• Follow NativePlanet
Share
» »3000 అడుగుల ఎత్తులో బ్రహ్మగిరిలో విష్ణులోకం !

3000 అడుగుల ఎత్తులో బ్రహ్మగిరిలో విష్ణులోకం !

కేరళ రాష్ట్రం పర్యాటకతకు మారు పేరు. పచ్చటి ప్రదేశాలు, కొబ్బరి తోటలు, తాటి చెట్ల వరుసల బీచ్ లు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, అనేక దేవాలయాలు, ఆయుర్వేద వైద్య సుగంధాలు, నిర్మల సరస్సులు, సముద్ర ప్రాంతాలు, కాలువలు, ద్వీపాలు, మొదలైన ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. ఏ ఒక్క ఆకర్షణా వదలదగ్గదికాదు. కేరళ రాష్ట్ర పర్యటన ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన ఒక ఆహ్లాదకర పర్యటన. నేషనల్ జియోగ్రాఫిక్ అండ్ ట్రావెల్ ప్లస్ లీషర్ సంస్ధ మేగజైన్ అయిన ట్రావెలర్, కేరళ రాష్ట్రాన్ని ప్రపంచంలోని పది స్వర్గాలలో ఒకటిగాను, జీవితంలో చూడవలసిన 50 పర్యాటక ప్రదేశాలలో ఒకటిగాను, 21వ శతాబ్దంలోని 100 అతి గొప్ప పర్యటనలలో ఒకటిగాను పేర్కొంది. పర్యాటక ఛాయలు చరిత్రను శోధించాలనుకునేవారికి, ఆనందించాలనుకునేవారికి కేరళ రాష్ట్రంలోని ప్రతి పట్టణం, నగరం, అతి చిన్న గ్రామం సైతం తమదైన ప్రత్యేకతలను చాటి ఈ రాష్ట్రానికి గాడ్స్ ఓన్ కంట్రీ అంటే, దేవుడి స్వంత దేశం అనే పేరుని సార్ధకం చేస్తాయి. కేరళలోని కాసర్ గోడ్, కన్నూర్, వయనాడ్, కోజికోడ్, మలప్పురం, పలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, అలపుజ (అలెప్పీ), పాతనంతిట్ట, కొల్లం, తిరువనంతపురం అనే 14 జిల్లాలలోని పర్యాటక ప్రదేశాలు, పర్యాటకలోకంలో పయనించి ఆనందాలను అనుభవించాలనుకునే వారికి వివిధ ఆకర్షణలతో వారి వారి అభిరుచులను తృప్తి పరుస్తాయి.

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

3000 అడుగుల ఎత్తులో,అత్యంత దట్టమైన అడవిలో తిరునెల్లి మహావిష్ణువు యొక్క ఆలయం వుంది.మరి కేరళలోని బ్రహ్మగిరి పర్వతాల్లో ఎంతో అందమైన ప్రకృతిఒడిలో చుట్టూ కొండలు, కోనలు, దట్టమైన అడవీప్రాంతంలో వయానంద్ వ్యాలీలో ఈ మహావిష్ణువు అతిపురాతనమైన ఆలయం వుంది.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

మరి ప్రపంచంలోని పుట్టుకదగ్గర నుండి మరణించేవరకూ, మరణించినతర్వాతకూడా చేసే అనేక కార్యక్రమాలు చేసే ఏకైక ఆలయంగా మనం ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఇక్కడ మరణించినతర్వాత వారి యొక్క ఆత్మశాంతికోసం లేదా పితృదేవతలను సంతోషపరచటానికి నారాయణబలి అనే పూజలు ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతాయి.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

చుట్టూ కొండలు, దట్టమైన అడవి, ఎటుచూసినా పచ్చదనంకన్పిస్తూ మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.ఈ ఆలయం అతిపురాతనమైనది. మరి ఈ ఆలయం యొక్క నిర్మాణం గురించి ఖచ్చితమైన వివరాలు ఏమీలేవు. ఎన్నో వేల సంలుగా ఈ ఆలయం వుందని చరిత్రకారులు భావిస్తారు.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

ఇక కొందరు తమిళ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తమిళరాజు భాస్కరరవివర్మ 962 నుండి 962CEలో దీన్ని పట్టణంగా చేసుకుని పరిపాలించాడని చారిత్రకఆధారాలద్వారా తెలుస్తుంది. అయితే అప్పట్లో ఇది ఒక పట్టణంగా పుణ్యక్షేత్రంగా వుండేదని తెలుస్తుంది.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

