Search
  • Follow NativePlanet
Share
» »తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ రహస్యం ఏంటి?మీకేమైనా తెలుసా?

తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ రహస్యం ఏంటి?మీకేమైనా తెలుసా?

అంతుచిక్కని రహస్యం: తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో లింగం క్రింది నీటి ప్రవాహం!

బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనంతపురం జిల్లా, తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. సూర్య చంద్రులు ఎలాగో భగవంతుడు ఒక్కడేనని ఆ భగవంతుడు శివుడేనని హిందువులు గట్టిగా నమ్ముతారు.

ఈ భూమి మీద ఆ పరమేశ్వరుడు లేని చోటు, శివుడు లేని వస్తువు, శివుడు లేని ప్రాణి లేదని అందరిలోనూ శివుడున్నాడని అదే అద్వైత తత్వమని హైందవ సంస్కృతి తెలియజేస్తుంది. ఈ ముక్కోటి దేవుళ్ళకు ఆదిదంపతులైన శివపార్వతులు మన దేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలున్నాయి. వాటిలో వేటికవే ప్రత్యేకమైనవి. ఒక్కో ఆలయానానికి ఒక్కో చరిత్ర ఉంది. అన్ని ఆలయాల్లో ఒకటి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అత్యంత మహిమాన్వితమైనది.అందమైన శిల్పకళా నిలయం జిల్లా కేంద్రం అనంతపురంకు 57కిలోమీటర్ల దూరంలో కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా తాడిపత్రి ఉంది. ఆ ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక్కడ పెన్నానది తీరంలో

ఇక్కడ పెన్నానది తీరంలో

ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగంలో శ్రీరామ చంద్రుడి చేతి ప్రతిష్టింపబడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు. భక్తుల నుండి పూజలందుకుంటున్న రామలింగేశ్వరుడి ప్రతిమ త్రేతాయుగం కాలం నాటిది. బ్రహ్మణుడైన రావణుడిని చంపడంల వల్ల వచ్చే పాపం నుండి విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరామ చంద్రుడే దేశంలో చాలా చోట్ల శివలిగాలను ప్రతిష్టించారు, అలా ప్రతిష్టింపబడిన శివలింగాలలో ఇది కూడా ఒకటని ఆలయ పూజారులు కథనం.

PC:Jayanthnaidu

విజయనగర రాజులు అంటే కళలకు

విజయనగర రాజులు అంటే కళలకు

విజయనగర రాజులు అంటే కళలకు అత్యంత గౌరవమిస్తారు. వారి పరిపాలనా కాలంలో నిర్మించిన ఎన్నో కట్టడాలను కళాత్మకంగా నిర్మించిన చరిత్ర వారిది. ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా అంతే అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన ఘనత వారికే ఉంది.

PC: Sashank.bhogu

భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుడిరి దర్శించినప్పుడు

భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుడిరి దర్శించినప్పుడు

భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుడిరి దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవశ్యానికి లోనవుతారో అలాగే ఆలయ గోడల మీదున్న ఈ శిల్పాలకు అంతే మంత్రముగ్ధులవుతారు. రామాచారి అనే శిల్పకారుడు సుమారు 650 మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.

PC: Pranav Sujay

ఈ ఆలయంలో శిల్ప సౌందర్యంతో

ఈ ఆలయంలో శిల్ప సౌందర్యంతో

ఈ ఆలయంలో శిల్ప సౌందర్యంతో పాటు ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత ఇక్కడి శివలింగం. అన్ని చిన్న పెద్ద దేవాలయాలలో ఉన్నట్లుగా కాకుండా ఇక్కడి శివలింగం ఒక ప్రత్యేక ఆకారంలో ఉంది.

PC: Pranav Sujay

అలాగే ఏడాదిలో 365 రోజులు శివలింగం

అలాగే ఏడాదిలో 365 రోజులు శివలింగం

అలాగే ఏడాదిలో 365 రోజులు శివలింగం కింద నుండి జలధార ఊరుతునే ఉంటుంది. బుగ్గ అంటే నీటి ఊట. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడినది.

