Search
  • Follow NativePlanet
Share
» »దుర్గాపూర్ - పశ్చిమ బెంగాల్ స్టీల్ నగరం !!

దుర్గాపూర్ - పశ్చిమ బెంగాల్ స్టీల్ నగరం !!

దుర్గాపూర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రయాణికులకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర నడిబొడ్డున ఉన్నదుర్గాపూర్ పర్యాటక, వ్యాపార మరియు విశ్రాంతి కొరకు పరిపూర్ణ సమ్మేళనంగా ఉన్నది.

By Mohammad

దుర్గాపూర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగాను,ఒక స్టీల్ తయారీ కేంద్రంగాను, పట్టణ ప్రాంతంగాను అభివృద్ధి చెందింది. ప్రయాణికులకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర నడిబొడ్డున ఉన్నదుర్గాపూర్ పర్యాటక, వ్యాపార మరియు విశ్రాంతి కొరకు పరిపూర్ణ సమ్మేళనంగా ఉన్నది.

ప్రత్యేక ఆకర్షణలో వెస్ట్ బెంగాల్ మ్యూజియంలు !ప్రత్యేక ఆకర్షణలో వెస్ట్ బెంగాల్ మ్యూజియంలు !

దుర్గాపూర్ లో మరియు చుట్టూ పర్యాటక స్థలాలు

దుర్గాపూర్ ప్రధానంగా ఒక పారిశ్రామిక నగరం అయినప్పటికీ ఇక్కడ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. దుర్గాపూర్ లో అందమైన ఉద్యానవనాలు మరియు తోటలు ఉన్నాయి. బురన్పూర్ లో మోహన్ కుమారమంగళం పార్క్, నెహ్రూ పార్క్ ఉన్నాయి. బిష్ణుపూర్ జయదేవ్ కెందూలి, రహ్రేస్వర్ శిబ్ మందిర్ తీర్థయాత్ర గమ్యస్థానాలుగా ఉన్నాయి.

జోయ్దెబ్ కెందూలి మందిరం

జోయ్దెబ్ కెందూలి మందిరం

చిత్రకృప : Officialspider

జోయ్దెబ్ కెందూలి

పశ్చిమ బెంగాల్ ప్రజలు యుగాల నుండి ఆరాధన వారి సంస్కృతి,సంప్రదాయాలు మరియు అభిమతంలకు ప్రసిద్ది చెందింది. ఆస్థాన కవి, సంస్కృత కవి అయిన జోయ్దేబ్ ఇక్కడే జన్మించారు. ప్రతి సంవత్సరం వార్షిక ఫెయిర్ ను ప్రకృతిసిద్ధమైన అజయ్ నది ఒడ్డున జరుపుకుంటారు. అంతే కాకుండా ఆలయం నుండి సందర్శించటానికి జయదేవ్ అనే అందమైన ప్రదేశం ఉన్నది. ఇది పట్టణం యొక్క హస్టిల్-బుస్ట్లే నుండి బయటపడటానికి ఒక ఆదర్శవంతమైన గమ్య స్థానంగా ఉంది.

మోహన్ కుమారమంగళం పార్క్

మోహన్ కుమారమంగళం పార్క్

చిత్రకృప : Ethically Yours

మోహన్ కుమారమంగళం పార్క్

మోహన్ కుమారమంగళం పార్క్ మొదట ఆ ప్రదేశం కేవలం ఒక సాధారణ ఆకుపచ్చ పాచ్ లా ఉండేది. ఆ తర్వాత పిల్లల కోసం ఒక చిన్న వినోద పార్కుగా మార్చబడింది. నేడు ఈ పార్క్ ఒక గొప్ప పిక్నిక్ స్పాట్ గా ఉంది. అంతేకాక బోటింగ్ మరియు ఇతర కార్యకలాపాలు నిర్వహించిటానికి ఇక్కడ కొన్ని కృత్రిమ సరస్సులతో పాటు పిల్లల కోసం కొన్ని రైడ్లు ఉన్నాయి. కుమారమంగళం పార్క్ సరస్సులు ప్రాంతంలో అత్యంత విషపూరిత పాములు కొన్ని ఉంటాయి.

