Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశ ప్రసిద్ద ఆలయాల యాత్ర : చార్‌ ధామ్‌ !

భారతదేశ ప్రసిద్ద ఆలయాల యాత్ర : చార్‌ ధామ్‌ !

By Mohammad

భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక,పూరీ మరియు రామేశ్వరం లను కలిపి చార్‌ ధామ్‌ గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు మరియు ఒక శైవ క్షేత్రము కలదు. కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.

మూలాధారాలు దొరకనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన ఆది శంకరాచార్య ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్‌ధాం హోదాను ఆపాదించాడు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాథ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకాధీశ ఆలయం మరియు దక్షిణాన రామేశ్వరం లో రామనాథస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి.

ఇది కూడా చదవండి : కేదార్నాథ్ - మంచు కొండల్లో అద్భుత రహస్యాలు !

సిద్ధాంతపరంగా ఈ దేవాలయాలు శైవమతానికి మరియు వైష్ణవ శాఖలకు మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంగా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి ఆలయాలను కలిపి ఛోటా చార్‌ధామ్‌ గా వ్యవహరిస్తున్నారు.

ఇది కూడా చదవండి : పవిత్ర యమునోత్రి యాత్ర !

చార్ ధామ్

చార్ ధామ్ యాత్రలో భాగంగా దర్శించే ఆలయాలు

చిత్ర కృప : Vijayakumarblathur/ raghukoppada Follow/Loveless/Rudy Gopal Follow

బద్రీనాథ్ ఆలయం

ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్ పర్వతశ్రేణులలో అలకనంద నది ఒడ్డున ఉన్నది. ఈ పట్టణము నీలకంఠ పర్వత శ్రేణులలోని నర నారాయణ పర్వత సానువుల మధ్యన 6,560 మీటర్ల ఎత్తులో ఉన్నది.బద్రీనాథ్ ఆలయం ఆదిశంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం.

బద్రీనాథ్ ఆలయం

బద్రీనాథ్ ఆలయం

చిత్ర కృప : Vijayakumarblathur

బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో కలిపి 50 అడుగులు. ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. మండపాన్ని దాటి కొంత లోపలభాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భ ఆలయానికి తీసుకు వెళుతుంది. ఆలయంలోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటాయి.

ద్వారకాధీశ ఆలయం

ద్వారకాధీశ ఆలయం

చిత్ర కృప : raghukoppada Follow

ద్వారకాధీశ ఆలయం

ఈ ఆలయం భారతదేశ పశ్చిమాన గుజరాత్ రాష్ట్రంలో స్థాపించబడింది. ఈ నగరం యొక్క నామము ద్వార్ (వాకిలి) అనే సంస్కృత పదము నుండి జనించినది. ఈ నగరం గోమతి నది సమీపంలో, నది సముద్రంలో సంగమించే కచ్ సింధుశాఖ వద్ద స్థాపితమైనది. ఈ గోమతి నది, గంగా నది కి ఉపనది అయిన గోమతి నది, ఒక్కటి కావు.

పూరీ జగన్నాథ ఆలయం

పూరీ జగన్నాథ ఆలయం

చిత్ర కృప : Loveless

పూరీ జగన్నాథ ఆలయం

ఈ నగరము భారతదేశ తూర్పు భాగంలో ఒడిషా రాష్ట్రంలో స్థాపితమైనది. ఈ నగరము భారతదేశ అతి ప్రాచీన తూర్పు నగరాలలో ఒకటి. ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉన్నది. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా మరియు అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు.

రామనాథస్వామి ఆలయం

రామనాథస్వామి ఆలయం

చిత్ర కృప : Rudy Gopal Follow

రామనాథస్వామి ఆలయం

రామేశ్వరము భారతదేశ దక్షిణాన తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది. ఇది భారతదేశ ద్వీపకల్ప చివరి భాగమైన మన్నార్ సింధుశాఖ వద్ద ఉన్నది. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రదేశము నుండే రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది శైవులకు అంకితమైన దేవాలయము. శ్రీరాముడు ఈ ఆలయాన్ని స్థాపించాడని ప్రతీతి.

రామనాథస్వామి ఆలయం లోపలి దృశ్యం

రామనాథస్వామి ఆలయం లోపలి దృశ్యం

చిత్ర కృప : Jagadip Singh Follow

ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటారు. ఈ టెంపుల్ దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలోను ఒకటి. ఈ టెంపుల్స్ లో శివుడిని జ్యోతిర్లింగ రూపంలో ఆరాధిస్తారు. ఇక్కడ శివుడి విగ్రహం పూజించరు. ప్రస్తుత నిర్మాణం సుమారు 12 వ శతాబ్దంలో పాండ్య రాజులచే కట్టించబడినది. ఈ టెంపుల్ శిల్ప శైలి, కళలు అద్భుతం. హిందూ మతం లో దీనికి గల ప్రాధాన్యత కారంణంగా ఈ టెంపుల్ ప్రసిద్ధి చెందినది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X