Search
  • Follow NativePlanet
Share
» »రాజ భోజుడి వైభోగం !

రాజ భోజుడి వైభోగం !

భోజ్ పూర్ 11 వ శతాబ్దం నాటి నగరం. ఈ నగరం సెంట్రల్ ఇండియా లోని ఇసుక తిన్నెల ప్రాంతంలో కలదు. మధ్య ప్రదేశ్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి కెక్కింది. పురాతన ఈ నగరానికి నేపధ్యంగా బెట్వా నది పారుతూ భోజ్ పూర్ పర్యటనకు మరింత ఆనందాలను చేకూరుస్తోంది. భోజ్ పూర్ లో చూడవలసిన ప్రదేశాలలో పదకొండవ శతాబ్దం నాటి నిర్మాణం అయిన రెండు డాములు కలవు. వీటిని గొప్ప నైపుణ్యంతో పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించి బెట్వా నది ని మరొక వైపుకు తరలించారు. ఒక సరస్సుగా ఏర్పరచారు. భోజ్ పూర్ కు ఆ పేరు ప్రసిద్ధ పాలకుడు పరమార వంశ రాజు భోజుడి పేరు పై పెట్టారు. ఆ రాజు పాలనలో నిర్మించిన ఈ ఆనకట్టలు ఆనాటి గొప్ప సాంకేతిక నైపుణ్యత కి ఉదహారణలు గా నేటికీ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

భోజ్ పూర్ ఎలా చేరాలి ?

భోజ్ పూర్ ఎలా చేరాలి ?

భోజ్ పూర్ కు సమీప విమానాశ్రయం మధ్య ప్రదేశ్ రాజధాని ఐన భోపాల్ లో 44 కి. మీ. ల దూరంలో కలదు. దీని పేరు రాజా భోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ . ఇక్కడ నుండి ముంబై, ఢిల్లీ, జబల్ పూర్, ఇండోర్, గ్వాలియర్ మొదలగు ప్రదేశాలకు విమాన సేవలు కలవు.
ట్రైన్ ప్రయాణం
భోజ్ పూర్ కు సమీప రైలు స్టేషన్ భోపాల్ జంక్షన్. ఇది దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడి వుంది. ఈ స్టేషన్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకు వస్తుంది.
రోడ్డు ప్రయాణం
భోజ్ పూర్ భోపాల్ నుండి చక్కని రోడ్డు మార్గం కలిగి వుంది. భోపాల్ చేరిన ప్రయాణికులు అక్కడ నుండి భోజ్ పూర్ కు రేడియో టాక్సీ లేదా మెట్రో సేవలు వినియోగించు కొనవచ్చు. భోపాల్ లో బస్సు టెర్మినల్ ఒకటి హబీబ్ గంజ్ స్టేషన్ లో కలదు.
Photo Courtesy: nevil zaveri

భోజేస్వర్ టెంపుల్

భోజేస్వర్ టెంపుల్

అసంపూర్ణ నిర్మాణం అయినప్పటికీ భోజేస్వర్ టెంపుల్ ఒక అద్భుత నిర్మాణం. ఈ దేవాలయంలో కల శివ లింగం ఇండియా లోని అతి పెద్ద శివలింగాలలో ఒకటి. ఏకశిల తో నిర్మింఛిన ఈ శివలింగం సుమారు ఏడున్నర అడుగుల పొడవు 18 అడుగుల వ్యాసం కలిగి వుంటుంది. ఈ టెంపుల్ ను తూర్పు లో కల సోమనాధ దేవాలయం అంటారు.
Photo Courtesy: Nagarjun

జైన్ టెంపుల్స్

జైన్ టెంపుల్స్

భోజ్ పూర్ లో కల జైన్ మందిరాలు తప్పక చూడవలసినవి. ఇవి భోజేశ్వర్ టెంపుల్ సమీపంలో కలవు. ఇక్కడ మీరు మరొక అసంపూర్ణ ప్రసిద్ధ జైన మందిరం చూడవచ్చు. ఇక్కడ కల అతి పెద్ద మహావీర విగ్రహం సుమారు 20 అడుగుల ఎత్తు వుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ ఇంకనూ మీరు పార్శ్వ నాద విగ్రహాలు కూడా చూడవచ్చు.

Photo Courtesy: Atishay monty

పార్వతి గుహ

పార్వతి గుహ

భోజ్ పూర్ లో పార్వతి గుహ మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇది బెట్వా నది కి పడమటి భాగంలో కలదు. ఈ గుహ ఇపుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడుతోంది. ఈ గుహ సందర్సన మిమ్ములను ఒక్కసారి 11 వ శతాబ్దపు ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది. దీనిలో మీరు అనేక పురాతన శిల్పాలు, లిఖితాలు చూడవచ్చు. వేల సంవత్సరాల చరిత్ర ఈ గుహలో మీరు అధ్యయనం చేయవచ్చు.
Photo Courtesy: Zippymarmalade

భోజుడి రాజ భవనం

భోజుడి రాజ భవనం

పార్వతి గుహ చూసిన తర్వాత, మీరు భోజ మహారాజు యొక్క రాజ మందిరం చూడవచ్చు. ప్రస్తుతం ఈ పాలస్ పూర్తి శిధిలావస్థలో కలదు. అయినప్పటికీ, దీనికి కనపడే పునాదులు గత సంవత్సరాల రాజుల చరిత్రలను విసదీకరిస్తాయి. ఈ భవన సముదాయం ఒక గ్రిడ్ నిర్మాణం వలే మధ్యలో ఒక ప్రాంగణం కలిగి వుంటుంది. 11 వ శతాబ్దపు రాజుల ఆట పాటల చాయా చిత్రాలు చూడవచ్చు.
Photo Courtesy: Zippymarmalade

తొలచిన రాళ్ళు , కొండ ప్రదేశాలు

తొలచిన రాళ్ళు , కొండ ప్రదేశాలు

దేవాలయ నిర్మాణం కొరకు ఇక్కడే తొలచిన రాళ్ళు మరియు కొండ ప్రదేశాలను అతిపెద్ద సంఖ్యలో చూడవచ్చు. దేవాలయ నిర్మాణం కొరకు చెక్కిన అనేక శిల్పాలు, ఇతర చెక్కడాలు స్తంభాలు, టెంపుల్ ప్లాన్స్ వంటివి ఈ ప్రదేశ చుట్టుపట్ల కనపడతాయి.
Photo Courtesy: Zippymarmalade

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X