Search
  • Follow NativePlanet
Share
» »విశాఖ పర్యాటక కేంద్రాల సందర్శనంతో వీకెండ్ ముగిద్దాం

విశాఖ పర్యాటక కేంద్రాల సందర్శనంతో వీకెండ్ ముగిద్దాం

విశాఖపట్టణంలో చూడదగిన పర్యాటక పర్యాంతాల గురించి కథనం.

సముద్ర తీర ప్రాంతం, బీచ్ లు అన్న తక్షణం తెలుగు రాష్ట్రాల వారికి వెంటనే గుర్తుకు వచ్చేది విశాఖపట్టణం. ఇక్కడ ఉన్న బీచ్ లు భారత దేశంలోని మిగిలిన బీచ్ లతో పోలిస్తే అంత ప్రమాదకరమైనవి కావు. అందువల్ల ఇక్కడ కొంచెం జాగ్రత్తగా సముద్ర తీర ప్రాంతాల్లో ఈత కొట్టే వారిసంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

అయితే విశాఖ పట్టణం అంటే కేవలం బీచ్ లే కాదు. ఇంకా అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. అందులో సింహాచలం దేవాలయం, కైలాసగిరి వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు ఇందిరాగాంధీ జూ, జలాంతర్గామి మ్యూజియం, ఉడా పార్క్ ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉన్నాయి.

అందులో ముఖ్యమైన 10 ప్రాంతాలను మీ కోసం అందిస్తున్నాం. ఈసారి విశాఖ పట్టణం వెళ్లినప్పుడు ఈ ప్రాంతాలను తప్పక సందర్శించండి. మరెందుకు ఆలస్యం చదివేయండి.

యారాడా బీచ్

యారాడా బీచ్

P.C: You Tube

విశాఖపట్టణం అన్న తక్షణం ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది బంగాళాఖాతం, సముద్ర తీర ప్రాంతాలు. విశాఖపట్టణం చుట్టు పక్కల అనేక బీచ్ లు ఉన్నాయి. అందులో అందమైన బీచ్ యారాడా బీచ్ అని చెప్పవచ్చు. ఒక వైపున సముద్రం మూడు వైపులా ఎతైన కొండలతో ఎప్పటికప్పుడు నూతన అందాలను సంతరించుకునే ఈ బీచ్ లో సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తే కాలాన్ని ఇట్టే గడిపేయవచ్చు.

కటికి వాటర్ ఫాల్స్

కటికి వాటర్ ఫాల్స్

P.C: You Tube

అరుకువాలీ వెళ్లే దారిలో ఈ కటికి జలాశయం ఎదురవుతుంది. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి గోస్తాని నదీ జాలలు జాలువారడం వల్ల ఈ కటికి వాటర్ జలాశయం ఏర్పడుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా అవకాశం ఉంది. చుట్టూ పచ్చని పర్వత శిఖరాల మధ్య నుంచి జాలువారే ఈ జలపాతాల అందాలను మనలను మంత్రముగ్దులను చేస్తాయి.

కైలాసగిరి

కైలాసగిరి

P.C: You Tube

నగరం నడిబొడ్డున ఉన్న కైలాసగిరి ప్రముఖ పర్యాటక కేంద్రం సుమారు సుముద్ర మట్టం నుంచి 360 అడుగుల ఎత్తు నుంచి నగరాన్ని వీక్షించడం బలే మాజాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పర్వత శిఖరం పై భాగాన ఉన్న పార్వతీ పరమేశ్వర విగ్రహాలు ప్రధాన ఆకర్షణ.

 బొర్రా గుహలు

బొర్రా గుహలు

P.C: You Tube

భారత దేశంలోని అతి పొడవైన గుహల్లో బొర్రాగుహలు కూడా ఒకటి. వీటి పొటవు సుమారు 705 మీటర్లు. విశాఖపట్టణం నుంచి ఒక రోజులో అనంతగిరి హిల్స్ లో ఉన్న బొర్ర గుహలను చూసి రావచ్చు. ఈ గుహల్లోనే ఎన్నో సినీ, బుల్లితెర షూటింగ్ లు జరుగుతూ ఉంటాయి.

జలాంతర్గామి మ్యూజియం

జలాంతర్గామి మ్యూజియం

P.C: You Tube

విశాఖపట్టణం లో చూడదగిన పర్యాటక ప్రాంతాల జాబితాల్లో జలాంతర్గామి మ్యూజియం కూడా తప్పకుంటా ఉంటుంది. ఐఎన్ఎస్ కురుసురా జలాతర్గామిని మ్యూజియంగా మార్చి రుషికొండా బీచ్ లో ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో భారత నావీ విభాగానికి చెందిన ఎన్నో ఫోటోలను, యుద్ధ సామాగ్రీని చూడవచ్చు.

మత్య్సదర్శినీ అక్వేరియం

మత్య్సదర్శినీ అక్వేరియం

P.C: You Tube

భారత సముద్ర జలాల్లో దొరికే అరుదైన చేపలు, పీతలు, రొయ్యలు ఈ మత్స్యదర్శినీ అక్వేరియంలో మనం చూడవచ్చు. రామక`ష్ణ బీచ్ కు వెళ్లిన వారు ప్రతి ఒక్కరూ ఈ అక్వేరియం ను సందర్శించకుండా వెనుతిరిగి రాలేరు.

ఇందిరాగాంధీ పార్క్

ఇందిరాగాంధీ పార్క్

P.C: You Tube

విశాఖపట్టణంలో ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ ను 1977లోనే ఏర్పాటు చేశారు. ఇక్కడ అత్యంత అరుదైన 100 జాతుల వరకూ జంతు, పక్షులను మనం చూడవచ్చు. కంబలకొండ రిజర్వ్ ఫారెస్ట్ లో భాగమైన ఈ ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ కూడా విశాఖపట్టణంలో చూడదగినదే.

ఉడా పార్క్

ఉడా పార్క్

P.C: You Tube

విశాఖపట్టణంలో చూడదగిన మరోప్రాంతం ఉడాపార్క్. 37 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పటు చేసిన ఈ ఉడా పార్క్ లో దాదాపు 2,500 చెట్లు, పొదలు, లతలు ఉన్నాయి. వీకెండ్ తో పాటు సాయంకాలం సమయంలో ఎక్కువ మంది ఈ పార్కుకు వస్తూ ఉంటారు. ఫిట్ నెస్ సెంటర్ తోపాటు చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు.

డాల్ఫినోస్

డాల్ఫినోస్

P.C: You Tube

విశాఖపట్టణం శివారు ప్రాంతాల్లో ఉన్న బీచ్ కు దగ్గరగా ఈ డాల్ఫినోస్ ఉంటుంది. ఒక పెద్ద పర్వత శిఖరం చూడటానికి డాల్ఫిన్ ముక్కులాగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమాయాలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.

సింహాచలం

సింహాచలం

P.C: You Tube

విశాఖపట్టణానికి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింహాచలంలో శ్రీ వరహా లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. చుట్టూ పచ్చని చెట్లతో సింహరిగి పర్వత శిఖరం పై భాగంలో ఉన్న ఈ స్వామివారిని చూడటానికి వారాంతాల్లో ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. దక్షిణ భారత దేశంలో ముఖ్యమైన వైష్ణవ ఆలయాల్లో ఇది కూడా ఒకటి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X