Search
  • Follow NativePlanet
Share
» »మ‌న దేశంలోని అంద‌మైన బీచ్‌లు మీకు తెలుసా?

మ‌న దేశంలోని అంద‌మైన బీచ్‌లు మీకు తెలుసా?

సూర్యాస్తమయంలో జ‌న‌సంచారం త‌క్కువ‌గా ఉండే తీర ప్రాంతాల్లో గ‌డ‌ప‌డం మ‌న ఒంట‌రిత‌నాన్ని దూరం చేసేందుకు ఎంత‌గానో దోహ‌ద‌పడుతుంది. ఇప్పుడు మ‌నం మ‌న దేశంలోని అలాంటి అంద‌మైన తీర‌ప్రాంతాల విశేషాల‌ను తెలుసుకోబోతున్నాం. ప్రకృతి మాత మన దేశ‌ మట్టిని ఆశీర్వదించింది అనేందుకు సంకేతం 7,500 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం వెంబడి అందమైన బీచ్ లు క‌లిగి ఉండ‌టం.

దేశంలోని సిటీ బీచ్‌ల నుండి మారుమూల బీచ్‌ల వ‌ర‌కూ విస్త‌రించి ఉన్న ఈ తీర‌ప్రాంతాలు నిత్యం సంద‌డిగా క‌నిపిస్తూ ఆనందానికి చిరునామాగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని కొన్ని ఉత్తమ బీచ్ లు మ‌న దేశంలో ఉండటం అదృష్టంగా భావించ‌వ‌చ్చు. రోజువారీ సమస్య నుండి విరామం తీసుకోవడానికి.. జీవితాన్ని ఆస్వాదించ‌డానికి.. సాయంత్రం వేళ‌ చల్లని నీటిలో అడుగులు వేయ‌డానికి

మ‌న దేశంలోని అంద‌మైన బీచ్‌లు మీకు తెలుసా?

మ‌న దేశంలోని అంద‌మైన బీచ్‌లు మీకు తెలుసా?

సూర్యాస్తమయంలో జ‌న‌సంచారం త‌క్కువ‌గా ఉండే తీర ప్రాంతాల్లో గ‌డ‌ప‌డం మ‌న ఒంట‌రిత‌నాన్ని దూరం చేసేందుకు ఎంత‌గానో దోహ‌ద‌పడుతుంది. ఇప్పుడు మ‌నం మ‌న దేశంలోని అలాంటి అంద‌మైన తీర‌ప్రాంతాల విశేషాల‌ను తెలుసుకోబోతున్నాం. ప్రకృతి మాత మన దేశ‌ మట్టిని ఆశీర్వదించింది అనేందుకు సంకేతం 7,500 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం వెంబడి అందమైన బీచ్ లు క‌లిగి ఉండ‌టం. దేశంలోని సిటీ బీచ్‌ల నుండి మారుమూల బీచ్‌ల వ‌ర‌కూ విస్త‌రించి ఉన్న ఈ తీర‌ప్రాంతాలు నిత్యం

సంద‌డిగా క‌నిపిస్తూ ఆనందానికి చిరునామాగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని కొన్ని ఉత్తమ బీచ్ లు మ‌న దేశంలో ఉండటం అదృష్టంగా భావించ‌వ‌చ్చు. రోజువారీ సమస్య నుండి విరామం తీసుకోవడానికి.. జీవితాన్ని ఆస్వాదించ‌డానికి.. సాయంత్రం వేళ‌ చల్లని నీటిలో అడుగులు వేయ‌డానికి.. ఈ క్రింది తీర‌ప్రాంతాల్లో సరైన సమాధానాలను కనుగొంటారు.

రాధానగర్ బీచ్..

రాధానగర్ బీచ్..

అండ‌మాన్ మరియు నికోబార్ దీవులలోని సుందరమైన హేవ్ లాక్ ద్వీపంలో ఉన్న రాధానగర్ బీచ్ ఎంతో ప్ర‌సిద్ధి పొందింది. ఇది చుట్టూ ఉష్ణమండల అడవులతో చుట్టేసిన ఓ అందమైన తెల్లని ఇసుక తీరం. ఈ బీచ్ ఈత కొట్టడానికి, ఎండలో విశ్రాంతి తీసుకోవడానికి అనువైనది. సాహసోపేత ఔత్సాహికులకు ట్రెక్కింగ్ కు కూడా అనుమతి ఉంది. ఈ బీచ్ లో కూర్చొని

సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం మ‌ర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. ఇది ఆసియాలోని ఉత్తమ బీచ్‌గా టైమ్ మ్యాగజైన్ 2004 అవార్డును గెలుచుకుంది. అంతేకాదు, 2019 సంవత్సరానికి గాను ట్రిప్ అడ్వైజర్ ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇలాంటి అనేక ప్ర‌త్యేక‌తల‌ కార‌ణంగానే ఇది భారతదేశంలోని ఉత్తమ బీచ్‌ల‌ జాబితాలో ఉండటానికి అర్హత సాధించింద‌ని చెప్పొచ్చు.

బాగా బీచ్..

బాగా బీచ్..

