» »టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

Written By: Venkatakarunasri

ఓ వైపుకొండలు.. మరోవైపు లోయలు.. కొండలపై మంచు దుప్పటి కప్పుకున్న దేవదారు వృక్షాలు.. లోయల్లో గలగల పారే జలధారలు.. ఇలాంటి వాతావరణంలో 'కూ..' అని కూతపెడుతూ పరుగులు తీస్తోంది ధూమశకటం. బోగిల్లో ఉన్న వారంతా కిటికీల్లో తలలు దూర్చి.. ప్రకృతి కాంతను ఆస్వాదిస్తున్నారు. అప్పటి వరకు దూసుకెళ్తున్న రైలు వేగం ఎందుకనో మందగించింది. రైలు పట్టాలు ఒక సొరంగంలోకి దారి తీశాయి. వాటి వెంటే రైలు! ఇంతలో చీకట్లు కమ్ముకున్నాయి. అంతలో రైలు ఆగిపోయింది! ఎందుకు?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా

‘‘హాయ్‌! ఎక్కడి నుంచి!'' అని ఇంగ్లిష్‌లో అడిగాడు అతడు. చీకట్లో ముఖం స్పష్టంగా కనిపించ లేదు. పరీక్షగా చూస్తే.. ఠీవీగా ఉన్నాడు. కోటు.. హ్యాటు.. భలేగా ఉన్నాడు. అయినా, తనతో పరిచయం ఉన్న మనిషిలా మాత్రం లేడు. మనసులో ఇన్ని మీమాంసలు నస పెడుతున్నా.. ‘సిమ్లా' అని బదులిచ్చాడు.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా

రైలు ఇంజిన్‌ వైపుగా వెళ్లిపోయాడు ఆ పలకరించిన పెద్దమనిషి. అతణ్ణి అలాగే చూస్తూ నిల్చుండిపోయాడు ఇతడు. ‘అక్కడ మీరేం చేస్తారు. లోపలికి రండి!' అని కిటికీలో నుంచి ఓ మహిళ కేక వేసింది. ‘ఆ వస్తున్నా!' అతడి వంకే చూస్తూ బోగీలో ఎక్కి కూర్చున్నాడు. దీర్ఘంగా నిట్టూరుస్తూ ‘‘మళ్లీ ఆగిపోయిందా! ఈ రూట్లో ఇదొక్కటే సమస్య!'' అన్నాడు బోగీలోని ఓ ముసలాయన.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

‘‘రైల్వే వాళ్లు మారరండి! కాలం చెల్లిపోయిన ఇంజన్లను నడుపుతున్నారు! అవి ఎప్పుడు ఆగిపోతాయో వాటికే తెలియదు'' చనువుగా అనేశాడు ఇందాక రైలు దిగి, ఎక్కిన వ్యక్తి. ఈ మాటలు వినగానే ఆ ముసలాయన నవ్వడం మొదలుపెట్టాడు. అతడి వంక అమాయకంగా చూస్తూ నవ్వాడు. నీకేం తెలుసన్నట్టుగా నవ్వాడు.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

తానన్న మాటలో అంతగా నవ్వడానికి ఏముందో ఇతడికి అర్థం కాలేదు. పదిహేను నిమిషాలయ్యాక రైలు మెల్లగా కదిలింది. ఇతగాడు కిటికీ పక్కనే కూర్చున్నాడు. చిమ్మ చీకటి. ఒకటో.. రెండో.. లైట్లు చిన్నగా మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఆ మసక మసక వెలుతురులో ఓ రూపం కనిపించింది. ఇందాక ‘ఎక్కడి నుంచి?' అని ప్రశ్నించిన ముఖం.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

రైలు అతణ్ణి దాటుకుంటూ వెళ్తోంది. అతడు ఒక సిగార్‌ వెలిగించాడు. ఒక్క దమ్ములాగాడు. పొగను బయటకు ఊదాడు. ఆ ధూపం గాల్లో కలిసిపోయే లోపు ఆ వ్యక్తి అంతర్ధానమైపోయాడు. ఆ దృశ్యం కంటపడగానే రైల్లో ప్రయాణిస్తున్న మనవాడి గుండెల్లో నిజంగానే రైలు పరిగెత్తడం మొదలైంది.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

