• Follow NativePlanet
Share
» »మహిళా శాపానికి గురై ఇసుక దిబ్బగా మారిన పుణ్యక్షేత్రం ఇదే...

మహిళా శాపానికి గురై ఇసుక దిబ్బగా మారిన పుణ్యక్షేత్రం ఇదే...

Written By: Staff

పురాణ, చారిత్రక ప్రసిద్ధి చెందిన ఓ క్షేత్రం ప్రస్తుతం ఇసుక దిబ్బగా మారి పోయింది. అక్కడి ఉన్న ఆలయాలన్నీ ఇసుక మేటలతో నిండిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం ఓ మహిళ శాపం. అటు వంటి క్షేత్రం కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఉంది. అనేక మంది రాజవంశీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ప్రత్యేక పౌర్ణిమ రోజు ఇక్కడి పంచలింగ ఆలయాలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రస్తుతం ఇక్కడ భౌగిళిక పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో ద్రాక్ష పంటను స్థానిక రైతులు పండిస్తున్నారు. ముఖ్యంగా వైన్ తయారికి ఉపయోగపడే ద్రాక్ష ప్రస్తుతానికి ఎక్కువగా పండిస్తున్నారు. ఇలా పురాణ హితిహాస, చరిత్ర కాలలతో పాటు ఆధునిక సమాచంలో కూడా తన ఉనికిని చాటుకున్నదే తలకాడు క్షేత్రం. మరిక్కెందుకు ఆలస్యం సదరు తలకాడు గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లోద్దామా

1. శివుడే వైద్యుడిగా మారి...

1. శివుడే వైద్యుడిగా మారి...

Image Source

స్కందపురాణంలో ఈ తలకాడు ప్రస్థావన కనిపిస్తుంది. అందులో ఉన్న వివరాల ప్రకారం....బోయ జాతికి చెందిన తల, కాడు అనే ఇద్దరు సోదరులు వేటాడి జీవనం సాగించేవారు. ఈ క్రమంలో ఒక రోజు ప్రస్తుతం తలకాడు ఉన్న ప్రాంతానికి వచ్చారు. ఇద్దరు ఓ జంతువును చంపడానికి బాణాలను వదిలారు. ఆ రెండు బానాలు ఓ లింగానికి తగిలాయి. వెంటనే లింగం నుంచి రక్తం వచ్చింది. దీన్ని చూసి చలించిపోయిన ఇద్దరు సోదరులు శివుడి గురించి మనసా, వాచా, కర్మేణ ప్రార్థన చేయడం ప్రారంభించారు. దీంతో శివుడు వారి ప్రార్థనకు మెచ్చి ఓ సాధువు రూపంలో అక్కడకు వచ్చాడు. దగ్గర్లోని చెట్టు బెరడు, ఆకులతో చూర్ణం చేసి రక్తం వచ్చే చోట మందుగా పూసాడు. వెంటనే రక్తం కారడం ఆగిపోయింది. తర్వాత ఆ సాధువు మాయమౌతాడు.

2. ఇద్దరు సోదరుల పేరు పైనే

2. ఇద్దరు సోదరుల పేరు పైనే

Image Source

అటు పై ఆకాశవాణి ద్వార వచ్చిన సూచనలను అనుసరించి ఆ లింగానికి ఇరువురు సోదరులు దేవాలయం కట్టించారు. సాధువు రూపంలో వచ్చిన వాడే శివుడిగా తెలుసుకొని దేవాలయానికి వైద్యనాధేశ్వరాలయంగా పేరుపెడుతారు. కాల క్రమంలో ఈ ప్రాంతం ఇరువురు బోయ సోదరుల పేరు పైనే తలకాడుగా రూపాంతరం చెంది ప్రముఖ పుణ్యక్షేతంగా వెలుగొందుతోంది.

3. అనేక రాజులు పాలించిన ప్రాంతం...

3. అనేక రాజులు పాలించిన ప్రాంతం...