ఈ బీచ్‌ గోవాలోనే ప్రసిద్ధి చెందిన బీచ్‌ల‌లో మొద‌టిది. బాగా బీచ్‌లో కేరింత‌ల‌కు కొరత లేదు. వాటర్ స్పోర్ట్స్‌తోపాటు ఈ బీచ్ కాటేజీలలో విశ్రాంతి తీసుకోవడం ఎవ్వ‌రూ మిస్స‌వ్వ‌రు. మిడ్‌నైట్ క‌ల్చ‌ర్ పార్టీల‌కు ఇది చిరునామాగా నిలుస్తుంది. సమీపంలోని

స్థానిక మార్కెట్లలో షాపింగ్ చేయడంతోపాటు ఎన్నో రకాల వంటకాలు ఇక్క‌డ అందుబాటులో ఉంటాయి. అందుకే పార్టీ ప్రియుల‌కు, తీర‌ప్రాంత ప్రేమికుల‌కు బాగా బీచ్ స్వ‌ర్గంలాంటిది అంటారు.

మెరీనా బీచ్..

మెరీనా బీచ్..

బంగాళాఖాతంలో కోరమాండల్ తీరంలో ఉన్న చెన్నై మెరీనా బీచ్ భారతదేశంలోనే అతి పెద్ద బీచ్‌గా పేరుగాంచింది. అంతేకాదు, ప్రపంచంలోనే రెండవ పొడవైన తీర‌ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. సూర్యాస్తమయ సమయంలో అద్భుతంగా ప్రశాంతంగా కనిపించే ఈ బీచ్ మ‌న‌సుకు అమిత‌మైన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని

చేరువ‌చేస్తుంది. ఈ పట్టణ ఇసుక బీచ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుండి ఫోర్ షోర్ ఎస్టేట్ వరకు విస్తరించి ఉంది. ఇక్కడ సందర్శించేటప్పుడు, ఇక్కడ ఉన్న అక్వేరియం మరియు చారిత్రక స్మారక చిహ్నాలను చూడ‌టం మ‌ర్చిపోకూడ‌దు.

పూరీ బీచ్..

పూరీ బీచ్..

భారతదేశంలోని ఒడిసా ఉత్తమ బీచ్‌ల‌లో ఒకటి పూరీ బీచ్. తాటి చెట్లతో చుట్టుముట్టబడిన అందమైన తీర‌ప్రాంతంగా ప‌ర్యాట‌క ప్రేమికుల‌ను ఆక‌ర్షిస్తోంది. అంతేకాదు, అందమైన సూర్యోదయం, అద్భుతమైన సూర్యాస్తమయం చూడాలంటే ఒరిస్సాలోని పూరీ బీచ్‌కు చేరుకోవాల్సిందే. ఈ తీరంలోని తెల్లని ఇసుక స్పష్టంగా క‌నిపించే ఇసుక రేణువులు సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి.

భారతదేశంలోని అత్యంత అందమైన బీచ్ లలో ఒకటిగా పేరొందిన ఈ బీచ్ విహార యాత్రకు అనువైనది. సాయంత్రాలు ఒంటెల స్వారీ, గుర్రపు స్వారీ కూడా ఈ బీచ్‌లో ఉంటాయి. స్థానిక కళాఖండాలు, చేనేత వస్తువుల కొనుగోలు ఇక్కడ ప్రత్యేకంగా పరిగణించబడుతుంది.

త‌ర్క‌ర్‌లీ బీచ్‌..

త‌ర్క‌ర్‌లీ బీచ్‌..

మహారాష్ట్రలోని ఉత్తమ బీచ్ గమ్యస్థానాలలో ఒకటైన త‌ర్క‌ర్‌లీ బీచ్‌ కుర్లీ నది మరియు అరేబియా సముద్రం సంగమం వద్ద ఉంది. పారాసెయిలింగ్, స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ వంటి సాహసోపేతమైన వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలను కూడా మీరు ఇక్కడ ఆస్వాదించవచ్చు.

డైవింగ్ చేసేటప్పుడు, మీరు అందమైన పగడాలు, అద్భుతమైన చేపల గుంపులు మరియు వివిధ సముద్ర మొక్కలను కూడా చూడవచ్చు.

రాక్ బీచ్..

రాక్ బీచ్..

పాండిచ్చేరిలో ఉన్న ఈ తీరం పేరులో సూచించినట్లుగా అంతటా రాళ్ళతో నిండి ఉంటుంది. స‌ర‌దాగా సమయం గడపడానికి, అలలు రాళ్ళను కొట్టడాన్ని చూడటానికి, అందమైన ఫోటోలను తీయడానికి ఇది అనువైన ప్రదేశం. ఈ బీచ్ ఫ్రెంచ్ వాస్తుశిల్పాన్ని ఆస్వాదించడానికి, రుచికరమైన ఫ్రెంచ్-ఇండియన్ ఫ్యూజన్ ఫుడ్ తినడానికి, వాటర్ ఫ్రంట్ వెంబడి షికారు చేయడానికి ప్రసిద్ధి

చెందింది. పర్యాటకులు దీనిని "మినీ గోవా" అని కూడా పిలుస్తారు. ప్రకాశవంతమైన సూర్యుడు, గాలి, నిర్మలమైన ఆకాశంతోపాటు గర్జించే తరంగాలు అన్నీ చాలా ఆనందదాయకమైనవి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X