» »బేతాళుడి ఆలయ రహస్యం గురించి మీకు తెలుసా ?

బేతాళుడి ఆలయ రహస్యం గురించి మీకు తెలుసా ?

Written By: Venkatakarunasri

ఆరావళి గ్రామం యాత్రికులను ఎటువంటి వింతైనది కాదు. జాగృత్ దేవస్థానానికి చెందిన శ్రీ విఠోబా ఆలయం మరియు శతేరి దేవి మందిరం ప్రసిద్ధి చెందినవి , భక్తుల యొక్క కోర్కెలు తీర్చే కొంగుబంగారాల్లా ఇక్కడి దేవతలు వెలుగొందుతారు. భగవాన్ విఠోబా కు ఆరటి పళ్ళు సమర్పించడానికి జనసమూహామంత సన్నని మార్గాలలో పయనించేవారు. ఇది సింధుదుర్గ్ నకు సమీపంలో ఉంది. భగవాన్ విఠోబా అత్యంత ప్రీతికరమైన కానుకగా కొల్హాపురి చెప్పులు సమర్పించడం ఇక్కడి విశేషం.

మీరు చూడని మదురై ... పురాతన చిత్రాలలో !

బేతాళుడు దెయ్యం కదా.అతనికి ఆలయం ఎందుకుంది. వుంటే ఆ ఆలయం ఎక్కడున్నది. ఆ ఆలయ రహస్యాలు, వింతలు, విశేషాలు ఏమిటి? తంత్రశాస్త్రంలో బేతాళుడికి ప్రత్యేక స్థానం వుంది. బేతాళుడు అనగా రాత్రిళ్ళు కాపలా కాసేవాడు. లేదా రాత్రిళ్ళు తిరిగేవాడు అని అర్థం.ఇతడు అందరూ అనుకునేటట్టు పిశాచి కాదు.

గోవా వెళితే చేయకూడని 10 అంశాలు !

నిజానికి బేతాళుడు ఒక రాజు. ఇతను శివుని వద్ద వుండే రుద్రగణాలలో ఒక వర్గమైన పిశాచగణానికి అధిపతి. ఈ పిశాచవర్గాన్నే బెతాళులు అని పిలుస్తారు. వీరు దేవతల సైన్యంగా పిలవబడే నాగ, గరుడ, గాంధర్వ జాతులలో ఒక జాతి వారు. వీరు దేవతలకు సహాయకారులుగా, దేవతల వద్ద పనిచేసే వారిగా ఉన్నప్పటికీ దేవతల వాలే పూజింపబడుతూవుంటారు.అందుకు గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బేతాళుడి ఆలయ వింతలు, విశేషాలు

1. కర్పసామి

1. కర్పసామి

బేతాళులలో మగవారు మాత్రమే వుంటారు. ఆడవారు వుండరు. చాలా ప్రాంతాలలో చాలా పేర్లతో పిలుస్తూవుంటారు. ఇతడు గ్రామదేవతల యొక్క సోదరుడైన పోతురాజుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో పూజింపబడుతుంటే కర్పసామిగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో పూజింపబడుతూ మహారాష్ట్రలో ఆలయాలలో పూజింపబడుతూవున్నాడు.

ఇది కూడా చదవండి: సిద్ది వినాయకుడు ఆలయం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు !

pc:official site

2. బేతాళుడిని ఎందుకు పూజించాలో తెలుసుకుందాం.

2. బేతాళుడిని ఎందుకు పూజించాలో తెలుసుకుందాం.

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మన స్వార్థపూరిత ఆలోచనలు, ఎదుటివారికి అన్యాయం చేయాలనుకోవటం, ఎదుటివారిపై అసూయపడటం, తప్పులు చేయటం వల్ల మనలో నెగటివ్ ఎనర్జీ ఏర్పడి దీర్ఘకాలిక అనారోగ్యసమస్యలు ఏర్పడి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బేతాళుడు పిశాచి గణాలకు అధ్యక్షుడు.

సాయిబాబా ఎక్కడ పుట్టారో తెలుసా ?

pc:official site

3. సన్మార్గం

3. సన్మార్గం

ఇతడు మనలోని చెడుని పారద్రోలి మనకు వున్న అసూయ, కోపం వంటి దుర్గణాలను నాశనం చేసి మనకు మంచి బుద్ధి తెలివితేటలు, ఆరోగ్యం ప్రసాదిస్తాడు. మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. అంతేగాక మన మీద అసూయ పడుతున్నవారిని శిక్షించి భూతప్రేత పిశాచ బాధలను, అనారోగ్యసమస్యలను సైతం మటుమాయం చేస్తుంటాడు.

pc:official site

4. బేతాళుడు

4. బేతాళుడు

మనకు తెలీకుండానే మనం బేతాళుడిని పరోక్షంగా పూజిస్తున్నాం. దానికి ఉదాహరణ ఎవరన్నా కొత్త ఇల్లు కట్టుకుంటున్నా దృష్టిదోషం తగలకుండా వుండటానికి బేతాళుని ముఖాన్ని ద్రిష్టిబొమ్మ రూపంలో తగిలిస్తూవుంటాం.

షిర్డీకి భక్తుల యాత్ర - శ్రీ సాయిబాబా నివాసం

pc:official site

5. భైరవ సాధన

5. భైరవ సాధన

అంటే మనకు తెలీకుండానే మనం బేతాళుడిని ఇప్పటివరకు పూజిస్తూవచ్చాం. కొంతమంది వారి జాతకంలోని దోషాలు, భవిష్యత్ తెలుసుకొనుటకు భైరవ సాధన చేసే జ్యోతిష్యులను ఆశ్రయిస్తూవుంటారు.

pc:official site

6. బేతాళ ప్రశ్న

6. బేతాళ ప్రశ్న

భైరవ సాధన చేసే జ్యోతిష్యులు బేతాళ ప్రశ్న అనే పద్ధతిలో ప్రశ్న అడగటానికి వచ్చిన వారిని ఏమీ అడక్కుండానే వారు ఎక్కడి నుండి వచ్చింది?ఏ వూరు నుంచి వచ్చింది?ఎందుకోసం వచ్చింది? వంటి వివరాలను వారికి తెలియచేస్తారు.

pc:official site

7. కర్ణపిశాచి

7. కర్ణపిశాచి

అయితే ఈ జ్యోతిష్యులు ఒక పిశాచిని అదుపులో వుంచుకుని ఎవరైతే వారి భవిష్యత్ ను తెలుసుకొనటానికి వచ్చారో వారి యొక్క విషయాలను ఈ పిశాచి ద్వారా సేకరిస్తారు.పిశాచి తను గ్రహించిన విషయాలను ఆ యొక్క జ్యోతిష్యుని చెవిలో చెపుతుంది. అందుకనే ఆ పిశాచిని కర్ణపిశాచి అంటారు.

pc:official site

8.తాంత్రికులు

8.తాంత్రికులు

ఇలా బేతాళ సాధన ద్వారా కొంతమంది మానవులకున్న ఇబ్బందులకు మార్గాలను తెలియచేస్తూ ఉపయోగపడుతున్నారు. కాశి వంటి క్షేత్రాలలో కొంతమంది తాంత్రికులు శవాబేతాళం లేదా శవసాధన వంటి ప్రక్రియ ద్వారా గతాన్ని భవిష్యత్ ని తెలుసుకుంటూవుంటారు.

pc:official site

9. హరవల్లి

9. హరవల్లి

17 వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ బేతాళ ఆలయం మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలోని సింధుదుర్గ జిల్లా,వెంగుర్ల తాలూకా, ఆరావళి అనే గ్రామంలో కలదు.పూర్వం ఈ గ్రామాన్ని హరవల్లి అని పిలిచేవారు. సంస్క్రుతంలో హర అంటే శివుడు,వల్లి అనగా గ్రామం. అంటే శివుడు కొలువైన గ్రామం.

pc:official site

10. కాపలా

10. కాపలా

శివుడు వున్నచోట రుద్రగణాలు లేకండా వుంటాయా? అందువల్ల వాటిలో ఒక గణమైన పిశాచి గణానికి అధ్యక్ష్యుడైన బేతాళుడు ఈ గ్రామానికి కాపలాగా వుండి ఇప్పటికి సైతం ప్రతిరోజూ రాత్రి వచ్చి ఈ గ్రామానికి కాపలా కాస్తూ వుంటాడు.

pc:official site

11. వెతోబా

11. వెతోబా

బేతాళ స్వామి ఈ ఆలయంలో బేతాళ్ గా మరియు వెతోబా నామధ్యేయంతో సుందరమైన నిలువెత్తు తొమ్మిది అంగుళాల పంచలోహాలతో చేయబడిన విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు.

pc:official site

12. చక్కని జీవితం

12. చక్కని జీవితం

స్వామి కుడి చేతిలో కత్తితో ఎడమ చేతిలో అగ్ని పాత్రతో వుంటాడు. ప్రపంచం నలుమూలల నుంచి పరిష్కారం కాని భూతప్రేత పిశాచ బాధలు, శత్రుబాధాలు తొలగి చక్కని జీవితం పొందటానికి ఈ స్వామిని ఎంతో మంది ఆశ్రయిస్తూ వుంటాడు.

pc:official site

13. అరటి పండ్లు

13. అరటి పండ్లు

ఈ స్వామికి అరటి పండ్లు అంటే చాలా ప్రీతి. అందుకనే అరటి గెలలు, అరటి పండ్లు,ఇక్కడ నివేదించుతారు.

pc:official site

14. స్వామి వారి ఆలయ రహస్యం

14. స్వామి వారి ఆలయ రహస్యం

ఇక్కడి కొచ్చిన భక్తులు తమ కోర్కెలు తీరిన పిదప కొల్హాపూర్ తరహాలో వుండే క్రొత్త చెప్పులను స్వామివారికి ఇస్తారు. మర్లాతిరిగి ఆలయ దర్శనం చేసుకునేటప్పుడు చూస్తే వారు ఇచ్చిన చెప్పులు బేతాళస్వామి చేత వాడబడి పాత చెప్పుల రూపంలో ఇక్కడి ఆలయంలో దర్శనమివ్వడం ఇక్కడ విశేషం.

pc:official site

కాపలా

కాపలా

15. స్వామివారు ఇప్పటికీ ఈ గ్రామంలో కాపలా కాస్తూ వుంటారని భక్తులు చెప్తూ వుంటారు.

pc:official site