దుర్గాపూర్ లోని ఒక మాల్

దుర్గాపూర్ లోని ఒక మాల్

చిత్రకృప : Kolkatan

జంక్షన్ మాల్

400 వేల చదరపు అడుగుల విస్తరించిన ఈ మాల్ భారతదేశం యొక్క తూర్పు ప్రాంతంలో అతిపెద్దదిగా ఉన్నది. అందువల్ల ఈ మాల్ ను చూసి దుర్గాపూర్ ప్రజలు గర్వపడతారు. మాల్ లో సరికొత్త షాపింగ్ బ్రాండ్లు మరియు సరికొత్త సినిమాల కొరకు ఒక మల్టీప్లెక్స్ స్క్రీన్ సౌలభ్యం ఉన్నది. ఇక్కడకు స్థానిక పబ్లిక్ రవాణా ద్వారా చేరవచ్చు. యువకులకు ప్రతిరోజూ సమావేశాలకు మంచి ప్రదేశము.

నెహ్రూ స్టేడియం

నెహ్రూ స్టేడియం

చిత్రకృప : Chippu Abraham

స్పోర్ట్ మీద ప్రేమ

పశ్చిమ బెంగాల్ లో దుర్గాపూర్ ను క్రీడలను ఆస్వాదించడానికి ఒక నగరంగా చెప్పవచ్చు. నెహ్రూ స్టేడియం, ASP స్టేడియం మరియు షహీద్ భగత్ సింగ్ స్టేడియంలో ఫుట్ బాల్ మరియు క్రికెట్ స్టేడియంలలో క్రీడాకారులు మరియు స్పోర్ట్స్ మీద ప్రేమ కలవారు మరియు విద్యార్ధి సమూహం అత్యంత చురుకుగా ఈ సదుపాయాలను ఉపయోగిస్తున్నారు.

దుర్గాపూర్ - స్టీల్ సిటీ ప్రవేశం

దుర్గాపూర్ - స్టీల్ సిటీ ప్రవేశం

చిత్రకృప : Anand Prakash

దుర్గాపూర్ ప్రకృతి తో సన్నిహితంగా ఉండుటకు ఒక ఆదర్శవంతమైన ప్రదేశం. చిన్న పట్టణంలో జీవితం ఇక్కడ ప్రజలు మధ్య చూడబడుతుంది. పర్యాటకులు భారీ ఇండియన్ ఉక్కు పరిశ్రమ గురించి తెలుసుకోవచ్చు. దీనిని ఇతర పట్టణాలు మరియు రాష్ట్ర నగరాల నుండి చేరుకోవచ్చు. లౌకిక నగరం జీవితం నుండి ఇక్కడకు వస్తే తొందరగా ఆహ్లాదకరంగా ఉండటానికి హామీఇవచ్చు.

దుర్గాపూర్ వసతి సదుపాయాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

కలకత్తా పర్యటనలో మరువలేని అంశాలు !కలకత్తా పర్యటనలో మరువలేని అంశాలు !

దుర్గాపూర్ ఎలా చేరుకోవాలి ?

విమానం ద్వారా : దుర్గాపూర్ కు సమీపాన మూడు గంటల దూరంలో కోల్కతా ఎయిర్ పోర్ట్ కలదు.

రైలు ద్వారా : దుర్గాపూర్ లోని రైల్వే స్టేషన్ కోల్కత తో కనెక్ట్ చేయబడింది. కోల్కతా దేశంలోని ఇతర ప్రదేశాలతో కనెక్ట్ చేయబడింది.

బస్సు / రోడ్డు ద్వారా : కోల్కతా నుండి దుర్గాపూర్ కు ప్రతిరోజూ ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X