» »ఈ గ్రామంలో ఇక్కడ ఇంటికి, బ్యాంకులకు తలుపులు ఉండవు !

ఈ గ్రామంలో ఇక్కడ ఇంటికి, బ్యాంకులకు తలుపులు ఉండవు !

Written By: Venkatakarunasri

LATEST: ఉదయంపూట బాలికగా సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూవుండే దేవీ విగ్రహం ఎక్కడ వుందో తెలుసా?

శని సింగనాపూర్ ఇక్కడ శని దేవుణ్ణి పూజించటం జరుగుతుంది. ఆశ్చర్యమేమిటి అంటే ఈ గ్రామంలో ఏ ఒక్క ఇంటికీ తలుపులుండవు. దేవాలయాలు సైతం దర్వాజాలు లేకుండా దర్శనమిస్తాయి. అంతేకాదు ఋణాలు ఇచ్చే బ్యాంకులు కూడా తలుపులు లేకుండా నిర్మించడం జరిగింది.

ఈ రోజుల్లో తలుపులకు తాళం వేసినా దొంగల భీభత్యం తట్టుకోలేకపోతున్నాం. మరి అలాంటిది అసలు తలుపులే లేకపోతే ఏం దొంగలించరా ? అంటే మాత్రం ఏం జరగదని చెప్పవచ్చు.

మరి ఇలాంటి నిజాయితీ గల గ్రామం ఎక్కడ వుంది? అక్కడ ఇళ్ళకు తలుపులు లేకపోవటానికి గల కారణమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి.

శనిశింగనాపూర్

శనిశింగనాపూర్

ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని అహమ్మదాబాద్ జిల్లాలో గల శనిశింగనాపూర్ అనే గ్రామం.

PC: Booradleyp1

దైవం

దైవం

ఈ గ్రామంలో శని దేవుణ్ణి దైవంగా కొలుస్తూవుంటారు. అందుకే దీనిని శని శింజ్ఞాపూర్ లేదా శని శింగనాపూర్ అని పిలుస్తూ వుంటారు.

PC:Booradleyp1

పెద్ద చరిత్ర

పెద్ద చరిత్ర

మరి ఇళ్ళకు ఇక్కడ తలుపులు ఎందుకు వుండవు అంటే మాత్రం దానికి ఒక పెద్ద చరిత్రే వుంది.

PC:Sabyasachi.baldev

కలియుగం

కలియుగం

పూర్వం కలియుగంలో శనేశ్వర విగ్రహం స్వయంగా ప్రతిష్టించుకోవడం జరిగిందని అందరూ చెప్తూ వుంటారు.

PC:Rashmitha

గొర్రెలు కాసుకునే వ్యక్తి

గొర్రెలు కాసుకునే వ్యక్తి

ఆ సమయంలో గొర్రెలు కాసుకునే వ్యక్తి తన చేతి కర్రతో ఒక రాయిపై కొట్టడం జరిగింది.

PC:Rashmitha

గొర్రెల కాపరి

గొర్రెల కాపరి

వెంటనే అక్కడ నుండి రక్తం రావటం కూడా జరిగింది. అదే రోజు రాత్రి ఆ గొర్రెల కాపరి కలలోకి ప్రత్యక్షమై తను శనిదేవుడునని అంతేకాదు ఆ నల్లరంగులో కన్పిస్తున్న రాయి తన విగ్రహమని కూడా చెప్పాడట.

PC: Junosoon

గొర్రెల కాపరి

గొర్రెల కాపరి

వెంటనే ఆ గొర్రెల కాపరి దేవుడ్ని ప్రార్ధిస్తూ స్వామీ మీరు నాకు కలలో ప్రత్యక్షమవటానికి కారణం ఏమిటి? నేను మీకు ఏదైనా ఆలయాన్ని నిర్మించాలా ? అని అడిగాడట.

PC:Vithu.123

దేవాలయం

దేవాలయం

దానికి శనిదేవుడు తనకు ఎలాంటి దేవాలయం అవసరం లేదని ఆ ఆకాశమే తనకు మేడ అని చెప్పాడట. అంతేకాదు తనకు ప్రతీరోజూ పూజలు చేయాలని కోరాడట.

PC: Singhmanroop

తైలాభిషేకం

తైలాభిషేకం

ప్రతి శనివారం తైలాభిషేకం చేయమని చెప్పాడట. ఇలా చేస్తే ఆ గ్రామం మొత్తానికి దొంగల భయం కానీ, బందిపోటుల భయం కానీ లేకుండా చూస్తానని చెప్పి మాయమయిపోయాడు.

PC: youtube

దేవాలయం

దేవాలయం

అప్పటినుండి దేవాలయానికి మాత్రమే కాదు. అక్కడ వుండే ఇంటికీ, షాపులకు కూడా తలుపులు వుండవు. 2010వరకు అక్కడ ఏ దొంగతనమూ జరగలేదు.

PC: youtube

రికార్డ్

రికార్డ్

కాకపోతే 2011లో ఒక వ్యక్తి అక్కడ దొంగతనం చేశాడని అక్కడ రికార్డ్ లో నమోదైంది.

PC: youtube

ప్రజలు

ప్రజలు

కాకపోతే ఆటను సరిహద్దు దాటకముందే రక్తం కక్కుకుని మరణించాడని అక్కడి ప్రజలు చెపుతూ వుంటారు.

PC: youtube

శనిదేవుడు

శనిదేవుడు

అందుకే అక్కడి ప్రజలు శనిదేవుడే వారిని కాపాడుతూ వుంటారని చెపుతూ వుంటారు.

PC: youtube

 వింతైన ఆచారం

వింతైన ఆచారం

కాకపోతే ఒక వింతైన ఆచారం ఈ ప్రదేశంలో చోటు చేసుకోవడం జరిగింది.

PC: youtube

స్త్రీలు

స్త్రీలు

అదేంటంటే ఆలయంలోకి స్త్రీలను అనుమతించకపోవడం.

PC: youtube

ఆలయం

ఆలయం

స్త్రీలను అనుమతించడం ఈ ఆలయంలో జరిగే పని కాదు.

PC: youtube

స్త్రీలు

స్త్రీలు

ఇదంతా ఒకప్పటి వరకు కాకపోతే ఇప్పుడు బాంబే హైకోర్ట్ వారి ఆదేశంతో ఇప్పుడు స్త్రీలను కూడా లోనికి ప్రవేశించడం జరుగుతుంది.

PC: youtube

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

శని శింగనాపూర్ కు ఎలా చేరుకోవాలి

pc: google maps