• Follow NativePlanet
Share
» »అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

భారతదేశ చారిత్రకగాధలలో మహాభారతానికి ఒక ప్రత్యేకస్థానం వుందనే చెప్పాలి. ధర్మానికి,అధర్మానికి మధ్యజరిగిన సంగ్రామంగా కురుక్షేత్రయుద్ధం చెప్పబడుతుంది. మహాభారతయుద్ధంలోని ప్రతీపాత్ర ఎంతో వైవిధ్యాన్ని కనబరచి అందులో ధర్మానికి కట్టుబడినవారు ఇప్పటికీ మహానుభావులుగా కొలువబడుతున్నారు. ఈ మహాభారతంలో ధర్మబద్ధంగా పాండవులను చూపగా,అధర్మచక్రవర్తిగా దుర్యోధనుణ్ణి,కౌరవ సోదరుల్ని చూపారు. ధర్మబద్ధంగా జీవితాన్ని సాగించారుకాబట్టే పాండవులు కురుక్షేత్రయుద్ధంలో కౌరవులను హతమార్చి పాండవసామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు. అందువల్లనే పాండవులను ఆదర్శవంతులుగా,మహానుభావులుగా కీర్తిస్తున్నారు గాని వారికి ఎక్కడా ఎటువంటి ఆలయం నిర్మించలేదు.

అయితే ఈ కురుక్షేత్రయుద్ధానికి మూలకారకుడు కౌరవసామ్రాజ్య అధిపతి అధర్మానికి ప్రతి రూపంగా చెప్పబడిన దుర్యోధనునికి ఆలయాలున్నాయంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం.ఈ ఆలయాలు ఒక చోటో, రెండు చోట్లో కాకుండా ఉత్తరభారతదేశం మొదలుకొని దక్షిణభారత దేశం వరకూ ఆయనకు ఆలయాలు వున్నాయి. అసలు దుర్యోధనుని ఆలయాలు ఎందుకు కట్టారు?అవి ఎక్కడెక్కడున్నాయి?వాటి విశిష్టతలు గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

ఎక్కడుంది?

ఉత్తరాంచల్ ఎత్తైన మంచుపర్వతాలకి, ప్రకృతి అందాలకి ప్రసిద్ధి. అక్కడ ముఖ్య పట్టణమైన డెహరాడూన్ కి 216కిమీ ల దూరంలో వున్న జాకోల్ అనే గ్రామ ప్రజలు దుర్యోధనుని తమ దేవతగా కొలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ నివసించే మోరీ అనే జాతివారు దుర్యోధనుడు తమ పూర్వికుడిగా, వారి జాతి ఆదిపురుషుడిగా చెబుతారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

తాము కౌరవులకి వారసులమని,అందుకే తమ కులదైవం దుర్యోధనుడని చెప్పుకుంటారు. అందువలన సుయోధనుడికి జాకోల్ లో ఒక గుడి కూడా కట్టారు. ఈ ఆలయానికి సమీపంలో టోన్స్ అనే నది కూడా వుంది.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

పూర్వం ఈ నదిని థామస్ అని పిలిచేవారు.సంస్కృతంలో థామస్ అంటే శోకం అని అర్థం.కురుక్షేత్రయుద్ధంలో కౌరవులు ఓడిపోయారనే వార్త విని అక్కడి వారందరూ కొన్ని నెలల పాటు తీవ్రంగా రోదించారట. వారి కన్నీళ్ళనుంచే ఈ నది పుట్టిందని,అందుకే దీనికి థామస్ అనే పేరు వచ్చిందని,కాల గమనంలో టోన్స్ గా పేరుమారిందని అక్కడివారు చెబుతున్నారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అందువలనే ఇప్పటికీ అక్కడిప్రజలు ఆ నదిలోని నీటిని తాగటానికి వుపయోగించరు. దుర్యోధనుడి ఆరాధన కేవలం ఇక్కడివారే కాకుండా బాలగంగా, బిల్ గంగా, యమున, భాగీరధీ లోయలలోని వారు కూడా చేస్తారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

ఈ లోయలలోని హరికీధున్,ఓస్లా,గంగార్, దత్ మేర్ లలోనూ దుర్యోధనునికి ఆలయాలు కట్టి పూజిస్తున్నారు.అంతేకాదు జాకోల్ లోని సయానా, బల్జీ తెగలవారు ఆషాడమాసం నుంచి పుష్య మాసం వరకూ దుర్యోధనుని యాత్రను నిర్వహిస్తారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

ఈ యాత్ర జాకోల్ నుంచి మొదలై ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో తిరిగి ఆ వూరిలో ఆతిధ్యంస్వీకరిస్తారు.ఈ సందర్భంగా సుయోధనయాత్ర ఏ వూరిలో వుంటుందో ఆ గ్రామంలో సంబరాలు చేస్తారు.అలా అన్ని గ్రామాలు తిరిగి మళ్ళీ దుర్యోధనుని యాత్ర జాకోల్ లో ముగుస్తుంది.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

ఇక్కడి వారు దుర్యోధనుణ్ణి ఇంతలా పూజించటానికి గల కారణం ఒక చారిత్రికసంఘతనతో ముడిపడి వుందట. మహాభారత కాలంలో దేశాటన చేస్తున్న కౌరవచక్రవర్తి సుయోధనుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి ప్రకృతిఅందాలకు మంత్ర ముగ్ధుడై చాలారోజుల పాటు అక్కడే వుండిపోయాడట.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

ఆ సమయంలో ఒకసారి దేవుని పూజలో వున్న దుర్యోధనునికి దేవునియొక్క వాణి ఇలా పలికిందట.ఓ దుర్యోధనా ఇక్కడి ప్రజలు కడుదారిద్ర్యంలో వున్నారు.కావున వీరి బాగోగులు నువ్వే చూడాలి.అని పలికిందట. అప్పటినుంచి దుర్యోధనుడు ఈ ప్రాంతంలోని ప్రజలను చాలా బాగా చూసుకునేవాడని అందువలనే దుర్యోధనుని వారు దేవుడిగా కొలుస్తున్నట్లు అక్కడివారు చెబుతున్నారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అంతేకాదు ఇప్పటికీ ఆ ప్రాంతపు పంచాయితీలలో ఏదైనా గొడవలయొక్క తీర్పు ఎటువైపు తేలకపోతే దుర్యోధనుని ఆత్మను ఆవాహనచేసి స్వయంగా ఆయనతోనే తీర్పుచెప్పిస్తారట.అలా దుర్యోధనుడిఆత్మని ఆవాహన చేసుకొనేవ్యక్తిని మాలి అంటారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

ఇక దక్షిణభారతదేశవిషయానికి వస్తే కేరళలోని కొల్లంజిల్లాలోని పోరువజీ గ్రామంలోని పోరువజీ పెరువిరిత్తి మలనాడ అనే ఆలయం ఒకటి వుంది.ఈ ఆలయంలోని ప్రధాన దేవుడు దుర్యోధనుడు.అయితే ఈ ఆలయం సాధారణఆలయాలలా కాకుండా చాలా వింతగా వుంటుంది.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

ఈ ఆలయానికి గోపురం కానీ, విగ్రహం కానీ వుండదు. అక్కడ కేవలం ఒక రాతి మంటపం వంటి నిర్మాణం ఒకటి వుంది. ఆ మంటపాన్నే దుర్యోధనుడిగా కొలుస్తారు. ఈ ఆలయంలో దుర్యోధనుణ్ణి మలయకుప్పంగా పిలుస్తారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

ఆలయంలో వింతలు

ఈ ఆలయంలో చాలా వింతలున్నాయి. అన్ని దేవస్థానాలలో బ్రహ్మణులు,పూజలు నిర్వహిస్తే ఈ ఆలయంలో మాత్రం దళితులు పూజలు నిర్వహిస్తున్నారు. తర తరాలుగా కురువ తెగకు చెందిన కడుతెసరి అనే కుటుంబీకులు ఈ ఆలయంలోని దుర్యోధనుని పూజారులుగా వ్యవహరిస్తున్నారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అంతేకాదు ఈ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టరు.దానికి బదులుగా కొబ్బరికల్లు, మాంసం నైవేద్యంగా సమర్పిస్తారు.అయితే జంతుబలులు,నిషేదించినప్పటినుంచి కల్లు కొన్నిరకాలైన శాఖాహారప్రసాదాలు పెడుతున్నారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

ఈ ఆలయానికి 25 మంది కమిటీ సభ్యులు కూడా వున్నారు. వీరి పర్యవేక్షణలోనే ఆ ఆలయంలోని అన్ని కార్యాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చిలో ఈ ఆలయంలోని దుర్యోధనునికి సంబరాలు కూడా చేస్తారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

ఆ సమయంలో దుర్యోధనుణ్ణి సంతృప్తిపరచటానికి ఒక లక్కఇంటిని నిర్మించి దాన్ని తగలబెడతారట.ఈ వూరిలో వసూలుచేసే పన్నులు కూడా దుర్యోధనమహారాజుకు కడుతున్నట్లుగా భావిస్తామని అక్కడి వారు చెబుతున్నారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ దుర్యోధనుణ్ణి పూజించటానికి చాలా కధలున్నా ఒక కధమాత్రం చాలా ప్రాచుర్యంలో వుంది.ఒక సారి దుర్యోధనునికి తీవ్రంగా దాహంవేయటంతో అక్కడ వున్న ఒక ఇంటివద్దకు వెళ్లి మంచి నీళ్ళడగగా ఆ ఇంట్లో వున్న ఒక ముసలావిడ కొబ్బరికల్లు ఇచ్చిందట.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

ఆ కల్లు చాలా రుచిగా అనిపించటంతో దుర్యోధనుడు చాలా సంతోషించి ఆమె వివరాలు అడగ్గా ఆమె అంటరానికులానికి చెందింన కురవ అనే తెగకి చెందినదిగా తెలిసి తనకి కలిగిన తీవ్ర దప్పికను తీర్చినందుకు కరుణించి ఆమె ఆ వూరిజనం బాగుండాలని అక్కడి శివాలయంలో పూజలు నిర్వహించి కొన్ని వందల ఎకరాలభూమిని అక్కడి పేదప్రజలకు పంచిపెట్టి వారి బాగోగులు చూసుకోవటం వల్ల అప్పటినుంచీఇప్పటివరకూ ఆ వూరి ప్రజలు దుర్యోధనుణ్ణి వారి దేవతగా కొలుస్తున్నారు.

pc:youtube

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

మహాభారతంలో గొప్ప విలన్ గా పేరు తెచ్చుకున్న దుర్యోధనుడు ఈ ప్రదేశాలలో చేసిన మంచిపనుల వల్ల అక్కడిప్రజలకు ఆరాధ్యదైవంగా మారిపోయాడు.

pc:youtube

ఇది కూడా చదవండి:

శివలింగానికి మేకు వల్ల కారిన రక్తపు మరక ఇప్పటికీ పోలేదు...ఎందుకు?

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి