Search
  • Follow NativePlanet
Share
» »అప్పట్లో భయంకర రూపం కలిగిన అమ్మవారి విశేష రహస్యాలన్నీ మీ కోసం

అప్పట్లో భయంకర రూపం కలిగిన అమ్మవారి విశేష రహస్యాలన్నీ మీ కోసం

భీమవరం మావూళ్లమ్మ దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం

భారత దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో దేవతలకు అత్యంత ప్రజాదరణ ఉంటుంది. ఏటేటా ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ గ్రామదేవతల విగ్రహాలు తొలినాళ్లలో ఎలా ఉండేవో ఇప్పటికీ అలానే ఉంటాయి. మరో వందల సంవత్సరాల తర్వాత కూడా అమ్మవారి విగ్రహంలో మార్పురాదు. అయితే భారత దేశంలో ఒకే ఒక ఆలయంలో అమ్మవారి రూపు మారిపోయాయి. అదే విధంగా ఆమెకు భక్తుల నుంచి ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన కథనం మీ కోసం...

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube

భీమవరంలో వెలిసిన మావూళ్లమ్మకి వందల ఏళ్లనాటి చరిత్ర ఉంది. క్రీస్తుశకం 1880 వైశాఖ మాసంలో భీమవరానికి చెందిన మారెళ్ల మంచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మవారు కలలో ఒకేసారి కనిపించారు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
తాను ఎక్కడ వెలిసింది చెప్పి తనకు ఆలయాన్ని నిర్మించాలని సూచించారు. మరుసటి రోజున వారు భీమవరం ప్రాంతంలో వేప, రావి చెట్లు కలిసే ప్రాంతంలో అమ్మవారు లభించారు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
ప్రస్తుతం దీనిని మోటుపల్లి వారి వీధి అని అంటున్నారు. కాగా అటు పై అమ్మవారి ఆదేశాలను అనుసరించి ఓ మామిడి తోటలో ఐదు దీపాలు వెలిగే చోట ఆలయాన్ని నిర్మించారు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
మొదట్లో చిన్న పాక వేసి దానినే ఆలయంగా భావించి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు. మామిడి తోటలో అమ్మవారు కొలువై ఉండటం వల్ల మొదట అమ్మవారిని మామిళ్లమ్మగా పిలిచేవారు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
క్రమంగా ఆ పేరు కాస్త మావూళ్లమ్మగా మారిపోయింది. కాగా, అమ్మవారి రూపు చాలా భయంకరంగా ఉండేది. సాధారణ మానవులు చూడటానికి సాహసించేవారువారు కాదు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
ఇదిలా ఉండగా క్రీస్తుశంక 1910వ సంవత్సరంలో భీమవరాన్ని వరదలు ముంచెత్తాయి. అప్పుడు పూరి పాకలో ఉన్న అమ్మవారి విగ్రహం చాలా వరకూ పాడై పోయింది.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
అటు పై పది ఏళ్లకు క్రీస్తు శకం 1920 ఏడాదిలో కాళ్ల గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యలు అమ్మవారి విగ్రహాన్ని పున: నిర్మించాడు. అయితే ఆ రూపు కూడా చాలా భయంకరంగా ఉండేది.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
దీంతో తిరిగి గ్రంధి అప్పారావు అనే శిల్పి ఆ శిల్పంలో ర్పులు చేసి శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దారు. దీంతో సాదారణ భక్తులు కూడా అమ్మవారి దర్శించుకునడానికి రావడం రోజురోజుకు ఎక్కవయ్యింది

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
దీంతో దేవాలయానికి వచ్చే ఆదాయం కూడా క్రమంగా పెరిగింది. ఇదిలా ఉండగా ఈ పుణ్యక్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్దుడు, రామక`ష్ణ పరమహంస విగ్రహాలు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, చీరలు వంటి ద్వారా ప్రతి ఏటా రెండు కోట్ల రూపాయల ఆదయం లభిస్తుంది. భక్తులు ముడుపులుగా చెల్లించిన చీరలను ఇక్కడ వేలం వేస్తారు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
వాటిని కొంతమంది తీసుకుని ఇంటిలో పెట్టుకొంటారు. దీని వల్ల కుటుంబం సుఖ సంతోషాలతో తులతూగుతుందని భక్తుల నమ్మకం. కాగా, ప్రస్తుతం మావూళ్లమ్మకు అమ్మవారికి ఆభరణాల రూపంలో 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
వీటితో పాటు మరికొన్ని విరాళాలు సేకరించి సుమారు 65 కిలోల బంగారంతో చీరతో పాటు కొన్ని ఆభరణాలు తయారు చేయిస్తున్నారు. దీనికి సుమారు రూ.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
అంతేకాకుండా అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, ఢమరుకం తయారు చేస్తున్నారు. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండటం దేశంలో మరెక్కడా లేదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
ఈ క్షేత్రంలో జ్యేష్ట మాసంలో నెల రోజుల పాటు గ్రామ జాతర నిర్వహిస్తారు. దేవి నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
ప్రతి రోజు లక్షకుంకుమార్చన, చండీహోమం తదితర పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా భీమవరం నుంచే కాక చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
ప్రతి ఏడు జనవరి 13 నుంచి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
ఉత్సవాల చివరి ఎనమిది రోజులూ అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరి రోజున వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
కాగా ఉత్సవాల సందర్భంగా అంతరించిపోతున్న కళలను ఆధరిస్తూ వారి ద్వారా ఇక్కడ ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. అంతేకాకుండా కళాకారులకు పారితోషకాలు కూడా అందజేస్తున్నారు.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

P.C: You Tube
ఉత్సవాల్లో మొదటిరోజు హరికథతో ప్రారంభించి అటు పై రోజుకొక కళా ప్రదర్శన ఉంటుంది. బుర్రకథలు, కోలాటం, భజనలు, కంజరి తదితర ప్రదర్శనలు ఇప్పించడం ఇక్కడి ప్రత్యేకత.

భీమవరం, మావూళ్లమ్మ

భీమవరం, మావూళ్లమ్మ

విజయవాడ నుంచి భీమవరం మధ్య దూరం 135 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు మూడు గంటలు. నిత్యం బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X