• Follow NativePlanet
Share
» »మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

చంద్రగిరిలో 1640లో కట్టబడిన కోట వుంది.శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో వుండిన మహామంత్రి తిమ్మరసుజన్మస్థలం కూడా చంద్రగిరే.అర్ధచంద్రాకారంగా వున్న కొండపాదభాగంలో కోటను నిర్మించటంవలన దీనిని చంద్రగిరిదుర్గం అని పిలిచేవారు.ఇలా నిర్మించటంవలన కోట రక్షణ కొండప్రాంతంవైపుగా తగ్గగలదని కొండపై నుండి శత్రువులకదలికలని దూరంనుండి గమనించుటకు సులభంకనుక కొండపక్కగా నిర్మించారుఅని మ్యూజియంలోని సమాచారం ద్వారా మనకి అవగతం అవుతుంది.కోట చుట్టూ దాదాపు కిలోమీటర్ ధృఢమైన గోడుంది. ఈ గోడను నిర్మించేందుకు వినియోగించిన ఈ రాళ్ళపరిమాణం చాలా పెద్దది.దీనిని ఏనుగులసహాయంతో నిర్మించారుఅని మనకి తెలుస్తుంది.ఈ గోడ పొదలు,తుప్పలమధ్య ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా వుంది.ఈ గోడను అనుసరిస్తూ బయటవైపుగా పెద్ద కందకం వుంది.ప్రస్తుతం ఊడిపోయినట్టుగా వున్నా కూడా అప్పటికాలంలో ఇందులో ముసళ్ళను పెంచేవారట.

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

విజయనగరరాజుల చరిత్రలో చంద్రగిరి ఒక ప్రముఖస్థానాన్నివహించింది. శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవారట. అచ్యుతదేవరాయలని ఇక్కడే గృహనిర్భంధంలో వుంచారు.

PC:youtube

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

క్రీ.శ.1585లో విజయనగరసామ్రాజ్యం పతనమై విజయనగరరాజ్యాన్ని దక్కన్ ప్రాంతం ముస్లింలరాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసాక విజయనగారసామ్రాట్లు తమ రాజ్యాన్ని కొన్నేళ్ళపాటు పెనుగొండకు మార్చారు.

PC:youtube

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

పెనుగొండతర్వాత ఇంకొన్నేళ్ళకు చంద్రగిరికి మారిపోయింది.చంద్రగిరిని పాలించిన చిట్టచివరి విజయనగరరాజు పెదవెంకటరాయుడు తన సామంతుడు దామెర్ల చెన్నప్పనాయకుడు ఆగస్ట్ 22, 1639లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ట్రాన్సస్ డేకి చెన్నపట్టణంలో కోటని కట్టుకోటానికి అనుమతినిచ్చింది.

PC:youtube

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

ఈ కోటనుండే ఇప్పటికి ఆనాటి దస్తావేజులని మ్యూజియంలో మనం చూడొచ్చు.కొండ పైభాగంలో ఒక సైనిక స్థావరాన్ని నిర్మించారు.వారి అవసరాలనిమిత్తం పై భాగంలో 2చెరువులని నిర్మించి కిందున్న పెద్దచెరువునుండి నీటిని పైకి పంపించేవారని కోటలోని మ్యూజియంలోని సమాచారం ద్వారా తెలుస్తుంది.

PC:youtube

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

ఇప్పటికి కొండపైకి నీటిని ఎలా పంపించారుఅనేది పెద్ద మిస్టరీ.అప్పుడు పైకి పంపించేందుకు వుపయోగించిన సాధనాలు పాడైపోయాయి.అయితే పైనచెరువులో మరియు కింద వున్న చెరువు మంచినీటితో మనకి కనిపిస్తాయి. రాణిమహల్ రెండస్తులుగానూ,రాజుమహల్ 3అంతస్తులుగా వుంది.

PC:youtube

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

రాణిమహల్ అన్నది పేరుకే వుందిఇప్పటికి కూడా దానిని రాణిమహల్ అనే పిలుస్తున్నారు.కాని దీని వాస్తునిబట్టి ఇది ఒక గుర్రపు శాల కావచ్చని అక్కడి బోర్డు నందు స్పష్టంగా రాసుంది. పురావస్తుశాఖ ఆధీనంలోకొచ్చిన తర్వాత కొంత వరకు కోట నీటిఅవసరాల కోసం ఒక దిగుడుబావిని త్రవ్వారుదీనినుండే అంతఃపురఅవసరాలకు నీటిని సరఫరాచేసేవారని తెలియచేస్తున్నారు.

PC:youtube

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

ఈ బావికి కొద్దిదూరంలో మరణశిక్షపడిన ఖైదీని ఉరితీసేందుకు 6స్థంభాలుకలిగి వుపరితలానికి4రింగులున్న చిన్న మంటపం వున్నాయిరాజమహల్ లో మొదటి అంతస్థుని మ్యూజియంగా మార్చారు.ముస్లిం పాలకులు నాశనంచేయగా మిగిలినశిల్పాలు చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు లాంటివి ఇందులో మనం చూడొచ్చు ఇక రెండవఅంతస్థులో సింహాసనాలతోకూడిన అప్పటి దర్బారులేదా సభా దృశ్యాలను చూడొచ్చు.

PC:youtube

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మూడవఅంతస్థులో అప్పటి కోట నమూనా,జీవనవిధానం లాంటివి ప్రదర్శనకు వుంచారు.పై అంతస్థులో రాజప్రముఖుల గదులుకూడా వున్నాయి. చాలా వరకు పాడిన దేవాలయాలు వదిలేసి కొంతభాగున్న రాణిమహల్ ను మరియు రాజమహల్ వీటివెనకనున్నచెరువు మొదలైనవాటిని బాగుచేసి కొంతవరకూ తోట వేసి అన్నిచోట్ల మొక్కల్ని పెంచి సందర్శకులకు ఆహ్లాదంగా వుండేలా మార్చారు.

PC:youtube

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

ఇక రాజమహల్ కు వెనుక మొక్కల్ని పెంచి సందర్శకులకు ఆహ్లాదంగా వుండేలా మార్చారు.ఇక రాజమహల్ కు వెనుక ఖాళీప్రదేశంలో పెద్ద ఓపెన్ ధియేటర్ గా మార్చి దృశ్యకాంతి శబ్ద అంటే సౌండ్ లైటింగ్ షో ప్రదర్శన చేస్తున్నారు.ఈ ప్రదర్శనకు 45రు సామాన్యరుసుముగా వుంది.

PC:youtube

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం తెలుసా?

విభజన జరగకముందు ఆంధ్రరాష్ట్రానికి నారాచంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగావున్న కాలంలో 5కోట్లరూపాయల మొత్తంతో ఈ ప్రాజెక్ట్ ను ఏర్పాటుచేశారు.ఈ ప్రదర్శనద్వారా పెనుగొండ, చంద్రగిరి సంస్థానాలు ఎలా నాశనమైపోయాయో మనకు కళ్ళకుకట్టినట్లుగా కాంతిశబ్దాలతో విసదీకరించబడుటుంది. మనం తెలుగు మరియు ఆంగ్లభాషల్లో చూడొచ్చు.

PC:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి