Search
  • Follow NativePlanet
Share
» »ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాలను చూడాలనుకొంటారు? మరి మీరు?

ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాలను చూడాలనుకొంటారు? మరి మీరు?

దక్షిణ భారత దేశంలోని దేవాలయాల గురించి కథనం.

దేవాలయాలు హిందూ మతానికి సంబంధించిన ధార్మిక కేంద్రాలు. అదే విధంగా ముస్లీంలకు మసీదులు, క్రిస్తియన్లకు చర్చిలు ధార్మిక కేంద్రాలు. ఇక భారత దేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఈ దేశంలో ఉన్నటువంటి ధార్మిక కేంద్రాలు మరే దేశంలోనూ, ఏ మతంలోనూ మనకు కనిపించవు. ఈ దేవాలయాల్లో అనేకం పురాణ ప్రాధాన్యత కలిగి ఉన్నవే కాకుండా చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినవి. ఈ దేవాలయాల దర్శన వల్ల జీవితంలో మంచి జరుగుతుందని మనం నమ్ముతాము. అలాంటి వాటిలో కొన్ని శిల్పకళకు కూడా ప్రాచూర్యం పొందాయి.

కొన్ని దేవాలయాల్లో జరిగే సంఘటనలు కొన్ని వేల ఏళ్ల నుంచి నిఘూడ రహస్యాలుగానే ఉండిపోతున్నాయి. ఇలా పురాణ, చారిత్రాత్మక ప్రాధాన్యత, శిల్పకళకు నిలయమైన దేవాలయాల సందర్శన కోసం చుట్టు పక్కల ఉన్నటు వంటివారే కాకుండా సుదూర దేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారత దేశంలో అత్యంత్ర ప్రాచూర్యం పొందిన, ఎక్కువ హిందువులు సందర్శించే దేవాలయాల సమాహారం ఈ కథనం.

మధురై మీనాక్షీ దేవాలయం

మధురై మీనాక్షీ దేవాలయం

P.C: You Tube

తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి దేవాలయం దాదాపు 2500 ఏళ్లకు పూర్వం నిర్మించినట్లు చెబుతారు. పార్వతీ దేవి మీనాక్షి రూపంలో ఇక్కడ కొలువై ఉంటుంది. ఇక్కడే పార్వతీ దేవి తపస్సు చేసి ఈశ్వరుడిని పొందినట్లు పురాణ కథనం. ఇక్కడ ఉన్న శిల్పాలు భారతతీయ శిల్పకళకు అద్దం పడుతాయి.

విరూపాక్ష దేవాలయం, హంపి

విరూపాక్ష దేవాలయం, హంపి

P.C: You Tube

ఈ దేవాలయంలో ఆ పరమశివుడు విరాపాక్షుడి పేరుతో భక్తులను కరుణిస్తున్నాడు. హంపిలోని ఈ దేవాలయాన్ని విజయనగర రాజులు మొదట నిర్మించగా అటు పై వచ్చిన వారు. ఈ దేవాలయం అభివ`ద్ధికి పాటుపడ్డారు. బెంగళూరు నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో హంపి ఉంటుది. ఈ దేవాలయంలోని శిల్పకళను అధ్యయనం చేయడానికి విదేశీయుల నుంచి కూడా ఇక్కడకు వస్తున్నారు.

ఆనందనిలయం, తిరుమల

ఆనందనిలయం, తిరుమల

P.C: You Tube

కలియుగ దైవంగా ప్రజల చేత నీరాజనాలు అందుకొంటున్న వేంకటేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఏడు కొండల పై ఉన్న ఈ దేవాలయం చేరుకోవడానికి దాదాపు 400 మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది.

పట్టదకల్

పట్టదకల్

P.C: You Tube

కర్నాటకలోని పట్టదకల్, ఐహోల్ వద్ద ఉన్న దేవాలయాల సమూహం శిల్పకళకు నిలయం. ఇక్కడ ఈశ్వరుడు, విష్ణువు కు సంబంధించిన పెద్ద పెద్ద విగ్రహాలతో పాటు బుద్ధుడి, జైన తీర్థాంకరుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అందువల్ల హిందువులతో పాటు మిగిలిన మతస్తులు కూడా ఎక్కువ మంది ఇక్కడకు వస్తుంటారు. కొండను తొలిచి ఈ గుహాలయాలను నిర్మించారు. చాళుక్యుల కాలంలో ఈ దేవాలయాల అభివ`ద్ధి బాగా జరిగింది.

రామనాథస్వామి దేవాలయం, రామేశ్వరం

రామనాథస్వామి దేవాలయం, రామేశ్వరం

P.C: You Tube

భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి దేవాలయం కూడా ఒకటి. ఇందులో ఉన్న రెండు లింగాల్లో ఒకటి సీతా దేవి ప్రతిష్టించినది కాగా, మరొకటి హనుమంతుడు ప్రతిష్టించినదని నమ్ముతారు. అత్యంత పొడవైన ప్రాకారం కలిగిన దేవాలయాల్లో రామనాథస్వామి దేవాలయం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది.

విఠల దేవాలయం, హంపి

విఠల దేవాలయం, హంపి

P.C: You Tube

ఈ దేవాలయం కూడా హంపిలోనే ఉంది. భారతీయ వాస్తు, శిల్పకళకు ఈ దేవాలయం అద్దం పడుతోంది. తుంగభద్ర నది ఒడ్డునే కల ఈ దేవాలయంలో స్వప్తస్వరాలను అందించే మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న దైవాన్ని చూడటం కంటే ఈ మ్యూజికల్ పిల్లర్స్ ఉన్న దేవాలయాన్ని చూడటానికే ఎక్కువ మంది వస్తుంటారు.

