Search
  • Follow NativePlanet
Share
» »అందాల లోకంలో విహరించడానికి సిద్ధమా?

అందాల లోకంలో విహరించడానికి సిద్ధమా?

కేరళలోని హిల్ స్టేషన్లకు సంబంధించిన కథనం.

భారత దేశంలో పశ్చిమకనుల వల్ల గాడ్స్ ఓన్ కంట్రిగా పేరున్న కేరళ ప్రముఖ పర్యాటక కేంద్రమన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్నటు వంటి పచ్చటి అడవులు, కాఫీ, టీ, తోటలకు తోడుడసుగంధ ద్రవ్యాల తోటల పరిమళాలు మనలను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా వార్షాకాలం ప్రారంభమైన ఈ జూన్ మాసంలో కేరళలో అనేక ప్రాంతాలు అప్పుడే చిగురిస్తున్న ఎత్తైన పర్వత శిఖర ప్రాంతాలు ప్రకతిలోని అందానంతటిని తమలోనే ఇముడ్చుకొన్నాయా అనిపిస్తుంది. కేరళలోని ఈ హిల్ స్టేషన్లలో అందమైన జలపాతాలకు కూడా కొదువ లేదు. సాధారణంగా హిల్ స్టేషన్లు అన్న తక్షణం మనకు సింమ్లా, డార్జిలింగ్ వంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ప్రదేశాల పేర్లే గుర్తుకు వస్తాయి. వాటికి ఏమాత్రం తీసిపోని అనేక హిల్ స్టేషన్లు ఈ కేరళ సొంతం. ఈ నేపథ్యంలో కేరళలోని అతి ముఖ్యమైన హిల్ స్టేషన్ల వివరాలు మీ కోసం

మున్నార్

మున్నార్

P.C: You Tube


కేరళలో మూడు నదులు కలిసే ప్రాంతమే మున్నార్. సముద్రమట్టానికి దాదాపు 1600 మీటర్ల ఎత్తులో ఈ హిల్ స్టేషన్ ఉంటుంది. మున్నార్ ను కేరళ సహస స్పా అని కూడా అంటారు. మున్నార్ చుట్టు పక్కల అనేక చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. అందులో పోతమాడు, దేవికుళం, పల్లివాసల్, అట్టలుల్, నియమకద్ వంటివి ముఖ్యమైనవి. ఇక్కడ విభిన్న జీవ వైవిద్యం కనిపిస్తుంది. ముఖ్యంగా 12 ఏళ్లకు ఒకసారి పుష్పించే నిల్కురింజీ అనే అరుదైన పుష్పాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.

తెక్కడి

తెక్కడి

P.C: You Tube


కేరళలో మరో అందమైన హిల్ స్టేషన్ ఇడుక్కి జిల్లాలోని తెక్కడి. దీనిని వైల్డ్ లైఫ్ ఆఫ్ కేరళ అని అంటారు. ఈ హిల్ స్టేషన్ లోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెరియార్ అభయారణ్యం ఉంది. ఇక్కడ మనకు ఏనుగుల సఫారీ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

వాగమాన్

వాగమాన్

P.C: You Tube

సముద్ర మట్టానికి దాదాపు 1200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ కంక్రీట్ జంగల్ నుంచి విశ్రాంతిని కోరుకునే వారికి మంచి పర్యటక కేంద్రమని చెప్పవచ్చు. అందమైన జలపాతాలతో పాటు పర్వత నదీలోయల ప్రాంతాలు వాగమాన్ సొంతం. ఇక్కడ ఇల్లికల్ పర్వత శిఖరం, పొంజార్ వంటి ప్రముఖ పర్యాటక స్థలాలను చూడటం మరిచిపోకండి.

పొన్ముడి

పొన్ముడి

P.C: You Tube

కేరళలో ప్రముఖ పట్టణమైన తిరువనంతపురానికి ఇది కేవలం 61 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ముఖ్యంగా ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలని ఇష్టపడే వారితో పాటు సాధారణ పర్యటకులను కూడా ఇ పొన్ముడి ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక్కడ అగస్తార్ కోడమ్ అనే ప్రాంతంలో టీ ఎస్టేట్ అందాలను చూస్తే ఇట్టే కాలాన్ని గడిపేయవచ్చు. అంతేకాకుండా ఇది పొన్ముడిలోనే అత్యంత ఎతైన పర్వత శిఖర ప్రాంతం.

లాక్డీ

లాక్డీ

P.C: You Tube

వయనాడ్ జిల్లాలో ఉన్న లాక్డి ని భూలోక స్వర్గమని చెప్పవచ్చు. ప్రకృతి సౌందర్యం, మంచి వాతావరణం, ఎత్తైన ఆకుపచ్చ పర్వతాలు మనలను రీ ఫ్రెష్ చేస్తాయి. అక్కడ అనేక రిసార్టులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X