PC: Sashank.bhogu

పేరుకు పరమశివుడి దేవాలయమే అయినా

పేరుకు పరమశివుడి దేవాలయమే అయినా

పేరుకు పరమశివుడి దేవాలయమే అయినా ఈ గుడిలో మిగిలిన దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఈ బుగ్గు రామలింగేశ్వార ఆలయం పెన్నానది పడమటి తీరంలో ఉంది. ఆ ఆలయానికి శిథిలమైన మూడు ప్రాకార గోపురాలున్నాయి. శిథిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగంలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.

PC: Sashank.bhogu

ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళేటప్పుడు

ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళేటప్పుడు

ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళేటప్పుడు లోపలి కుడిప్రక్కన గోపురంలో బాగంగానే మరో రెండు దేవాలయాలు కోదండ రామ స్వామి ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖ ద్వారంతో ఉంటే, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగి ఉంది. వీరబద్ర స్వామికి మరో చిన్న ఆలయం కూడా ఉంది.

PC:Sashank.bhogu

ఇక్కడ స్థానికంగా దొరకే నల్లరాతితో ఆనాటి శిల్పులు

ఇక్కడ స్థానికంగా దొరకే నల్లరాతితో ఆనాటి శిల్పులు

ఇక్కడ స్థానికంగా దొరకే నల్లరాతితో ఆనాటి శిల్పులు అద్భుతమైన శిల్ప సంపదకు ప్రాణం పోశారు. కొంత ఖుజురహో శైలిని మరికొంత హంపీ శిల్పకళను చూడవచ్చు.

PC: Pranav Sujay

ఈ దేవాలయంనకు మూడు ప్రవేశ ద్వారాలున్నాయి

ఈ దేవాలయంనకు మూడు ప్రవేశ ద్వారాలున్నాయి

ఈ దేవాలయంనకు మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఇక్కడ మండపం నాలుగు స్థంభాలమీద నిర్మించబడి, ప్రతి స్థంభం తిరిగి నాలుగు చిన్న స్థంభాలమీద నిర్మించబడి వున్నది. ఈ నాలుగు స్థంభాను తాకితే సంగీతం వినిపిస్తుందంటారు. పెన్నా నదీతీరంలో వెలసిన ఈ దేవాలయం వెనుకన స్మశానం ఉంది. ఆలయ నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించటం అరిష్టమని పండితులు చెప్పటంతో మాహాద్వారం మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేశారు.

PC: Sashank.bhogu

ఇక్కడ శివుడు స్వయంభువు

ఇక్కడ శివుడు స్వయంభువు

ఇక్కడ శివుడు స్వయంభువు కాబట్టి నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపినా దోషం ఉండదన్నారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్ధంభం, ముఖమండపం, కళ్యాణమండపం, అంతరాళం, గర్భగుడి అనే ప్రధాన విభాగాలున్నాయి. ఇంకా ఇదే ఆవరణలో కుడివైపున వీరభద్ర చండీ ఆలయాలు కళ్యాణమండపం, రామాలయం పార్వతీ దేవి ఆలయాలున్నాయి.

PC:Sashank.bhogu

ముఖమండపంలోని స్ధంభాలను తాకితే సప్తస్వరాలు

ముఖమండపంలోని స్ధంభాలను తాకితే సప్తస్వరాలు

ముఖమండపంలోని స్ధంభాలను తాకితే సప్తస్వరాలు ప్రతిధ్యనిస్తాయంటారు. మండపాలపై రాతిపుష్పాలు, ఆలయ కుడ్యాలపై విజయనగర పాలకుల రాజముద్రిక అయిన వరాహం, సూర్యచంద్రులు, కత్తి కనిపిస్తాయి. కుడ్యాలపై నాట్యకారిణల నృత్యభంగిమలు కనువిందు చేస్తాయి. మరియు శ్రీమహావిష్ణువు దశావతారాలను మనోహరంగా మలచారు శిల్పలు. ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ అష్టమి మొదలు ఫ్గాుణమాసం శుద్ధ తదియ వరకు 11 రోజులపాటు రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

PC: Sashank.bhogu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X