Search
  • Follow NativePlanet
Share
» »మీ వాహనాన్ని యాక్సిడెంట్ నుంచి తప్పించి, పసుపు కుంకుమలను కాపాడే అమ్మవారు

మీ వాహనాన్ని యాక్సిడెంట్ నుంచి తప్పించి, పసుపు కుంకుమలను కాపాడే అమ్మవారు

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ తల్లి లోవ దేవాలయానికి సంబంధించిన కథనం.

తలచిన వెంటనే ఇంటి ముందుకు వచ్చి కోరిన కోర్కెలు తీర్చే దేవతగా ఇక్కడి అమ్మవారికి పేరు. అందువల్లే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తమ కోర్కెలను తీర్చాల్సిందిగా అమ్మవారిని వేడుకొంటూ ఉంటారు. ముఖ్యంగా కొత్త వాహనాన్ని ఖరీదు చేసిన వారు తప్పక ఇక్కడికి వచ్చి ఆ వాహనానికి పూజలు చేయించుకొంటారు.

అంతేకాకుండా అక్కడ ఉన్న రాళ్ల పై తమ వాహనం రిజిస్ట్రేషన్ సంఖ్య రాస్తారు. దానివల్ల వాహనం ప్రమాదాలకు గురికాకుండా ఉంటుందని నమ్మకం. దాదాపు 350 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో చండీహోమం జరుగుతూనే ఉంది. ఈ హోమానికి హాజరు కావడానికి వేల మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయంలో పసుపు కుంకుమ పూజ చేస్తే తమ మాంగళ్యం సుభిక్షంగా ఉంటుందని స్థానిక ముతైదువలు భావిస్తుంటారు. అందువల్లే నిత్యం మంగళ, శుక్రవారాల్లో వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ అమ్మవారి ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

 తలంపు అంటే

తలంపు అంటే

P.C: You Tube

తలంపు అంటు తలుచుకోవడం అని అర్థం. తాము కష్టాల్లో ఉన్నామని తలుచుకున్న వెంటనే వచ్చి ఆ కష్టాన్ని తీర్చే దేవత కాబట్టే ఈమెను తలపులమ్మ అంటారు. పూర్వం ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఓ పన్నెండేళ్ల ఆడపిల్ల వచ్చి ఆ ఆపద తీర్చి వెళ్లేది.

అందువల్లే ఆ పేరు

అందువల్లే ఆ పేరు

P.C: You Tube

మళ్లీ ఎవరికీ కనిపించేది కాదు. కష్టంలో ఉన్నవారు ఎవరైనా పిల్లే మళ్లి వచ్చి ఆ కష్టాన్ని తీర్చేది. ఆ పాప పేరు మాత్రం ఎవరికి తెలియదు. దీంతో వారు తలంపులమ్మ అని పిలిచేవారు. కాలక్రమంలో అ పేరు కాస్త తలపులమ్మ అయ్యింది.

పిల్ల తప్పి పోయింది

పిల్ల తప్పి పోయింది

P.C: You Tube

పూర్వం ఇది అడవిలోని ఒక చిన్న గుట్టు. ఒకసారి అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఒక కుటుంబం మొత్తం పిల్లా పాపలతో ఇక్కడకు వచ్చింది. తల్లి దర్శనం అయిన తర్వాత కొండను దికి కిందికి వెళ్లారు. అయితే ఆ హడావిడిలో ఒక పాపను మర్చిపోయారు.

బిడ్డకు ఏమీ కాదు

బిడ్డకు ఏమీ కాదు

P.C: You Tube

అప్పటికే రాత్రి అయ్యింది. దీంతో పైకి వెళ్లడానికి వీలు కాలేదు. దీంతో ఆ పాప తల్లి ఏడుస్తుంటే ఎవరో ఎందుకు పిచ్చిదాన ఏడుస్తున్నావు. పైన తలచిన వెంటనే వచ్చి కష్టాలన్నీ తీర్చే తలుపులమ్మ ఉంది. నీ బిడ్డకు ఏమీ కాదు.