Image Source

తలకాడును గంగ వంశీయుల నుంచి మైసూరు ఒడయార్ల వరకూ అనేక రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెబుతోంది. భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఆయా రాజ్యాలకు సంబంధించిన ముఖ్యమైన సమావేశాలు ఇక్కడే జరిపేవారని ప్రతీతి. అంతేకాకుండా సదరు రాజులు తమకు తోచిన విధంగా ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలు నిర్మించారు. ఈ దేవాలయాలన్నీ భారతీయ శిల్పకళకు అద్ధం పడుతాయి. చరిత్ర, ప్రస్తుత అందుబాటులో ఉన్న శాసనాలను అనుసరించి తలకాడులో 30 దేవాలయాలు ఉండాలి. అయితే చాలా దేవాలయాలు ఇసుక మేటలతో కప్పబడి పోయాయి. దీంతో ప్రస్తుతానికి వైద్యనాథేశ్వరాలయంతో సహా ఆరు నుంచి ఏడు దేవాలయాలు మాత్రమే పర్యటకులు చూడటానికి వీలవుతుంది.

4. తలకాడు ఇసుక దిబ్బగా మారిపోని...

4. తలకాడు ఇసుక దిబ్బగా మారిపోని...

Image Source

తలకాడుకు దగ్గర్లోని శ్రీరంగ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని శ్రీరంగ రాయ అనే రాజు పాలన సాగించేవాడు. పరాక్రమవంతుడు, ప్రజారంజకంగా పాలన సాగించే రంగరాయకు జబ్బు చేసింది. రాజ వైద్యుల చూచనమేరకు రాజ్యభారాన్ని తన రెండో భార్య అయిన అలమేలమ్మకు అప్పగించి వైద్యనాధేశ్వరుడిని కొలవడానికి తలకాడు వెళ్లాడు. ఈ విషయాన్ని గుర్తించిన పొరుగున ఉన్న మైసూరు రాజు చామరాజ ఒడయారు క్రీస్తు శకం 1610లో శ్రీరంగ పట్టణం పై దాడి చేసి రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. శత్రు రాజుకు దొరకకుండా భర్త వద్దకు వెలుతున్న అలమేలమ్మను చామరాజ ఒడయార్ ఆదేశాల మేరకు సైనికులు వెంటాడి ఆమె ఒంటి పై ఉన్న నగలను తీసుకోవడానికే కాక ఆమెను బలత్కరించడానికి ప్రయత్నిస్తారు. విషయం పసిగట్టిన అలమేలమ్మ కావేరి నదిలోకి తన ఆభరణాలను జాడవిడిచి మూడు శాపాలను పెడుతుంది. అందులో మొదటిది ఒడయారుల పాలనలోని తలకాడు ఇసుక దిబ్బలుగా మారుతుంది. అదే విధంగా అప్పటి పట్టణమైన మాలంగి సర్వనాశనం అయిపోని, ఇక మూడోది మైసూరు వంశానికి వారసుడు లేకుండా పోని అని శాపం పెడుతుంది.

6. సర్వరోగ నివారిణి....

6. సర్వరోగ నివారిణి....

Image Source

తలకాడులో ఉన్న వైధ్యనాథేశ్వరాలయంలో పూజలు చేస్తే దీర్ఘకాలిక రోగాలు తొలుగుతాయని స్థానికులు చెబుతుంటారు. ఈ దేవాలయంతో పాటు పాతాలేశ్వర, మరులేశ్వర, ఆర్కేశ్వర, మల్లికార్జునేశ్వర దేవాలయాలు ప్రఖ్యతి గాంచినవి. ఈ ఐదు లింగాలు శివుని ఐదు ముఖాలుగా భావించి పంచపతిగా పేర్కొంటారు. తలకాడుకు వెలితే ఈ దేవాలయాలను చూడవచ్చు.

6. సర్వరోగ నివారిణి....