ఇందాక పగలబడి నవ్విన వ్యక్తి పెద్దమనిషి పరీక్షగా చూస్తున్నాడు. అతడి కళ్లల్లో భయం కనిపించింది. మళ్లీ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు వినిపించగానే.. అతనికేసి కోపంగా చూశాడు ఇతడు. చెమటలు తుడుచుకుంటూ.. ‘ఎందుకలా నవ్వుతారు!' అని ఆవేశంగా అనేశాడు.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

దానికి బదులుగా ‘‘అతణ్ణి చూశావా?'' అని అడిగాడు పెద్దాయన. ‘‘ఎవరిని?'' అన్నాడతడు. ‘‘సడన్‌గా టెన్షన్‌ పడుతుంటేనూ..! అతడు కనిపించాడేమో అనుకున్నా!!'' అని బదులిచ్చాడు. ‘‘మీకెలా తెలుసు?'' అని భయం భయంగా ప్రశ్నించాడు. ‘‘డరో మత్‌ బేటా! ఆయన ఏం చెయ్యడు'' అని ధైర్యం చెప్పాడు.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

సొరంగం అయిపోయింది. చీకట్లు తొలగిపోయాయి. ‘‘ఇప్పుడు చెప్పు తాతా! ఎవరతను?'' అన్నాడు. ‘‘అదో పెద్ద కథ బాబు..'' అంటుండగానే మళ్లీ ఆగిపోయింది రైలు. ఏదో రైల్వే స్టేషన్‌ వచ్చినట్టుంది. ‘బరోగ్‌' రైల్వే స్టేషన్‌. రెండు నిమిషాల తర్వాత రైలు మళ్లీ కదిలింది. రైలు వేగం పెరిగింది. చల్లటి గాలి వీస్తోంది. ‘‘పెద్ద కథ అన్నారు.. చెప్పరా'' అని ఆత్రుతగా అడిగాడు.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

‘‘ఇందాక వచ్చిందే రైల్వే స్టేషన్‌ ‘బరోగ్‌' అక్కడి నుంచే కథ మొదలైంది. ఈ రూటు సిమ్లా నుంచి కాల్కా వరకూ ఉంటుంది. చిన్నా, పెద్దా బ్రిడ్జిలు 700 వరకూ ఉంటాయి. 107 సొరంగాలు ఉంటాయి. ఇందాక మనం దాటిన టన్నెల్‌ నెంబర్‌ 33! కిలోమీటర్‌ పైనే ఉంటుంది. అందులో ఓ దెయ్యం ఉంటుంది.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

అదెవరో కాదు ఆ టన్నెల్‌ నిర్మించిన ఇంజనీర్‌ కోలోనెల్‌ బరోగ్‌! నీకు సొరంగంలో కనిపించింది అతడే!!'' అని చెప్పి ఆపేశాడు. ఇందాక సొరంగంలో ఎవరూ కనిపించకపోతే.. ఈ మాటలను కొట్టిపారేసేవాడే! తనకు కనిపించింది దెయ్యం బరోగ్‌ అని తెలిసి.. ‘‘కాస్త వివరంగా చెప్పు'' అని కాస్త దగ్గరగా జరిగాడు.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

ఆ పెద్దాయన మళ్లీ కథ చెప్పడం మొదలుపెట్టాడు..

‘‘ఈ టన్నెల్‌ నిర్మాణం 1898లో మొదలైంది. 98 కిలోమీటర్ల దూరం. ఎక్కడికక్కడ ఇంజనీర్లను నియమించి పనులు చేపట్టారు. టన్నెల్‌ నెం.33 బాధ్యత ఇంజనీర్‌ బరోగ్‌కు అప్పగించారు అధికారులు. బరోగ్‌ మహా మేధావి. మంచి పనిమంతుడు. భారీ టన్నెల్‌.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

కొండను తొలుస్తూ నిర్మించాలి. ఒకే వైపు నుంచి కొండను తవ్వితే చాలా కాలం పడుతుందని భావించాడు బరోగ్‌. అందుకే ఏకకాలంలో రెండు వైపుల నుంచి కొండను తొలచాలని నిర్ణయించాడు. అందుకు పెద్ద పరిశోధనలే చేశాడు. మ్యాప్‌లు వేశాడు. చివరికి.. రెండు వైపుల నుంచి సొరంగాలు కలిసేలా.. పాయింట్లను కనిపెట్టాడు.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

బరోగ్‌ ఆలోచనను అధికారులు స్వాగతించారు. రెండు వైపులా కొండను తొలిచే పని మొదలైంది. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. అయినా సొరంగాలు కలవలేదు. చూస్తే.. బరోగ్‌ లెక్కలు తప్పాయి. రెండు సొరంగాలు దారి తప్పాయి. అధికారుల అంచనా వ్యయం తప్పింది.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

తమ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయిందని కార్మికులు.. బరోగ్‌పై నోరు జారారు. 8.40 లక్షలు తగలేసావని అధికారులు మండిపడ్డారు. శిక్షగా ఒక్క రూపాయి జరిమానా విధించారు. ప్రభుత్వం సొమ్ము వృథా చేశానని బాధపడ్డాడు బరోగ్‌. కార్మికుల శ్రమ దోచుకున్నానని కుంగిపోయాడు. అదే ఆవేదనలో.. ఆ టన్నెల్‌ సమీపంలో రివాల్వర్‌తో పేల్చుకుని చనిపోయాడు'' అని కథకి ఇంటర్వెల్‌ ఇచ్చాడు.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

మళ్లీ కొనసాగిస్తూ.. ‘‘కొన్నాళ్లకు ఆ టన్నెల్‌ని మరో ఇంజనీర్‌ పూర్తి చేశాడు. అవమానంతో ఆత్మహత్య చేసుకున్న బరోగ్‌ పేరిట 33వ టన్నెల్‌కు బరోగ్‌ టన్నెల్‌గా పేరు పెట్టారు. అప్పట్నుంచీ బరోగ్‌ ఆత్మ ఈ టన్నెల్‌లో చాలా మందికి కనిపించింది. ఎవరినీ ఏమీ అనదు.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

అలాగని ఏమీ అనకుండానూ ఊరుకోదు. కనిపిస్తుంది. మాయం అవుతుంది. రైళ్లు ఆగిపోతాయి. మళ్లీ మామూలుగా ప్రయాణిస్తాయి. ఈ బాధంతా పడలేక ఓ దశలో ఈ టన్నెల్‌కు ఇనుప గేట్లతో మూసి తాళాలు వేశారు. కొన్ని రోజులకే ఆ తాళాలు తెగి కింద పడ్డాయి.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

బరోగ్‌ తన టన్నెల్‌లో రైళ్ల రాకపోకలు కోరుకుంటున్నాడని భావించి.. మళ్లీ రైల్వే లైన్‌ను పునరుద్ధరించారు. అప్పుడప్పుడూ బరోగ్‌ కనిపిస్తుంటాడు. రైలు ఆగేలా చేస్తాడు. కొందరిని ప్రేమగా పలకరిస్తాడు. కొందరిని ఉరిమి ఉరిమి చూస్తాడు. తానే రైలు రిపేర్‌ చేసి.. మాయమవుతాడు'' అని కథ ముగించాడు ముసలాయన.

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

ఆ కథంతా వినేసరికి మొదట ఇతడికి భయమేసింది. తాను చూసింది బరోగ్‌నే అని తెలిసి కాళ్లలో వణుకు పుట్టింది. ఎలాగూ టన్నెల్‌ దాటొచ్చేశాం కదా అని తేరుకున్నాడు. బరోగ్‌ తనకు ఎందుకు కనిపించి ఉంటాడో మాత్రం అంతుచిక్కని ప్రశ్న. అతడికే కాదు..

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

టన్నెల్ నెం 33 - ఈ కథ మీకు తెలుసా?

ఇలాంటి పరిస్థితి ఆ దారిలో వెళ్లే చాలామందికి ఎదురవుతుంటుంది! కాకపోతే.. దీనికి సమాధానం బరోగ్‌ మాత్రమే చెప్పగలడు. ఆయన చెబుతానన్నా.. ఇదంతా తెలిశాక వినేవాళ్లు ఎవరుంటారు?లేకపోతే ఈ పర్యాటక ప్రదేశం అద్భుతమైనది !!