» »బొర్రా గుహల్లో బయటపడ్డ భయంకర నిజాలు..ఆ వస్తువులను చూసిన ప్రజలు పూజలు చేస్తున్నారు !

బొర్రా గుహల్లో బయటపడ్డ భయంకర నిజాలు..ఆ వస్తువులను చూసిన ప్రజలు పూజలు చేస్తున్నారు !

Written By: Venkatakarunasri

బొర్రా గుహలను 1807 లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. ఒరియా భాషలో 'బొర్ర ' అంటే రంధ్రమని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ళ క్రితంనాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియమ్ బై కార్బోనేట్‌తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గుహలు ఏర్పడతాయి.

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగులు వల్ల ఈ గుహలు ఏర్పడ్డయి. కాల్షియమ్ బై కార్బోనేట్, ఇతర ఖనిజాలు కలిగిఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటివల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి.

PC:Joshi detroit

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

వీటిని స్టాలగ్‌మైట్స్ అని అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలక్టైట్స్ అనేవి కాడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలగ్‌మైట్స్, స్టాలక్టైట్స్ వింతవింత ఆకృతులను సంతరించుకుంటాయి.

PC: Apy Seth

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

వారివారి ఊహాశక్తిని బట్టి యాత్రికులు, స్థానికులు వీటికి రకరకాల పేర్లూ పెడుతుంటారు. ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఆంత్రోపాలజిస్టులకు మధ్యరాతియుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి రాతిపనిముట్లు లభించాయి.

PC:Bhaskaranaidu

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానువులు నివసించినట్లు తెలుస్తోంది. స్థానిక గిరిజనులు బొర్రాగుహలను " బోడో దేవుడి ' (పెద్ద దేవుడు) నివాసంగా నమ్ముతుంటారు. వివిధ రూపాల్లో ఉన్న స్టాలగ్‌మైట్స్, స్టాలక్టైట్స్ లను శివ -పార్వతి, తల్లి-బిడ్డ, ఋషి గడ్డం, మానవ మెదడు, మొసలి, పులి-ఆవు వంటి పేర్లతో పిలుస్తూ వీరు పూజిస్తూ oటారు.

PC:Bhaskaranaidu

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

ఈ గుహలకు గోస్తాని నది తొలిచిన నాలుగు ద్వారాలు ఉన్నాయి. బొర్రా-1 అని వ్యవరించబడే ద్వారమే ప్రస్తుతం ఉపయోగంలో ఉంది. ఇక్కడి నుంచి లోపలికి ఒక కిలోమీటరు వరకూ వెళ్లి గోస్తాని నదిని చేరవచ్చు.

PC:Snehareddy

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

అయితే ప్రస్తుతం గోస్తాని నది వరకు వెళ్లడాన్ని అనుమతించటం లేదు. 1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహల వెలుపల ఉద్యాన పెంపకం, మొక్కలు నాటటం వంటి వాటిని చేపట్టటంతో బొర్రాగుహల పరిసరాలు చాలా అందంగా మారాయి.

PC:Krishna Potluri

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

గుహల్లోపల ఆధునిక దీపాలంకరణ చేయటం, గుహల్లోపలి వింత వింత ఆకారాలపై, రాళ్ళపై రకరకాల రంగులు, నీడలు పడేవిధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చటం జరిగింది. ఇంతకుముందు కాగాడాలతో గైడుల సహాయంతో గుహలను చూపించేవారు.

PC:Veluru.nagarjuna

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

ప్రతీ సంవత్సరం సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తారని ఒక అంచనా. అరకు లోయ అందించిన ప్రకృతి అద్భుతమైన బొర్రాగుహల ఒక వరం. ప్రకృతిలో మనిషికి అర్ధంకాని వింతలెన్నోఉన్నాయి, ఎన్నొ అద్భుతాలున్నాయి.

PC:Ad.woozhi

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

ఇలాంటి అద్భుతాల్లో సహజసిద్ధమైన బొర్రాగుహలు కూడా ఒకటి. తూర్పుకనుమల్లోని ఆ ప్రదేశం నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం. ప్రకృతి ప్రసాదించిన వింత ఇది. తూర్పుకనుమల్లోని అనంతగిరి మండల వరుసలో విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

PC:Ad.woozhi

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

బొర్రా గుహల్లో బయటపడ్డ వింత పరికరాలు !

విశాఖపట్నం నుంచి అరకులోయకు వెళ్లే దారి అంతా కనుమ రహదార్లతో కూడినదే. ఈదారి వెంట ప్రయాణమే ఓగొప్ప అనుభూతి. గుండెలు గుభేలు మనిపించే కొండ దారిలో వెళ్తుంటే కింద పచ్చని తెవాచీ పర్చినట్లు ప్రకృతి, దట్టమయిన అడవులు, అందమైన వన్యప్రాణులు కనబడతాయి.

PC:Ad.woozhi

ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బొర్రాగుహలను సందర్శించాలంటే, విశాఖపట్నం నుంచి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. ప్రత్యేక వాహనాల్లో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. విశాఖ నుంచి బొర్రాగుహల వరకు చేసే రైలు ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతులతో కూడిన యాత్ర. రైలు దాదాపు 40 గుహల ద్వారా ప్రయాణిస్తుంది. వీటిలో కొన్ని ఒక కిలోమీటరు పొడవు కూడా ఉన్నాయి.

PC:rajaraman sundaram

ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

ఈ గుహలు కాక అందమైన లోయల గుండా, పచ్చని పర్వతాల మీదుగా, జలపాతాల ప్రక్కన రైలు ప్రయాణం సాగుతుంది. బస్సు, ఇతరవాహనాల ద్వారా చేసే ప్రయాణం కూడా అందమైన అనుభూతిగా మిగిలి పోతుంది.

PC:rajaraman sundaram

Please Wait while comments are loading...