Search
  • Follow NativePlanet
Share
» »వివాహభాగ్యం కలుగచేసే ఆలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

వివాహభాగ్యం కలుగచేసే ఆలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

శ్రీ కళ్యాణసుందరేశ్వర ఆలయం, తిరుమనంచేరి తమిళనాడు రాష్ట్రంలోని తంజాపూరు జిల్లాలో కుట్టాలమ్ రైల్వేస్టేషన్ కి సుమారు 6 కి.మీ దూరంలో కలదు.

By Venkata Karunasri Nalluru

శ్రీ కళ్యాణసుందరేశ్వర ఆలయం, తిరుమనంచేరి తమిళనాడు రాష్ట్రంలోని తంజాపూరు జిల్లాలో కుట్టాలమ్ రైల్వేస్టేషన్ కి సుమారు 6 కి.మీ దూరంలో కలదు. వివాహం కుదరటం ఆలస్యమైతే అలాగే వివాహదోషాలున్నా గానీ అనగా కళత్ర దోషాలు, మరియు శనిదోషాలు, కుజదోషాలు ఈ విధంగా నవగ్రహదోషాలు ఎటువంటి దోషాలున్నా ఆ దోషాలు తొలగించి వారికి వివాహం తొందరగా అయ్యేటట్లు అలాగే మంచి కుటుంబం నుండి మంచి అమ్మాయి అలాగే మంచి అబ్బాయి భార్య లేదా భర్తగా లభించేటట్లుగా చెప్పబడుతున్న ఆలయం ఈ తిరుమనంచేరి ఆలయం.

తిరుమనంచేరికి సమీపాన ఉన్న ఒక ముఖ్య శివ దేవాలయం శ్రీ కళ్యాణ సుందరేశ్వరార్ స్వామి టెంపుల్ . పార్వతీ దేవి ఇక్కడ శివుని వివాహమాడటానికి పునర్జన్మించినదని పురాణం . 3.5 ఎకరాల'విస్తీరణం లో ఉన్నది ఈ దేవాలయ సముదాయం. ఉదయం 6 నుండి 12 గంటల వరకు, 3 నుండి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ పూజా సమయాలు . వివాహం కొరకు ప్రయత్నించే వారికి ఈ దేవాలయం మరొక ముఖ్య ప్రదేశం. నటరాజ స్వామి వారి దేవాలయం , దక్షిణామూర్తి , బ్రహ్మ , లింగోద్బవార్ మరియు దుర్గ దేవి గుడులు కూడా ఇక్కడ ఉన్నాయి. వరదరజర్ కోవెలలో భూదేవి మరియు శ్రీదేవిలతో పుజిస్తారు. పండుగల సమయం లో ఈ దేవాలయం సందర్శించటం చాల ఉత్తమం సమయం. కర్తిగై దీపం , నవరాత్రి , ఆరుద్ర దర్శనం మరియు తిరుక్కాయనమ్ ఇక్కడి ముఖ్య పండుగల లో కొన్ని.

తిరుమనంచేరికి దగ్గర గల సిటీలు కుంభకోణం, చిదంబరం. ఈ వూరికి తిరుమనంచేరి అనే పేరు ఎలా వచ్చిందంటే తిరుమన అనగా వివాహం,చేరి అనగా గ్రామం.అంటే వివాహం జరిగిన స్థలం. అనగా శివపార్వతులకు కల్యాణం జరిగిన స్థలంగా చెప్పబడుతున్న వూరు.

ఇది కూడా చదవండి: దెయ్యాలు కట్టిన శివాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

వివాహభాగ్యం కలుగచేసే ఆలయం

1.ఆలయ చరిత్ర

1.ఆలయ చరిత్ర

ఇక ఈ ఆలయ చరిత్రలోనికి వస్తే పురాణగాథ ప్రకారం పార్వతీదేవి ఒకానొక సమయంలో అంటే మనవులలాగా భూమిపైన పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. అలాగే ఆమె అనుకోకుండా శాపానికి గురి అవుతుంది.

