» »భారత్ లో ప్రమాదకరమైన ప్రదేశాలు మీకు తెలుసా ?

భారత్ లో ప్రమాదకరమైన ప్రదేశాలు మీకు తెలుసా ?

By: Venkata Karunasri Nalluru

భారతదేశం భిన్న సంస్కృతులు, భిన్న అనుభవాల కలబోత. ఈ భిన్నత్వమే దైనందిన జీవిత కాలంలో మనం ఏమ చేయాలో? ఏం చేయకూడదో? నేర్పుతుంది. మన దేశంపై ప్రపంచ దేశాలన్నీ ఆశక్తి చూపుతున్న ప్రస్తుత తరుణంలో మనం ఎటువంటివారమన్న విషయాన్ని మన పరిసరాలు ప్రతిబింబిస్తుంటాయి.ఇందులో కొన్ని మానవ కల్పితమైనవి కాగా మరికొన్ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి.

అయితే ఇవన్నీ మనకు ఆశక్తిని పెంపొందిస్తాయన్న హామీ ఎక్కడా కనపడదు. ప్రస్తుతం మీకు మన దేశంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల వివరాలనందిస్తున్నాం.పరిశీలించండి

మంత్రముగ్ధులను చేసే బ్రహ్మగిరి కొండలు !

భారత్ లో ప్రమాదకర ప్రదేశాలు

1. పుగ్తల్ ఆశ్రమం

1. పుగ్తల్ ఆశ్రమం

ఈ ఆశ్రమాన్ని పుగ్తల్ గుంప అని కూడా పిలుస్తారు.కొండ శిఖరంపై తేనెపట్టు తరహాలో నిర్మితమైన ఈ ఆశ్రమం లడఖ్ ప్రాంతంలో వుంది.అత్యంత ఎత్తైన ఈ ప్రదేశానికి చేరుకునే మార్గాలు చాలా పరిమితంగానే వుంటాయి.ఈ ప్రదేశం స్థానికులకు సర్వసాధారణమే అయినప్పటికీ ఇతరులకు మాత్రం ఇక్కడకు చేరుకోవటం కష్టసాధ్యమేనని చెప్పొచ్చు.

PC:youtube

2. బస్తర్

2. బస్తర్

ఇది నక్సల్స్ కు ఆనవాలమనమాట.చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఈ జిల్లా అటవీప్రాంతంతో, నదులతో కూడిన అత్యంత సుందరమైన ప్రదేశం.అత్యంత విస్తృతమైన, నిర్మానుష్యమైన ఈ అటవీప్రాంతం గిరిల్లా కార్యకలాపాలకు అత్యంత అనువైనది కావటంతో నక్సల్ ఉద్యమానికి ఇది ఆనవాలమైనదని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న పలు దాడులు, ఎదుర్కాల్పులు వంటి వాటితో ఈ ప్రాంతం ఇప్పుడు శవాల గుట్టగా మారుతోంది.

PC:youtube

3. ద్రాస్

3. ద్రాస్

ప్రపంచంలోనే రెండో అత్యంత చల్లనైన ప్రదేశం. జమ్మూకాశ్మీర్ లో వున్న ఈ పట్టణాన్ని "లడక్ ముఖద్వారం లేదా గేట్ వే ఆఫ్ లడక్" అని పిలుస్తుంటారు.ఈ ప్రాంతాలపై కార్గిల్ యుద్ధ సమయంలో అనేక దాడులు జరిగాయి. అంతేకాదు అత్యంత తీవ్రస్థాయి ఉగ్రవాడానికి కూడా ఈ పట్టణం నెలవుగా మారింది.అయితే ప్రపంచంలోనే అత్యంత చల్లని నివాస ప్రదేశాలలో ఇది రెండో స్థానంలో నిలవటం విశేషం. ఇక్కడకు వెళ్లి మిలిటెంట్ల తుపాకులకు గురికాకుండా ప్రాణాలతో వెనక్కి తిరిగి రావటం అదృష్టమేనని చెప్పవచ్చును.

PC:youtube

4. థార్ ఎడారి

4. థార్ ఎడారి

థార్ ఎడారి అనగానే మీకంతా గుర్తొచ్చే వుంటుంది.రాజస్థాన్ లో వుంది.ఇసుక తిన్నెలతో మాటలకందని సౌందర్యంతో అలరారే ఈ ఎడారి ప్రాంతంలో అంతే స్థాయిలో ప్రమాదం కూడా దాగి వుంది. మీరు ముందు జాగ్రత్తగా తగినంత ఆహారం, నీరు వెంట తీసుకువెళ్ళినా ఈ ప్రాంతంలో ప్రయాణించటం కష్టసాధ్యమేనని చెప్పక తప్పదు.ఈ ప్రాంతంలో అనేక విషసర్పాలు, క్రూరమృగాలు ఇతర జంతువులు పొంచివుండటమే ఇందుకు కారణం.

PC:youtube

5. ఖర్ దుంగ్లా

5. ఖర్ దుంగ్లా

ప్రపంచంలో అత్యంత ఎత్తైన రోడ్డు మార్గం ఇది. లడఖ్ నుంచి లెహ్ కు వెళ్ళే ఈ రోడ్డు మార్గం సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో వుండటంతో పాటు సూర్యరశ్మి నేరుగా పడుతుంది.ఈ మార్గంలో ప్రాణవాయివు స్వల్ప ప్రమాణంలో లభిస్తుండటంతో ఇక్కడ కొన్ని సందర్భాలలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కూడా వుంది.

PC:youtube

6. అస్సాంలో వున్న లుండింగ్ హాఫ్ లాంగ్ రైలు మార్గం

6. అస్సాంలో వున్న లుండింగ్ హాఫ్ లాంగ్ రైలు మార్గం

అస్సాంలో వున్న లుండింగ్ హాఫ్ లాంగ్ రైలు మార్గం ఎంత ప్రకృతి సౌందర్యంతో నిండి వుంటుందో అంతే భయంకరప్రదేశం కూడా.ప్రకృతి సిద్ధమైన ఈ అటవీప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణంతో మనకు కనువిందు చేస్తుంది.

PC:youtube

7.ఉగ్రవాద సంస్థ

7.ఉగ్రవాద సంస్థ

అయితే అదే సమయంలో ఇక్కడి బ్లాక్ విడో ఉగ్రవాద సంస్థ పాల్పడే కిరాతక చర్యలు చాలా భయంకరంగా అత్యంత భయానకంగా వుంటాయి. ఈ ప్రాంతంలో పని చేసే రైల్వే ఉద్యోగులు, ఇంజనీర్లను కిడ్నాప్ చేస్తూ కొన్ని సందర్భాలలో వారి ప్రాణాలను కూడా తీస్తుంటారు ఈ ఉగ్రవాదులు.

PC:youtube

Please Wait while comments are loading...