Search
  • Follow NativePlanet
Share
» »చంద్రతాళ్ వెల్దాం ట్రెక్కింగ్ చేద్దాం?

చంద్రతాళ్ వెల్దాం ట్రెక్కింగ్ చేద్దాం?

చంద్రతాళ్ లో ట్రెక్కింగ్‌కు సంబంధించిన కథనం.

హిమాచల్‌ప్రదేశ్ లోని చంద్రతాల్ గురించి మీకు తెలుసా? ఈ చంద్రతాల్ చుట్టూ మంచుపర్వత శిఖరాల మధ్య ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చదనం తొనికిసలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలంటే ఇష్టమున్నవారికి ఈ ప్రాంతం స్వర్గధామం.

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

P.C: You Tube

చంద్రతాల్ వద్దకు చాలా మంది ట్రెక్కింగ్ కోసం వెలుతుంటారు. ఈ ప్రాంతం సముద్రమట్టం నుంచి సుమారు 4,300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే కుంజుమ్ నుంచి వెళ్లాలి.

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

P.C: You Tube

కుంజుమ్ నుంచి చంద్రతాల్ వద్దకు వెళ్లడానికి నిపుణులైన డ్రైవర్ల సాయం తప్పనిసరి. లేదంటే దాదాపు కిలోమీటరు మేర మీరు నడవాల్సి ఉంటుంది. ప్రాత:సమయంలో ఈ ప్రాంతం అత్యంత అందంగా కనిపిస్తుంది.

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

P.C: You Tube

హిమాలయ పర్వత శిఖరాల నీడ మీ పైకి పడుతుంది. ఇక్కడ రాత్రిపూట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అందువల్లే ట్రెక్కింగ్ లో నిపుణులైన వారు మాత్రమే ఇక్కడకు వెళ్లడానికి ఉత్సాహం చూపుతారు.

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

P.C: You Tube

అదేవిధంగా ఫొటోగ్రఫర్లకు ఈ ప్రాంతం అత్యంత ఇష్టమైనది. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇక్కడి అందాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందువల్లే పౌర్ణమి రోజున చంద్రతాల్ పర్యాటకానికి వెళ్లివచ్చినవారు ఆ అనుభవాలను జీవిత పర్యంతం గుర్తుంచుకొంటారు.

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

P.C: You Tube

పున్నమి వెలుగులో చంద్రతాల్ సరస్సు అందాలు రెట్టింపవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ట్రెక్కింగ్ చేస్తూ చంద్రతాల్ అందాలను చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

P.C: You Tube

మే చివరి నుంచి నవంబర్ చివరి వరకూ ఇక్కడకు ట్రెక్కింగ్ కోసం భారతదేశం నలుమూలల నుంచి ఇక్కడకు ట్రెక్కర్స్ వస్తుంటారు. బటాల్ లేదా కున్జుమ్ నుంచి ఈ ట్రెక్కింగ్ మొదలవుతుంది.

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

P.C: You Tube

సరోవరం ఒడ్డున ఉన్న పచ్చటి మైదానంలో టెంట్ వేసుకొని సరస్సు అందాలను చూస్తూ మనం మైమరిచిపోతాం. అదే సమయంలో పక్షుల కుహుకుహురాగాలు కూడా మనసును తాకుతాయని చెప్పడం అతిశయోక్తికాదు.

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

చంద్రతాల్, హిమాచల్‌ప్రదేశ్

P.C: You Tube

కున్జుమ్‌పాస్ నుంచి చంద్రతాల్ చేరుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. చంద్రతాల్ కూడా సూరజ్‌తాల్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఢిల్లీ నుంచి కులు, మనాలి రోహ్‌తంగ్ మార్గం ద్వారా చంద్రతాల్‌ను చేరుకోవచ్చు. లేదా ఢిల్లీ నుంచి సింమ్లా, కనౌజ్, కుంజుమ్ ద్వారా కూడా చంద్రతాల్‌ను చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X