దట్టమైన అడవిలో రెండు పురాతనమైన చిన్నగ్రామాలను కూడా ఆర్కియాలజికల్ వారు కనుగొన్నారు.మరి వేదవ్యాసుడు తాను రాసిన 18పురాణాల్లో మత్స్యపురాణం, కూర్మపురాణం, స్కంద పురాణం,నరసింహ పురాణం, పద్మపురాణం ఇలా తాను రాసిన పురాణాల్లో ఇతర అనేక పురాణాల్లో కూడా ఇక్కడి శ్రీమహావిష్ణువు ఆలయం గురించి ఆ పురాణాల్లో వివరించబడివుంది.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

ఈ ఆలయాన్ని ఆ బ్రహ్మ నిర్మించాడని పురాణాలఇతిహాసం ప్రకారం తెలుస్తుంది. అత్యంత దట్టమైన అడవిలో నిర్మించినఆలయం ఇది.ఈ ఆలయాన్ని సహ్యమాలక క్షేత్రం అంటారు. మరి పురాణఇతిహాసం ప్రకారం బ్రహ్మ తన హంసవాహనంపై భూలోకంలో తిరుగుతూవుండగా ఈ బ్రహ్మగిరి పర్వతాల యొక్క ప్రకృతిఅందాలకు ముగ్ధుడైన బ్రహ్మ ఈ ప్రాంతంలోకి వస్తాడు.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

అక్కడ తాను ఆమ్ల వృక్షంక్రింద విష్ణుమూర్తి విగ్రహాన్ని చూసి ప్రార్ధించారు. మరి ఆ ప్రాంతాన్నే వైకుంటం అని విష్ణులోకం అని పురాణాలు చెప్తున్నాయి.ఇక ఆ ప్రాంతంలో బ్రహ్మ విష్ణుమూర్తివిగ్రహాన్ని ప్రతిష్టించిప్రార్ధించాడు.ఇక బ్రహ్మయొక్క కోరికమేరకు శ్రీ మహావిష్ణువు ఆ ప్రాంతంలో పాపనాశనంలో ఎవరైతే వారి యొక్క సర్వపాపాలన్నీ నశిస్తాయనే వరాన్నిఇస్తాడు.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

మరి ఇప్పటికీ ఇక్కడ పూజారులు బ్రహ్మముహుర్తంలో ఆ బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి స్వామిని పూజిస్తారని అంటారు. ఇక పురాణాలప్రకారం జమదగ్ని తండ్రియొక్క క్రియలను ఇక్కడే నిర్వహించి పాపవినాశనంలో స్నానం చేసాడని అంటారు.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

మరి తాను క్షత్రియులను వధించిన పాపాన్ని ఇందులో స్నానాన్ని ఆచరించి తొలగించుకున్నాడు. మరి ఈ ఆలయానికి పూర్వకాలంలో మహాదేవుని ఆలయానికి దారివుండేదట. మరి ఈ ప్రమాదం అంటే అంత ఆషామాషీకాదు. ఎంతో ప్రమాదకరంఅయినది. కొండలు, కోనలు, జలపాతాలు,దట్టమైన అడవిలో క్రూరమృగాలమధ్య ఎంతో సాహసోపేతంగా వుండేది ఈ ప్రయాణం.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

ఇక పాపనాశిని, బ్రహ్మగిరి వీటిచుట్టూ అనేకరకాలైన ఎన్నో వేలసంవత్సరాల నాటి చెట్లు, అనేకరకాల ఆయుర్వేదమూలికలు వుంటాయి.మరిక పాపనాశినిలో సాధారణంగా చాలామంది నారాయణబలి నిర్వహిస్తూ వుంటారు.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

అంటే పితృదేవతల శాంతికోసం ఇక్కడ నిర్వహిస్తూవుంటారు. మరిక్కడ వుండే అతిప్రాచీన ఆలయాలు దట్టమైన మరియు ప్రకృతిఒడిలో వుండి అనేకమంది పర్యాటకులని ఇక్కడికి వచ్చేలా చేస్తున్నాయి. ప్రకృతిప్రేమికులనే కాకుండా ఎంతోమంది భక్తులుకూడా ఈ ఆలయాన్ని దర్శించటానికి ఎంతో సుదూరప్రాంతాలనుండి రావడం అనేది జరుగుతుంది.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

కేరళ పర్యాటకత ఎన్నోఆనందకర అంశాలు కలిగి ఉంది, ఇసుక దిన్నెల బీచ్ లు, ఆనందమయ బ్యాక్ వాటర్స్, పర్వత ప్రదేశాలు, వంటివి విశ్రాంతిలో పునరుజ్జీవనం పొందాలనుకునే వారికి, సాహస క్రీడలు ఆచరించాలనుకునేవారికి లేదా ప్రశాంతతతో ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకునేవారికి లేదా శృంగార కేళిలో ఓలలాడాలనుకునే జంటలకు, బిజీ నగర జీవితాలతో సతమతమై అలసి సొలసినవారికి ఒక విశ్రాంతి సెలవుల నిలయంగా ప్రతి ఒక్క ప్రదేశం విరాజిల్లుతోంది.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

