ విగ్రహాన్ని 800 కిలోల బంగారు రేకులతో తాపడం చేయించారు. ఈ ప్రాంతాన్ని రెండేళ్ల క్రితం దాదాపు 200 కోట్ల రుపాయలతో అభివ`ద్ధి చేశారు.

విశేష పూజలు

విశేష పూజలు

P.C: You Tube

ఈ దేవాలయంలో దసరా, జన్మాష్టమి, రామ నవమితో పాటు దీపావళి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి స్థానికులే కాకుండా దేశంలోని నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X