6. సర్వరోగ నివారిణి....

Image Source

తలకాడులో ఉన్న వైధ్యనాథేశ్వరాలయంలో పూజలు చేస్తే దీర్ఘకాలిక రోగాలు తొలుగుతాయని స్థానికులు చెబుతుంటారు. ఈ దేవాలయంతో పాటు పాతాలేశ్వర, మరులేశ్వర, ఆర్కేశ్వర, మల్లికార్జునేశ్వర దేవాలయాలు ప్రఖ్యతి గాంచినవి. ఈ ఐదు లింగాలు శివుని ఐదు ముఖాలుగా భావించి పంచపతిగా పేర్కొంటారు. తలకాడుకు వెలితే ఈ దేవాలయాలను చూడవచ్చు.

7. 12 ఏళ్లకు ఒకమారు...

7. 12 ఏళ్లకు ఒకమారు...

Image Source

ఇక పన్నేండేళ్లకు ఒకసారి యోగ, వైశాఖ నక్షత్రాలు ఒకే రేఖ పై రావడం అదే రోజు పౌర్ణిమ కావడం సంభవిస్తుంది. ఈ రోజును శివుడికి ప్రీతి పాత్రంగా పేర్కొంటూ తలకాడులో ఈ ఐదు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆ రోజున ఆయా దేవాలయాల ముందు ఉండే కొలనుల్లో స్నానం చేసి ఆయా దేవుళ్లను సందర్శించుకుని పూజలు చేస్తారు. కార్తిక మాసం, శివరాత్రి సమయాల్లో ఎక్కువ మంది ఈ ప్రాంతాన్ని సందర్శించి మొక్కులు తీర్చు కుంటారు. రామానుజ చార్యులు స్థాపించిన పంచ నారాయణ క్షేత్రాల్లో ఒకటైన క్తీర్తి నారాయణ దేవాలయం కూడా ఇక్కడే ఉంది.

8. ఆదునికతను ఒడిసిపట్టుకుంటూ...

8. ఆదునికతను ఒడిసిపట్టుకుంటూ...

Image Source

ఇసుక మేటలు ఉన్నా స్థానిక రైతులు ఆధునిక పద్దతుల్లో ఉద్యాన పంటల సాగును చేస్తున్నారు. ముఖ్యంగా వైన్ తయారీకి ఉపయోగపడే ద్రాక్ష సాగు ఇక్కడ ఎక్కువగా సాగుతోంది. అంతేకాకుండా పశుపోషనలో కూడా రైతులు ఆధునికతను ఒడిసిపట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చీజ్ తయారు చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

9. ఎలావెళ్లాలి...

9. ఎలావెళ్లాలి...

Image Source: Map

మైసూరుకు 28 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు 133 కిలోమీటర్ల దూరంలో తలకాడు ఉంది. వివిధ ప్రాంతల నుంచి మైసూరుకు చేరుకుంటే అక్కడి నుంచి తలకాడుకు ప్రభుత్వ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. తలకాడును చూసుకుని మరలా మైసూరుకు చేరుకోవాల్సి ఉంటుంది. తలకాడులోనే రాత్రి బస చేయడానికి సదుపాయాలు కొంత తక్కువగా ఉన్నాయి.

10. తలకాడుతో పాటు ఏ ఏ ప్రాంతాలను చూడవచ్చు...

10. తలకాడుతో పాటు ఏ ఏ ప్రాంతాలను చూడవచ్చు...

Image Source

తలకాడుతో పాటు మైసూరులోని ప్యాలెస్, సెయింట్ ఫినోమినా చర్చ్, చాముండి టెంపుల్ తదితరాలను చూడవచ్చు. అటు పై మైసూరుకు దగ్గరగా ఉన్న శ్రీరంగ పట్టణం, శివసముద్రం ఫాల్స్, నాగర్ హోల్ నేషనల్ పార్క్, సోమనాథ్ పూర్ తదితరాలను చూడవచ్చు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి