Search
  • Follow NativePlanet
Share
» »వ‌న్ గ్రామ్‌ గోల్డ్ జ్యూల‌రీ కావాలా.. అయితే చిల‌క‌ల‌పూడి బ‌య‌లుదేరండి!

వ‌న్ గ్రామ్‌ గోల్డ్ జ్యూల‌రీ కావాలా.. అయితే చిల‌క‌ల‌పూడి బ‌య‌లుదేరండి!

వ‌న్ గ్రామ్‌ గోల్డ్ జ్యూల‌రీ కావాలా.. అయితే చిల‌క‌ల‌పూడి బ‌య‌లుదేరండి!

మహిళల మ‌న‌సు దోచేలా లోబ‌డ్జెట్ జ్యూయ‌ల‌రీకి కేరాఫ్ అడ్ర‌స్ చెప్ప‌మంటే ట‌క్కున గుర్తుకొచ్చేది మ‌చిలీప‌ట్నం. అవునండీ..! ద‌శాబ్దాలుగా ఆకర్షణీయ‌మైన రోల్డ్ గోల్డ్ ఆభ‌ర‌ణాల‌కు పుట్టినిల్లు మ‌న‌ మచిలీపట్నంలోని చిలకలపూడి. దేశ‌వ్యాప్తంగా పేరు పొందిన ఇక్క‌డి న‌గ‌లు.. నిత్యం మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా వచ్చిన కొత్త కొత్త డిజైన్‌ల‌తో జిగేల్‌మ‌నిపిస్తున్నాయి. ఇమిటేష‌న్ జ్యూయ‌ల‌రీగా పిలవ‌బ‌డే చిలకలపూడి బంగార‌పు మెరుపుల‌ విశేషాలు తెలుసుకుందాం రండి!!

రోల్డ్‌గోల్డ్ లేదా ఒన్ గ్రామ్ గోల్డ్ న‌గ‌ల‌ తయారీకి కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం కేరాఫ్‌ అడ్రస్‌. రోల్డ్‌గోల్డ్‌ నగల తయారీతో పాటు, వాటిని విక్రయించేందుకు దుకాణాలు సైతం ఇక్కడ వందలాదిగా ద‌ర్శ‌న‌మిస్తాయి. చిల‌క‌ల‌పూడిలోని ఏ వీధిలో చూసిన రోల్డ్‌గోల్డ్‌ నగల దుకాణాలు దర్శనమిస్తాయి. ఇక్క‌డి ప్రతి ఇల్లూ ఓ జ్యూయలరీ పరిశ్రమే. యాభై రూపాయ‌ల నుంచి వేల రూపాయ‌ల ధరలలో ఇక్కడ అన్ని రకాల గిల్టు నగలు లభిస్తాయి. అంతేకాదు, మారుతున్న కాలాన్ని బట్టి..

కొత్త ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు ఇక్కడ నగల రూపకల్పన జరుగుతుంది. నిజానికి, ఒకప్పుడు ఈ నగలను సంప్రదాయ కళాకారులు తయారుచేసినా.. ఆ తర్వాత అధునాతన సాంకేతిక నైపుణ్యం పెరగడంతో ఇమిటేషన్ జ్యుయలరీకి సంబంధించిన కార్యకలాపాలు విస్తరించాయి. దాదాపు మచిలీపట్నంలోనే పదివేలకు పైగా కుటీర పరిశ్రమలు ఇమిటేషన్ జ్యుయలరీ తయారీకి శ్రీకారం చుట్టాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి 30 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు.

దొర‌క‌ని అభ‌ర‌ణం అంటూ ఉండ‌దు..

దొర‌క‌ని అభ‌ర‌ణం అంటూ ఉండ‌దు..

ముక్కు పుడక దగ్గర నుండి కంఠాభరణాలు, హస్తాభరణాలు, వడ్డాణాల వరకు చిలకపూడి గిల్టు నగల షాపులలో దొర‌క‌ని అభ‌ర‌ణం అంటూ ఉండ‌దంటే న‌మ్మాల్సిందే మ‌రి. అలాగే డ్రామా కంపెనీల కోసం ప్రత్యేకంగా కిరీటాలు, విల్లంబులాలు కూడా ఇక్కడ తయారుచేస్తారు. రోలింగ్‌ మెషిన్‌ల మీద రోల్‌ చేయగా వచ్చిన మెటీరియల్‌తో చేసిన నగలు కనుక వీటిని రోల్డ్‌ గోల్డ్‌ నగలు అంటారు.

ఈ నగల తయారీలో రాగి, ఇత్తడి లేదా జింక్‌ను ప్రధానంగా వాడతారు. అలా తయారైన నగలకు గోల్డ్ కోటింగ్ కూడా వేస్తారు. ఈ గిల్టు నగలకు మెరుపు వచ్చేందుకు ఒక ప్రత్యేకమైన ద్రావకాన్ని వాడతారు. సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్‌ వంటి రసాయనాలలో వీటిని కడుగుతారు. అందుకే, స్వచ్ఛమైన బంగారానికి అచ్చమైన ప్రత్యమ్నాయంగా.. ఈ గిల్టు నగలను భావిస్తారు.

విదేశాలకు కూడా ఎగుమతి..

విదేశాలకు కూడా ఎగుమతి..

దాదాపు వందేళ్ల చ‌రిత్ర క‌లిగిన ఈ గిల్టు నగల వ్యాపారం చాలామందికి తమ తల్లిదండ్రుల నుండి వారసత్వంగా కూడా రావడం విశేషం. అంతేకాదండోయ్‌..! ఇలా చిలకపూడిలో తయారైన గిల్టు నగలు ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయంటే ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు. చిల‌క‌ల‌పూడిలో ఆభ‌ర‌ణాల కొనుగోలుదారుల‌కు గ్యారంటీ, వారంటీల‌తో మంచి మంచి ఆఫ‌ర్లు కూడా ఉన్నాయంటున్నారు.

ట్రెండ్‌కు అనుగుణంగా మోడ‌ల్స్‌..

ట్రెండ్‌కు అనుగుణంగా మోడ‌ల్స్‌..

బంగారం ధ‌ర‌లు ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులేని పరిస్థితి. అంతో, ఇంతో ఆర్థికంగా ఉన్నా, మార్కెట్‌లో ట్రెండ్‌కు అనుగుణంగా వచ్చిన మోడల్స్‌ కొనుగోలు చేయటం కష్టంగానే మారుతోంది. అందుకనే సామాన్యుల నుంచి ధనిక వర్గాల వారు వరకు వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాలపై ఆసక్తి చూపుతున్నారు. మ‌రెందుకు ఆల‌స్యం, త‌క్కువ బ‌డ్జెట్‌తో మీ ఒంటి నిండా బంగార‌పు ఆభ‌ర‌ణాల‌తో జిగేలుమ‌నిపించేందుకు చిలకలపూడి బ‌య‌లుదేరండి!!

Read more about: chilakalapudi machilipatnam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X