కేరళ లోని నీటి మార్గాలు - జల విస్తరణ వర్కాల, బేకాల్, కోవలం, మీనకున్ను, షెరాయ్ బీచ్, పయ్యంబాలం బీచ్, శంగుముఖం, ముజుప్పిలంగాడ్ బీచ్, మొదలైనవి మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసే బీచ్ లు. కేరళలోని అద్భుతమైన బ్యాక్ వాటర్స్ అలప్పుజా లేదా అలెప్పీ, కుమరకోం, తిరువల్లం, కొల్లం, కాసర్ గోడ్, మొదలైన చోట్ల కలవు. ఈ ప్రదేశాలు బ్యాక్ వాటర్ అనుభవాలకు ఇష్టపడేవారికి మరచిపోలేని అనుభూతులిస్తాయి. కేరళ బ్యాక్ వాటర్లలో కెట్టువలములు మరియు హౌస్ బోట్లు ఉపయోగిస్తారు.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

హౌస్ బోట్లు కొద్దిపాటిగా అభివృధ్ధి చెందిన వినోదపు రవాణా వీటిని పర్యాటకులకు వసతిగా కూడా ఉపయోగిస్తారు. బ్యాక్ వాటర్ రిసార్టులు కూడా ఇక్కడ కలవు. సాంప్రదాయక స్నేక్ బోట్ రేసు ప్రతి ఏటా కేరళలో జరుగుతుంది. దీనిని చూసి ఆనందించేందుకు అనేకమంది పర్యాటకులు రాష్ట్రానికి వస్తారు.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

వెంబనాడు సరస్సు, అష్టముడి సరస్సు, పూకోడు సరస్సు, సష్టంకొట్ట సరస్సు, వీరనపూజ వెల్లాయని సరస్సు, పరవూర్ కాయల్, మనచిరా, మొదలైన సరస్సులు కేరళ రాష్ట్రాలను మరింత అందంగా చూపి పర్యాటకులను ఆకర్షిస్తాయి. వెంబనాడు సరస్సు భారతదేశంలోని అతి పెద్ద సరస్సులలో ఒకటిగా చెపుతారు. కేరళ హిల్ స్టేషన్లు- ఎత్తు పల్లాల అద్భుతాలు కేరళలోని అందమైన మున్నార్ హిల్ స్టేషన్ నేటికి ఎంతో పవిత్రంగా కనపడుతుంది.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

దక్షిణ ఇండియాలోని ఇతర హిల్ స్టేషన్లతో పోలిస్తే, ఈ ప్రదేశంలో వాణిజ్య కలాపాలు చాలా తక్కువ. హనీమూన్ జంటల శృంగార కేళికి ఈ ప్రదేశం సరైనది. వయనాడ్ కు సమీపంగా ఉంది. వాగమన్, పొన్ముడి, ధెక్కడి, పీర్ మేడ్, మొదలై ఇతర హిల్ స్టేషన్లు కూడా పర్యాటకులు ఆనందించవచ్చు. ధెక్కడి ప్రదేశం వన్యజీవులకు, సాహస క్రీడలకు ప్రసిద్ధి. సంస్కృతి, ఆహారాలు, వేష భాషలు - సమగ్ర ముద్రలు కేరళ సంస్కృతి భారతీయ సంస్కృతికి ఎంతో భిన్నంగా కనపడుతుంది.

PC:youtube

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

విష్ణు లోకం బ్రహ్మగిరి పర్వతాలలో

వివిధ రీతుల కళలు, ఆహారాలు, దుస్తులు మొదలైనవి పర్యాటకులకు ఆశ్చర్యం కలిగించే రీతిలో ఉంటాయి. కేరళ రాష్ట్రం అనేక నాట్యాలకు పుట్టినిల్లు. డ్రామాలు, జానపద కళలు, మొదలైనవి ప్రసిద్ధి. కధాకళి మరియు మోహినియాట్టం వంటివి ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయి. ప్రసిద్ధి చెందిన నాట్యాలు మత పర మూలాలు కలిగి ఉంటాయి. క్రైస్తవుల పరిసముత్తు మరియు వచిట్టు నాదకోం, ముస్లిం మతస్తుల ఒప్పన మరియు హిందూ మతస్తుల కూడియాట్టం వంటివి మత సంబంధ కళలుగా ప్రసిద్ధి కెక్కాయి.

PC:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి