» »మన దేశం లోనే ఉన్నా..మనకి తెలియకుండా మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మన దేశం లోనే ఉన్నా..మనకి తెలియకుండా మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

Written By: Venkatakarunasri

మత్స్య అంటే సంస్కృతంలో "చేప" అని అర్థం. జాతి వారు వేద భారతదేశంలోని ఇండో-ఆర్య తెగలలో ఒకటి. వేద కాలం నాటికి, వారు కురు సామ్రాజ్యమునకు దక్షిణాన ఉన్న ఒక రాజ్యం పాలించారు మరియు పాంచాల రాజ్యం నుండి వేరుచేసిన యమునా నదికి పశ్చిమాన వారు పాలించారు. ఇది రాజస్థాన్‌ లోని జైపూర్ మాజీ రాష్ట్రానికి అనుగుణంగా ఉంది, అంతేగాక హిందాన్, ఆల్వార్ మొత్తం భూభాగం, భరత్పూర్ యొక్క కొంత భూభాగాలతో కూడా ఉంది.

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మత్స్య రాజ్యం రాజధాని విరాటానగరి (ప్రస్తుతం బైరాత్) దగ్గర ఉంది మరియు దీని స్థాపకుడు రాజు విరాటా పేరున పెట్టబడినది. పాళీ సాహిత్యంలో, మాత్స్య తెగ సాధారణంగా శూరసేనుడుతో సంబంధం కలిగి ఉంటుంది. పశ్చిమ మత్స్య రాజ్యం , చంబల్ నది ఉత్తర ఒడ్డున ఉన్న కొండ మార్గం.

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మత్స్య రాజ్యం మత్స్య రాజు చేత స్థాపించబడింది ఇతను భీష్మ కు సమకాలీకుడైన సత్యవతి యొక్క కవల సోదరుడు. 6 వ శతాబ్దం ప్రారంభంలో, బౌద్ధ గ్రంధం అంగుత్తర నికాయలో పేర్కొన్న పదహారు మహా జనపదాలు (గొప్ప రాజ్యాలు) నందు మత్స్య రాజ్యం ఒకటి. కానీ దాని శక్తి బాగా తగ్గిపోయింది.

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

బుద్ధుని కాలం నాటికి అది కొద్దిగా రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. మహాభారతం నందు సహజ అను ఒక రాజును సూచిస్తుంది. అతను చేది మరియు మత్స్య రాజ్యాలను రెండింటిని పాలించాడు. దీనిని బట్టి, మత్స్య రాజ్యం అనేది ఒకసారి చేది రాజ్యంలో ఒక భాగంగా ఏర్పడింది అని ఇది సూచిస్తుంది.

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

కురు రాజ్యానికి దక్షిణాన మత్స్య రాజ్యం అనగా రాజస్థాన్ లోని భరత్‌పూర్ జిల్లాలు, హిందాయున్ మరియు అల్వార్లలో ఉన్నది కాకుండా, ఇతిహాసాలలో ఇతర ఆరు మత్స్య రాజ్యాలున్నట్లుగా పేర్కొనబడ్డాయి. మత్స్య రాజ్యంలో ఒక ప్రముఖ నగరంగా ఉపప్లవ్య ఉంది.

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మహా భారతం ప్రాంతాలు - నాడు, నేడు..

మహాభారతం.. పురాణమే కాదు.. ఒకనాటి చరిత్ర కూడా. మహాభారతంలోని ప్రాంతాలు నేడు ఏఏ పేర్లతో ఉన్నాయో తెలుసుకుని తరించండి. ఈ ప్రాంతాల్లో పర్యాటక యాత్ర చేస్తే అదో అలౌక ఆధ్యాత్మిక యాత్ర కాగలదు. 0- మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్ 0- నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్ 0- జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

0- దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా 0- వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్ 0- ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్. 0- సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర 0- హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

ఉత్తర్ ప్రదేశ్ 0- మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్ 0- వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర 0- కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్. 0- మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్. 0- ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం), డెహ్రాడూన్ 0- కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్) 0- పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్. 0- శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్. 0- ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర 0- కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

0- పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్ 0- మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

రాజస్థాన్ 0- విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్ 0- నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్ 0- జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

విరాట్ నగర్ - మహాభారతం జరిగిన చోటు !!

విరాట్ నగర్, రాజస్థాన్ రాష్ట్రంలోని పురాణేతిహాసాలతో ముడిపడి ఉన్న ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం ఆ రాష్ట్ర రాజధాని జైపూర్ కు 89 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ప్రదేశాన్ని చాలా మంది బైరాత్ అని కూడా పిలుస్తుంటారు.

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

ఈ ప్రదేశం గురించి మహాభారతంలో పేర్కొనబడింది. దీనిని విరాటుడు అనే రాజు కనుగొన్నాడని, పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపారని చెబుతారు. విరాట్ నగర్ లో ప్రధాన ఆకర్షణలు విరాట్ నగర్ లో ప్రధాన ఆకర్షణలు ఇక్కడ ఉన్న గుహలు.

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

వీటిలో పాండవులు కొంత కాలం తలదాచుకున్నట్లు చెబుతారు స్థానికులు. ఈ గుహలే కాక ఇక్కడ భీం కి దుంగారి మరియు పాండు హిల్ వంటి అనేక ప్రసిద్ధ ఆకర్షణలు ఉన్నాయి. పర్యాటకులు ఇక్కడ బౌద్ధ ఆరామాలు, దేవాలయాలు, మ్యూజియాలు, జైన మందిరాలు మొదలగునవి చూడవచ్చు.

PC:youtube

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

భీం కి దుంగారి

భీం కి దుంగారి ఒక పెద్ద గుహ. ఇక్కడ పాండవులు తమ అజ్ఞాత వాసం గడిపారని, ఈ గుహాలలోనే కొంత కాలం నివసించారని చెబుతారు. పాండవులలో ఒకరైనా భీముడు పేరు మీద ఈ గుహలు ఆ పేరొచ్చింది. భీముడు విరాటుడు రాజుకు వంటవాడిగా అజ్ఞాత వాసం గడిపాడు.

చిత్రకృప : Giridharmamidi

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

అశోకా శిలాలేఖ్

అశోకా శిలాలేఖ్ అనేది అశోకుడు వేయించిన శాశనం. దీనిని మౌర్య చక్రవర్తి అశోకుడు రాయించాడు. దీని చుట్టుప్రక్కల అనేక సుందర దృశ్యాలను చూడవచ్చు. మెయిన్ రోడ్డు కు 100 మీటర్ల దూరంలో ఈ శిలాలేఖ్ కలదు.

చిత్రకృప : Rafatalam100

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

బీజక్ కి పహారి

బీజక్ కి పహారి లో బౌద్ధ ఆరామాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఇదివరకు 8 వరకు ఆరామాలు ఉండేవని, ప్రస్తుతం రెండే ఉన్నాయని చెబుతారు. అశోకుడు వీటిని నిర్మించినట్లు అక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఎంట్రెన్స్ లో బ్రహ్మలిపి లో ఉన్న శాశనాలను పర్యాటకులు చూడవచ్చు.

చిత్రకృప : Raonaresh

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

జైన్ నాసియా

జైన్ నాసియా అనేది ఒక ఉద్యానవనం. ఇది మొఘల్ గేట్ కు ఎదురుగా కలదు. పిల్లలు ఆడుకొనేందుకు ఇక్కడ ఒక ఆట స్థలం కలదు. సాయంత్రం పూట స్థానికులు కుటుంబసభ్యులతో వచ్చి సేదతీరుతుంటారు.

చిత్రకృప : viratnagar

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

జైన దేవాలయం

జైన దేవాలయం ఇక్కడి అతికొద్ది ఆకర్షణలో ప్రధానమైనది. దేవాలయం ఎంట్రెన్స్ లో స్తంభాల పోర్టికో చక్కని చెక్కడాలతో కనపడుతుంది. ఇందులో జైన మత శాశనాలు, ఇతర మత శాశనాలు చూడవచ్చు. జైన తీర్థాంకుల విగ్రహాలను చూడవచ్చు.

చిత్రకృప : Giridharmamidi

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

గణేష్ గిరి ఆలయం

గణేష్ గిరి ని విరాట్ నగర్ ను సందర్శించే హిందూ భక్తులు తప్పక దర్శించాలి. సంవత్సరం పొడవునా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. సమీపంలో చిన్న మ్యూజియం చూడవచ్చు. ఇందులో 170 శిల్పశైలి కధనాలు వివరించబడ్డాయి.

చిత్రకృప : viratnagar

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మొఘల్ గేట్

ఇదొక స్మారక చిహ్నం. దీనిని తాజ్ మహల్ కు నకలు అని కూడా అభివర్ణిస్తుంటారు. సంవత్సరం పొడవునా ఈ పబ్లిక్ ప్రదేశాన్ని విరాట్ నగర్ ను సందర్శించే ప్రతి పర్యాటకుడు చూడాల్సిందే !!

చిత్రకృప : Raonaresh

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

విరాట్ నగర్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

విరాట్ నగర్ కు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ నుండి ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి. జైపూర్ నుండి విరాట్ నగర్ కేవలం 89 కిలోమీటర్ల దూరంలో కలదు.

చిత్రకృప : Giridharmamidi

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

రైలు మార్గం

విరాట్ నగర్ కు సమీపాన జైపూర్ రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి. అక్కడ దిగి టాక్సీ లో ప్రయాణించి విరాట్ నగర్ చేరుకోవచ్చు.

చిత్రకృప : Rafatalam100

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !

వాయు మార్గం

విరాట్ నగర్ కు సమీపాన జైపూర్ ఎయిర్ పోర్ట్ కలదు.ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి విరాట్ నగర్ చేరుకోవచ్చు.

చిత్రకృప : viratnagar