Search
  • Follow NativePlanet
Share
» »ముస్లీంలు వేంకటేశ్వరుడిని తమ అల్లుడిగా ఎందుకు భావిస్తారో తెలుసా?

ముస్లీంలు వేంకటేశ్వరుడిని తమ అల్లుడిగా ఎందుకు భావిస్తారో తెలుసా?

బీబీ నాంచారమ్మకు సంబంధించిన కథనం.

కులమతాలన్నవి మనషులు పుట్టిన తర్వాత సష్టించుకొన్నవే. అందువల్లే మనుష్యుల మధ్యనే ఈ కుల మతాల ప్రస్థావన ఉంది కాని ఆ దేవుళ్ల మధ్య లేదు. ఇందుకు బీబీ నాంచారమ్మ ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. ముస్లీం వర్గానికి చెందిన ఆమె వేంకటేశ్వరుడిని మానసికంగా పెళ్లాడినట్లు చెబుతారు. అందుంల్లే ఆ పుణ్యాత్మురాలి విగ్రహం శ్రీరంగం, మేల్కోటే, తిరుమలలో ఉంది. దీంతో చాలా మంది ముస్లీంలు వేంకటేశ్వరుడిని తమ అల్లుడిగా భావించి ఆయనకు ప్రత్యేక సమయాల్లో పూజలు కూడా చేస్తున్నారు. దీని వెనుక దాదాపు 700 ఏళ్లనాటి కథ ప్రచారంలో ఉంది. దీనిని తెలుసుకొంటే పుణ్యమే కాదు ఆ కాలంలోనే కులమతాలకు అతీతంగా ఉన్న విషయాలు అవగతమవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube

నాచాయార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అనే పేరు వచ్చింది. ఈ పాదానికి అర్థం భక్తురాలు. ఇక బీబీ అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం నాటిది.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
దీనిని కొంతమంది జానపదగాధగా చెబుతుండగా మరికొంతమంది నిజంగా జరిగిందని చెబుతారు. ఏది ఏమైనా ముస్లీంలు వేంకటేశ్వరుడిని తమ అల్లుడిగా భావించడం అనాదిగా వస్తోంది.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
ఇందుకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథను అనుసరించి బీబీ నాంచారమ్మ మాలిక్ కాఫర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. అసలు మాలిక్ కాఫర్ స్వతహాగా హిందువు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
అయితే అల్లా ఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారిన తర్వాత అతను ముస్లీంగా మారాడని చెబుతారు. తన రాజ్యాన్ని విస్తరించే భాద్యతను అల్లా ఉద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ మీద ఉంచాడు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
దీంతో మాలిక్ కాఫర్ దక్షిణ భారత దేశం మీద దండయాత్ర గావించాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని వశపరుచుకొన్నాడు. దీంతో శ్రీరంగంలోని రంగనాథుడి ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
దీంతో అక్కడి బంగారం, వెండి, వజ్రాలతో పాటు పంచలోహాలతో తయారుచేసిన ఉత్సవమూర్తిని కూడా మాలిక్ కాఫర్ కొల్లగొట్టి తనతో పాటు ఢిల్లీకి తీసుకువెళ్లాడు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
ఢిల్లీకి చేరుకున్న తర్వాత మాలిక్ కాఫర్ తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందు గొప్పగా ప్రదర్శించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సురతాని రంగనాథుడి విగ్రహం పట్ల ఆకర్షితురాలవుతుంది.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
ఆ విగ్రహం తనకు ఇవ్వాల్సిందిగా కోరుతుంది. కూతురు కోరికను కాదనలేక మాలిక్ కాఫర్ ఆ విగ్రహాన్ని సురతానికి అందజేస్తాడు. ఇక ప్రతి రోజూ ఆ విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం ఊయల ఊపడం చేసేది.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి చేయసాగింది. అంతేకాకుండా తనను తాను ఆ రంగడికి భార్యగా భావిస్తూ వచ్చింది.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
ఇదిలా ఉండగా మరో పర్కా రంగనాథుని ఉత్సవ విగ్రహం లేని శ్రీరంగం వెలవెల పోయింది. దీంతో రంగనాథుడి భక్తులు ఆ రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి మాలిక్ కాఫర్ ను కలిసారు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
రంగనాథుడిని వెదుక్కొంటూ ఢిల్లీ వచ్చిన ఆ అర్చకులను చూసిన మాలిక్ కాఫర్ మనసు కరిగి పోయింది. దీంతో సంతోషంగా ఆ పంచలోహ విగ్రహాన్ని తిరిగి వారికి ఇవ్వడానికి అంగీకరించాడు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
అయితే అప్పటికే రంగనాథుడి మీద మనసుపడిన సురతాని గురించి విన్న అర్చకులు ఆమె ఆదమరిచి నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని తీసుకుని శ్రీరంగం బయలుదేరారు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
ఉదయం లేచిన సురతానికి రంగనాథుడి పంచలోహ విగ్రహం కనబడలేదు. దీంతో ఆ విగ్రహాన్ని వెదుక్కొంటూ ఆమె శ్రీరంగం చేరుకొంది. ఈ క్రమంలో తన తండ్రిమాటను కూడా లెక్కచేయలేదు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
మొత్తానికి శ్రీరంగం చేరుకొని అక్కడే స్వామివారిని సేవిస్తూ ఆయనలో ఐక్యమయ్యిందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని మనం చూడవచ్చు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
మరికొన్ని కథలను అనుసరించి ఆ విగ్రహం శ్రీరంగం లోని రంగనాథుడిది కాదని కర్నాటకలోని మేల్కోటే లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. మరికొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube

కలియుగంలో వేంకటేశ్వరుడిని తోడుగా నిలుచేందుకు ఆమె సురతాని రూపంలో జన్మించిందని చెబుతారు. ఆమె తిరుపతిని చేరుకొని అటు పై భగవంతునిలో లీనమైపోయిందని నమ్ముతారు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
అందువల్లే తిరుపతిలో మనం ఇప్పటికీ బీబీనాంచారమ్మ విగ్రహాన్ని చూడవచ్చు. ఏది ఏమైనా ఆమె ఒక ముస్లీం స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
అందుకే తమిళంలో బీబీనాంచారమ్మను తుళుక్క నాచియార్ అని అంటారు. అంటే తురుష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలా మంది ముస్లీంలు సైతం వేంకటేశ్వరుడి సతిగా భావిస్తారు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
అందువల్లే ముస్లీంలో వేంకటేశ్వరుడిని తమ అల్లుడిగా భావించి ఆయనకు పూజలు చేస్తారు. ఈ విషయాన్ని మనం కడపలో ప్రత్యక్షంగా చూడవచ్చు.

బీబీనాంచారమ్మ, తిరుమల

బీబీనాంచారమ్మ, తిరుమల

P.C: You Tube
ఇదిలా ఉండగా కర్నాటకను పాలించే హైదరాలీ తిరుమల మీదకు దండెత్తాడు. అయితే ఆ ఆలయం ఓ ముస్లీం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకొని వెనుతిరగడం గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X