ఐరావతేశ్వర దేవాలయం, కుంభకోణం

ఐరావతేశ్వర దేవాలయం, కుంభకోణం

P.C: You Tube

భారతదేశంలో యునెస్కో చేత గుర్తింపుపొంది సంరక్షించబడే దేవాలయాల్లో కుంభకోణంలోని ఐరావతేశ్వర దేవాలయం కూడా ఒకటి. ఇక్కడే దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తనకు కలిగిన శాపాన్ని విముక్తి చేసుకొందని చెబుతారు. ఇక్కడ ఉన్న శిల్పాలను చూస్తూ ఉంటే సమయం ఇట్టే గడిచిపోతూ ఉంటుంది.

బృహదేశ్వర దేవాలయం, తంజావూరు

బృహదేశ్వర దేవాలయం, తంజావూరు

P.C: You Tube

ప్రపంచంలో పూర్తిగా గ్రానైట్ తో నిర్మించబడ్డ దేవాలయం తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయం. అత్యంత పొడవైన దేవాలయం కూడా ఇదే. ఇక్కడ ఆలయ గోపురం నీడ భూమిని తాకదు. ఇందుకు గల కారాణం ఇప్పటివరకూ నిఘూడ రహస్యం. ఒకే రాతితో నిర్మించబడిన గర్భగుడి, బ`హదాకారంలోని నంది ఇక్కడ ప్రధాన ఆకర్షణ.

శ్రీ కృష్ణ దేవాలయం గురువాయూర్

శ్రీ కృష్ణ దేవాలయం గురువాయూర్

P.C: You Tube

కేరళలోని గురువాయూర్ లో ఉన్న శ్రీ కృష్ణ దేవాలయాన్ని గురువాయప్పన్ దేవాలయం అని అంటారు. ఇక్కడ ఉత్సవాలు చాలా ప్రాచూర్యం పొందాయి. ఈ దేవాలయానికి సంబంధించిన ఏనుగుల కథలు చాలా ఆసక్తికరం. ఈ దేవాలయ ప్రవేశానికి ప్రత్యేక వేశధారణ ఉంటుంది.

చాముండేశ్వరీ దేవాలయం, మైసూరు

చాముండేశ్వరీ దేవాలయం, మైసూరు

P.C: You Tube

కర్నాటకలోని మైసూరు నగరంలో చాముండి హిల్స్ పై భాగంలో చాముండేశ్వరీ దేవాలయం ఉంది. ఆది పరాశక్తి ఇక్కడ చాముండి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ దేవాలయాన్ని మొదట హొయసల రాజ వంశీయులు నిర్మించగా అటు పై మైసూరు సంస్థానాధీశులైల ఒడయార్లు అభివ`ద్ధి చేశారు. ఆలయ ద్వారాలు బంగారం, వెండితో చేయబడ్డాయి.

మూకాంబిక దేవాలయం, కొల్లూరు

మూకాంబిక దేవాలయం, కొల్లూరు

P.C: You Tube

పరాశక్తి ప్రతిరూపంగా మూకాంబికా దేవిని కొలుస్తారు. కర్నాటకలోని కొల్లూరులో ఉన్న ఈ దేవాలయం శక్తిపీఠాల్లో ఒకటిగా హిందూ పురాణాలు పేర్కొంటాయి. ఇక్కడి దేవతకు మూడు నేత్రాలు ఉండటం విశేషం. దేవతకు ఎదురుగా శివలింగం ఉంటుంది.

షోర్ టెంపుల్, మహాబలిపురం

షోర్ టెంపుల్, మహాబలిపురం

P.C: You Tube

యునెస్కోచేత గుర్తింపు పొంది సంరక్షించబడుతున్న దేవాలయాల్లో షోర్ టెంపుల్ కూడా ఒకటి. బంగాళాఖాతం తీరాన ఉన్న ఈ దేవాలయం ఒక దేవాలయాల సమూహంగా చెప్పవచ్చు. ఇక్కడ శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ మతానికి సంబంధించిన ఎన్నో విగ్రహాలు ఉన్నాయి.

పద్మనాభ టెంపుల్, తిరువనంతపురం

పద్మనాభ టెంపుల్, తిరువనంతపురం

P.C: You Tube

దేశంలోనే అత్యంత ధనిక దేవాలయంగా దీనికి పేరు. విష్ణువు పద్మనాభుడి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. అత్యంత అరుదుగా కనిపించే శయనించిన స్థితిలో ఇక్కడ మూలవిరాట్టును మనం చూడవచ్చు.

సుచీద్రం టెంపుల్

సుచీద్రం టెంపుల్

P.C: You Tube

తమిళనాడులోని సుచీంద్రంలో ఈ దేవాలయం ఉంది. ఆలయ గోపురం 134 అడుగుల ఎత్తు. చాలా దూరం నుంచే ఈ దేవాలయ గోపురం మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం గోపురం పై హిందూ పురాణాలకు సంబంధించిన అనేక గాథలు శిల్పాల రూపంలో మనం చూడవచ్చు.

రంగనాథ స్వామి దేవాలయం, శ్రీరంగం

రంగనాథ స్వామి దేవాలయం, శ్రీరంగం

P.C: You Tube

దక్షిణ భారత దేశంలో అత్యంత పురాతన, ప్రాచూర్యం పొందిన, పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాల్లో శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ విష్ణువు శయనించిన స్థితిలో భక్తులకు సందర్శనమిస్తాడు. ప్రపంచంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్న హిందూ దేవాలయాల్లో శ్రీరంగంలోని రంగనాథ స్వామి దేవాలయం అతి పెద్ద హిందూ దేవాలయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X