PC: Ravindraboopathi

2.తిరుమనంచేరి

2.తిరుమనంచేరి

తర్వాత ఆమె తిరుమనంచేరిలోనే మరలా జన్మించటం తిరిగి పార్వతీ దేవి శివుడ్ని ఇదే స్థలంలో పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పబడుతున్నది.

pc:youtube

3. శ్రీ కల్యాణసుందరేశ్వరుడు

3. శ్రీ కల్యాణసుందరేశ్వరుడు

ఈ ఆలయంలోనే పార్వతీదేవి కోకిలాంబగా, శివుడు శ్రీ కల్యాణసుందరేశ్వరుడుగా, ఇక్కడ ప్రసిద్ధి గాంచివున్నారు. ఈ ఆలయంలో ఎన్నో ఆధారాలున్నాయి. ఈ ఆలయంకొచ్చిన వారికి త్వరగా పెళ్ళిళ్ళయినాయని, అలాగే 3నుంచి 6నెలల మధ్యలోనే పెళ్లిసంబంధాలు కాయమైనాయని, మంచి ఇంటి నుంచి సంబంధం వచ్చిందని చెప్పబడుతున్నది. అలాగే పెళ్లి కావలసిన అబ్బాయి లేక అమ్మాయి, కుదరని పక్షంలో తల్లితండ్రులు కూడా వెళ్లి పిల్లల తరఫున ఇక్కడ ప్రార్థించవచ్చును.

pc:youtube

4. వివాహం కావలసిన అబ్బాయి లేక అమ్మాయి ఈ ఆలయంలో ఆచరించవలసినది

4. వివాహం కావలసిన అబ్బాయి లేక అమ్మాయి ఈ ఆలయంలో ఆచరించవలసినది

మొదట ఇక్కడ సెల్వగణపతి అనగా మనం ఎక్కడైనా విఘ్నాలు లేకుండా గణపతిని ప్రార్థిస్తాం కాబట్టి ఇక్కడ కూడా మొదటగా గణపతిని దర్శించి ఎటువంటి విఘ్నాలు లేకుండా మా పెళ్లి జరగాలని చెప్పి మొదటగా స్వామి వారిని దర్శించాలి. తర్వాత అలాగే శివుడ్ని పార్వతీదేవిని దర్శించాలి. చిన్న కోకిలాంబ రూపంలో అనగా చిన్నబాలిక రూపంలో వున్న మాదిరిగా మీనాక్షమ్మ వారు ఇక్కడ దర్శనమిస్తారు మనకు.

pc:youtube

5.తిరుమనంచేరి ఆలయం చేరినతర్వాత ముఖ్యంగా చేయవలసిన పని

5.తిరుమనంచేరి ఆలయం చేరినతర్వాత ముఖ్యంగా చేయవలసిన పని

మంటపానికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా తమిళనాడులో వ్యతిరేక శక్తులను పోగొట్టుకొనుటకు ముందుగా దీపదర్శనం. అనగా దీపాన్ని ఇక్కడ వెలిగించవలసి వుంటుంది. ఇక్కడ వివాహం కోసం దీపం వెలిగించవలసి వుంటుంది.

ఇది కూడా చదవండి:బాహుబలి సినిమాలోని మాహిష్మతి రాజ్యం ఎక్కడుందో మీకు తెలుసా?

pc:youtube

6. పూజసామానులు

6. పూజసామానులు

అలాగే దీపం వెలిగించిన తర్వాత క్యూ కాంప్లెక్స్ లో కూర్చుని పంతులుగారికి టిక్కెట్ ఇవ్వవలసి వుంటుంది. ఇక్కడ పూజసామానులు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ గుడి బయట కన్నా తక్కువ ధరలకే లభిస్తాయి. పూజాసామాగ్రిలో రెండు పూల దండలు ఖచ్చితంగా వుండాలి. ఒక దండను శివపార్వతుల పాదాల చెంత వుంచటం లేదా అలంకరించటం జరుగుతుంది. రెండవ మాలను తిరిగి మనకు ఇవ్వటం జరుగుతుంది.

pc:youtube

7. సాంప్రదాయదుస్తులు

7. సాంప్రదాయదుస్తులు

ఈ ఆలయంలో మోడ్రన్ దుస్తులు అనుమతించటం జరగదు. సాంప్రదాయదుస్తులలోనే వెళ్ళాలి. వివాహం కొరకు దోష నివారణ పూజ చేయటం జరుగుతుంది.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X