అమ్మఒడిలో

అమ్మఒడిలో

P.C: You Tube

ఆ తల్లే అన్నీ చూసుకుంటుంది అని ఒక అశీరవాణి పలికింది. దీంతో ఆ కుటుంబం భయపడుతూనే ఆ రాత్రి గడిపింది. తెల్లవారిన తర్వాత గుట్టపైకి వెళ్లితే ఆ పాప అమ్మవారి ఒడిలో క్షేమంగా కనిపించిందని చెబుతారు.

మేరు పర్వతం

మేరు పర్వతం

P.C: You Tube

ఇలా అమ్మవారి మహిమలు ఎన్నో ఉన్నాయి. ఇక అమ్మవారు ఇక్కడ కొలువుండటానికి సంబంధించి ఒక పురాణ కథనం ప్రచారంలో ఉంది. పూర్వం మేరు పర్వతం తన ఆకారాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. దీంతో ఆ పర్వతం సూర్యగమనానికి అడ్డు రావడం ప్రారంభించింది.

అగస్త్యుడి వద్దకు వెళ్లి

అగస్త్యుడి వద్దకు వెళ్లి

P.C: You Tube

దీంతో స`ష్టి అల్లకల్లోలం అవుతోందని దేవతలు, మునులు బాధపడటం ప్రారంభించారు. దీంతో దేవగణాలు మేరువుకు గురుసమానుడైన అగస్త్యుడి దగ్గరకు వెళ్లి ఆపద నుంచి కాపాడాల్సిందిగా మేరువు గురువైన అగస్త్యుడి దగ్గరకు వెళ్లి కోరారు.

అలాగే ఉండిపోయాడు

అలాగే ఉండిపోయాడు

P.C: You Tube

అప్పుడు అగస్త్యుడు మేరువు దగ్గరకు రాగా మేరువు తలవంచి నమస్కరించాడు. దీంతో అగస్త్యుడు తాను దక్షిణాది యాత్రకు బయలుదేరి వెలుతున్నానని వచ్చేవరకూ ఇలాగే ఉండాలని ఆదేశించాడు. దీంతో మేరువు ఆకారం పెరిగి అలాగే ఉండిపోయాడు.

నీరు కనపడలేదు

నీరు కనపడలేదు

P.C: You Tube

ఇక దక్షిణ దేశ యాత్రకు బయలుదేరిన అగస్త్యుడు ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలోని లోవ ప్రాంతానికి వచ్చేసరికి సంధ్య వార్చాల్సిన సమయం వచ్చింది. అయితే ఎక్కడా నీటిబొట్టు ఆయనకు కనిపించలేదు.

పాతళగంగ

పాతళగంగ

P.C: You Tube

దీంతో అగస్త్యుడు ఆ జగన్మాతను ప్రార్థించగా ఆ ప్రాంతంలో పాతాళగంగా ఉబికి వచ్చి అగస్త్యుడి అవసాన్ని తీర్చింది. దీంతో అగస్త్యమహర్షి సంధ్య వందనం ముగించుకుని ఆ రాత్రి అక్కడే విశ్రమించాడు.

ధన్యవాదాలు

ధన్యవాదాలు

P.C: You Tube

ఆ రాత్రి అగస్త్యుని కలలో ఆ తల్లి కనిపించి తాను లలితాంబికను అని భక్తులను ఆదుకునేందుకు ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నానని చెప్పింది. దీంతో అగస్త్యుడు ఆమెను మనసులోనే పూజించి తాను తలిచినంతనే వచ్చి కోరిక తీర్చినందుకు ధ్యవాదాలు చెప్పాడు.

తలుపులమ్మగా

తలుపులమ్మగా

P.C: You Tube

అంతేకాకుంగా ఇక్కడి ప్రజలు తలిచిన వెంటనే వచ్చి వారి కోర్కెలను తీర్చే తలపులమ్మగా ఉండిపోవాల్సిందిగా వేడుకొన్నాడని కథనం. అందువల్లే ఇక్కడ అమ్మవారికి తలుపులమ్మగా పేరు వచ్చిందని చెబుతారు.

మరో కథనం ప్రకారం

మరో కథనం ప్రకారం

P.C: You Tube

మరో కథనం ప్రకారం తుని సంస్థానం రాజావారికి అమ్మ కలలో కనిపించి తాను ఇక్కడ శిలలా పడి ఉన్నానని వచ్చి పూజాదికాలు నిర్వహిస్తే ఈ ప్రాంతంలో పాతాళగంగ ఉద్భవిస్తుందని చెప్పిందని చెబుతారు. అమ్మవారి ఆదేశం మేరకు రాజు నడుచుకోవడంతో ఈ క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమయ్యిందని చెబుతారు.

మాంగళ్యం

మాంగళ్యం

P.C: You Tube

తలుపులమ్మను పసుపు కుంకుమలతో పూజిస్తే తమ మాంగళ్యం పదికాలల పాటు చల్లగా ఉంటుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అందువల్లే ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఎక్కువ సంఖ్యలో మహిళలు ఈ తలుపులమ్మ లోవకు వచ్చి మాంగళ్య సౌభాగ్యం కోసం అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.

రవ్వ లడ్డు, పులిహోర

రవ్వ లడ్డు, పులిహోర

P.C: You Tube

ఇక్కడి రవ్వలడ్డూ, పులిహోర ప్రసాదాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. లోవ దేవస్థానంలో అందించే లడ్డూ, పులిహోర రుచి రాష్ట్రంలో మరెక్కడా లభించదని భక్తులు చెబుతారు. ప్రతి ఏటా దాదాపు కొటిన్నర రుపాయల విలువచేసే ప్రసాద విక్రయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడి వారు తమ బందువులకు ఈ ప్రసాదాన్ని తరుచుగా పంపిస్తుంటారు.

ప్రయాణానికి అధిదేతగా

ప్రయాణానికి అధిదేతగా

P.C: You Tube

తలుపులమ్మ తల్లిని ప్రయాణానికి అధిదేవతగా స్థానికులు భావిస్తారు. అందువల్లే ఉత్తర కోస్తా ప్రాంతంలో కొత్తవాహనం కొన్న ప్రతి ఒక్కరూ తలుపులమ్మ లోవకు వచ్చి ప్రత్యేకంగా పూజలు చేయిస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ను ఇక్కడి రాళ్ల పై రాయిస్తూ ఉంటారు.

 ప్రమాదం జరగదని

ప్రమాదం జరగదని

P.C: You Tube

దీని వల్ల ఆ వాహనానికి ప్రమాదం జరగకుండా ఆ తలుపులమ్మ ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. అందువల్లే నిత్యం వందల సంఖ్యలో ఇక్కడ కొత్త వాహనాలు, వాటి యజమానులు ఇక్కడికి వస్తుంటారు.

12 రోజులు ఉత్సవాలు

12 రోజులు ఉత్సవాలు

P.C: You Tube

లోవకొత్తూరు గ్రామాన్ని తలుపులమ్మ పుట్టింటిగా భావిస్తారు. గంధామావాస్య పర్వదినాన్ని పురష్కరించుకుని ఈ లోవకొత్తూరులో 12 రోజుల పాటు ఉత్తవాలు బ్రహ్మాండంగా జరుపుతారు. అదేవిధంగా ఆషాడమాసంలో అమ్మవారికి దేవస్థానం ఆవరణలో ఆషాఢమాసోత్సవాలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది.

350 ఏళ్లుగా

350 ఏళ్లుగా

P.C: You Tube

ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా పంచామ`తాభిషేకాలు, పౌర్ణమి రోజున అమ్మవారికి మహాచండీ హోమం వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించడం దాదాపు 350 ఏళ్లుగా ఇక్కడ జరుగుతూ ఉందని స్థానిక పూజారులు చెబుతున్నారు.

అన్నవరం నుంచి

అన్నవరం నుంచి

P.C: You Tube

తలుపులమ్మ దేవస్థానం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తుని నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తలుపులమ్మ క్షేత్రాన్ని చేరుకోవడానికి రాజమండ్రి నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించాలి.

మెట్ల మార్గం

మెట్ల మార్గం

P.C: You Tube

బస్సు రైలు మార్గాల ద్వారా తలుపులమ్మ ఉన్న క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. గుట్ట పైన ఉన్న అమ్మవారి దర్శనానికి మెట్ల మార్గం ద్వారా చాలా మంది భక్తులు వెలుతుంటారు. మెట్లు ఎక్కలేనివారికి రోడ్డు మార్గం కూడా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X