
పూరీ అన్న తక్షణం జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు గుర్తుకు వస్తాయి. ప్రతి హిందువూ తన జీవిత కాలంలో తప్పక సందర్శించాల్సిన ఛార్ థాం పుణ్యక్షేత్రాల్లో ఈ పూరీ లోని జగన్నాథ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయంలో శ్రీ కృష్ణుడితో పాటు సుభద్ర, ద్రౌపతి విగ్రహాలకు చేసే అలంకరణ ఎంతో ప్రాచూర్యం పొందింది.
ఇటీవలే ఈ రథయాత్ర ఘటం కూడా కన్నుల పండువగా జరిగింది. అయితే అంతే ప్రాధాన్యత కలిగిన మరో దేవాలయం కూడా అదే ఒరిస్సాలో ఉంది. దీనిలో కూడా శ్రీ కృష్ణ, బలరామ ద్రౌపతి విగ్రహాలను మనం చూడవచ్చు. అందువల్లే ఈ దేవాలయాన్ని చిన్న పూరీ క్షేత్రమని పిలుస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

అనంత వాసుదేవ ఆలయం
P.C: You Tube
ఒడిషా రాష్ట్రంలోని భవనేశ్వర్ లో ఉన్న అనంత వాసుదేవ ఆలయాన్నే చిన్న పూరీ క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ శ్రీ కృష్ణుడు, బలరాముడు, సుభద్ర దేవతలను ప్రధానంగా కొలుస్తారు.

అనంత వాసుదేవ ఆలయం
P.C: You Tube
ఈ దేవాలయంలో ప్రపంచంలో ఎక్కడా లేనట్లు బలరాముడు ఏడు పడగలు ఉన్న సర్పం కింద నిలుచుకొని ఉన్నట్లు చెక్కిన శిల్పం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక సుభద్రా దేవి రత్నాల కుండ, తామరపువ్వులను ఇరు చేతులతో పట్టుకొని ఉంటుంది. అదే విధంగా ఎడమ పాదాన్ని ఇంకొక రత్నాల కుండ పై ఉంచుతున్నట్లు ఉన్న విగ్రహాన్ని కూడా భక్తులు తదేకంగా చూస్తూ సమయాన్ని ఇట్టే మరిచిపోతుంటారు.

అనంత వాసుదేవ ఆలయం
P.C: You Tube
ఈ దేవాలయం లింగరాజ ఆలయం నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి స్త్రీ శిల్పాల పై ఉన్న ఆభరణాలను చూసి చాలా మంది అటువంటి ఆభరణాలను చేయించుకొంటున్నారు. దీనిని చిన్న పూరీ క్షేత్రమైనా అక్కడి విగ్రహాలకు, ఇక్కడి విగ్రహాలకు కొంత తేడా ఉంది. ఈ అనంత వాసుదేవ దేవాలయంలోని విగ్రహాలు పూర్తిగా మలచబడి ఉంటాయి.

అనంత వాసుదేవ ఆలయం
P.C: You Tube
ఈ దేవాలయం లింగరాజ ఆలయం నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి స్త్రీ శిల్పాల పై ఉన్న ఆభరణాలను చూసి చాలా మంది అటువంటి ఆభరణాలను చేయించుకొంటున్నారు. దీనిని చిన్న పూరీ క్షేత్రమైనా అక్కడి విగ్రహాలకు, ఇక్కడి విగ్రహాలకు కొంత తేడా ఉంది. ఈ అనంత వాసుదేవ దేవాలయంలోని విగ్రహాలు పూర్తిగా మలచబడి ఉంటాయి.

అనంత వాసుదేవ ఆలయం
P.C: You Tube
ఈ విగ్రహాలన్నీ గ్రానైట్ తో చెక్కబడినవి. అయితే పూరిలోని విగ్రహాలు చెక్కతో తయారవుతాయన్న విషయం తెలిసిందే. ఈ అనంతవాసుదేవ ఆలయం చక్రక్షేత్రం కాగా, పూరీలోని జగన్నాథ దేవాలయం శంఖ క్షేత్రం కావడం గమనార్హం.