Search
  • Follow NativePlanet
Share
» »బెజ‌వాడ‌కు చేరువ‌లోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!

బెజ‌వాడ‌కు చేరువ‌లోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!

బెజ‌వాడ‌కు చేరువ‌లోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు కొద‌వ లేదు. మ‌రీ ముఖ్యంగా కొన్ని ఆక‌ర్ష‌ణీయ‌మైన నిర్మాణాలకు కేంద్ర‌బిందువుగా పేరుగాంచింది ఏపీ. అందులో ఒక‌టి, హింకర్ తీర్థ జైన దేవాల‌యం. ఇది విజయవాడ - మంగ‌ళ‌గిరి మ‌ధ్య జాతీయ‌ రహదారిపై ఉన్న ఓ ప్ర‌సిద్ధ‌ జైన దేవాలయం. హింకర్ తీర్థ జైన దేవాలయం మూల్ నాయక్‌కు అంకితం చేయబడింది. ప్రపంచం నలుమూలల నుండి సంద‌ర్శ‌కులు ప్రతి సంవత్సరం మూల్ నాయక్ ఆశీస్సులు పొందేందుకు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంది. ఈ ఆలయంలో చేసిన శిల్పాలు గ్రానైట్ రాయిపై చెక్కబడ్డాయి. పండ‌గ రోజులలో ఈ ఆల‌యం ర‌ద్దీగా ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జైన దేవాలయంగా ప్ర‌సిద్ధిగాంచింది హింకర్ తీర్థ జైన దేవాలయం. ఎటుచూసినా చుట్టూ పచ్చని కొండలతో, ప్రశాంతత‌ను చేరువ చేసే ఈ ఆలయం అనేక మంది సందర్శకులను మరియు భక్తులను ఆహ్వానిస్తోంది. ఆలయంలో అందంగా రూపొందించబడిన పాలరాతి స్తంభాలను చూస్తే చూపు తిప్పుకోలేరు. ఆల‌యంలోప‌ల‌కు దారితీసే మెట్ల మార్గంలో న‌డిచేట‌ప్పుడు అందంగా అలంక‌రించ‌బ‌డిన తోర‌ణాలు, స్తంభాలూ మీకు స్వాగతం ప‌లుకుతాయి. వాటిపై దేవుళ్ళు మరియు దేవతల యొక్క విభిన్న భంగిమలు చెక్కబడ్డాయి. ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణగా గౌరవానికి చిహ్నంగా ఆలయం ముందు భాగంలో చెక్కబడిన స్థంబం ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.

ఆక‌ర్షించే తెల్ల‌ని శిల్ప‌కళా సంప‌ద‌..

ఆక‌ర్షించే తెల్ల‌ని శిల్ప‌కళా సంప‌ద‌..

తెల్లని పాలరాయిపై చెక్కిన శిల్ప‌క‌ళా సంప‌ద‌ను గురించి మాట‌ల్లో చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. మ‌రో ప్ర‌పంచ‌పు అనుభూత‌ను చేర‌వ చేసేలా ఇక్క‌డి వాతావ‌ర‌ణం ఉంటుంది. ఎటుచూసిన అద్భుతమైన కళాఖండాలు ఆత్మీయంగా ప‌ల‌క‌రించే అనుభూతి క‌లుగుతుంది. ఆలయ స్తంభాలపై దేవతా విగ్రహాలు చెక్కిన తీరు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. ఆలయంలో గంబర అనే గర్భగుడి ఉంది. ఇక్కడ దేవత యొక్క రాతి విగ్రహంగాన్ని చూడ‌వ‌చ్చు.

ప్ర‌శాంత‌త‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఈ ప్రాంగ‌ణాన్ని చెప్పుకోవ‌చ్చు. ఎక్కువ‌గా కుటుంబ‌స‌మేతంగా ఇక్క‌డికి వ‌చ్చేందుకు సంద‌ర్శ‌కులు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. లోప‌ల‌కు వెళ్లేందుకు ఎలాంటి ప్ర‌వేశ రుసుమూ లేదు. ఆల‌యంలో ప్ర‌తి రోజూ ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి సాయంత్రం వ‌ర‌కూ సంద‌ర్శ‌కుల‌కు ప్ర‌వేశం క‌ల్పిస్తారు. అంతేకాదు, దూర‌ప్రాంతాల‌నుంచి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌కు మ‌ధ్యాహ్న‌ భోజ‌నం, రాత్రి భోజ‌నంతోపాటు వ‌స‌తి సౌక‌ర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.

హింకర్ తీర్థ జైన దేవాలయానికి ఎలా చేరుకోవాలి

హింకర్ తీర్థ జైన దేవాలయానికి ఎలా చేరుకోవాలి

హింక‌ర్ తీర్థ జైన ఆల‌యాన్ని సంద‌ర్శించేవారు ప్ర‌ధాన న‌గ‌ర‌మైన విజ‌య‌వాడ‌కు చేరుకోవాల్సి ఉంటంది. అక్కడి నుంచి బస్సు ద్వారా చేరుకోవాల‌నుకునేవారు ఆల‌యానికి 1.3 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ బస్టాండ్‌లో దిగాల్సి ఉంటుంది. అంతేకాదు, విజయవాడ రైల్వే స్టేషన్ ఆలయం నుండి 13 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. అక్కడి నుంచి నిత్యం బ‌స్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. విమాన మార్గంలో వ‌చ్చేవారు, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయానికి 38.0 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. క్యాబ్ బుక్ చేసుకోవడం ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.

ఇక్క‌డికి సమీపంలోని ప్రసిద్ధ ప్రదేశాలు

ఇక్క‌డికి సమీపంలోని ప్రసిద్ధ ప్రదేశాలు

మంగళగిరి

మొగలరాజపురం గుహలు

ఉండవల్లి గుహలు

ఇస్కాన్ విజయవాడ

ప్రకాశం బ్యారేజీ

భవానీ ద్వీపం

రాజీవ్ గాంధీ పార్క్

Read more about: vijayawada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X