Search
  • Follow NativePlanet
Share
» »అస్సాం లో ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్కులు !!

అస్సాం లో ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్కులు !!

నేడు అస్సాంలో ప్రపంచములోనే అంతరించిపోతున్న ఒక కొమ్ము గల ఖడ్గ మృగాలు అత్యధికంగా కజిరంగా నేషనల్ పార్క్ లో ఉన్నాయి. దాదాపు అస్సాంలోని ప్రతి జిల్లాలో, జిల్లాకొకటి చొప్పున నేషనల్ పార్క్ ఉన్నది.

By Mohammad

అస్సాం వృక్షజాలానికి, జంతుజాలానికి ఒక ఐశ్వర్యవంతమైన గమ్యస్థానంగా చెప్పుకోవచ్చు. దాదాపు అస్సాంలోని ప్రతి జిల్లాలో, జిల్లాకొకటి చొప్పున నేషనల్ పార్క్ ఉన్నది. ఇవి అంతరించిపోతున్న మొక్కలు, వృక్షలకు, జంతువులకు రక్షణగా ఉన్నది. అస్సామ్ ఒకవైపు పారిశ్రామికంగా ఎదుగుతూనే మరోవైపు పర్వావరణ వ్యవస్థకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకుంటోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ... మజులి !!

అస్సాం వెళ్ళినప్పుడు అభయారణ్యాలు మరియు నేషనల్ పార్కు ల సందర్శన లేకపోతే మీ పర్యటన సంతృప్తిగా సాగదు. నేడు అస్సాంలో ప్రపంచములోనే అంతరించిపోతున్న ఒక కొమ్ము గల ఖడ్గ మృగాలు అత్యధికంగా కజిరంగా నేషనల్ పార్క్ లో ఉన్నాయి. అస్సాం రాష్ట్ర జంతువైన ఈ ఏక కొమ్ము ఖడ్గ మృగాలను రాష్ట్రంలోని ఇతర నేషనల్ పార్క్ లలో, సంరక్షణ కేంద్రాలలో చూడవచ్చు.

అస్సాం లో ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్కుల వివరాలలోకి వెళితే ...

ఆమ్చంగ్

ఆమ్చంగ్

ఆమ్చంగ్ నేషనల్ పార్క్ గౌహతి ఊరి పొలిమేరల్లో విమానాశ్రయం నుండి 40 కి. మీ ల దూరంలో, రైల్వే స్టేషన్ నుండి 15 కి. మీ ల దూరంలో కలదు. అంతరించిపోతున్న వన్యప్రాణులు, పక్షులు, మొక్కలు మరియు వివిధ రకాలైన వృక్ష సంపదను పార్కు లో చూడవచ్చు.

జంతువులు : చైనీస్ పాంగోలిస్, ఫ్లైయింగ్ ఫాక్స్, స్లో లోరిస్, అస్సామీ మెకాక్, ఏనుగు, లంగూర్ మొదలుగునవి
పక్షులు : సన్నని బెల్ రాబందు, బెగ్గూర్, ఖలీజ్ నెమలి, పావురాలు మొదలుగునవి.

చిత్రకృప : Lonav Bharali

బొరైల్

బొరైల్

బొరైల్ వన్య ప్రాణుల అభయారణ్యం అస్సాం లోని అతిపెద్ద పార్కు లలో ఒకటి. మీరు ఇక్కడికి 40 కి.మీ ల దూరంలో ఉన్న సిల్చార్ విమానాశ్రయం నుండి సులభంగా చేరుకోవచ్చు. సందర్శన సమయం : అక్టోబర్ - ఏప్రియల్. ఇక్కడ కూడా వివిధ రకాల పక్షులు, జంతువులను చూడవచ్చు. తాబేలు, కింగ్ కోబ్రా, పైథాన్, మానిటర్ బల్లి చూడదగ్గవి.

చిత్రకృప : Lonav Bharali

దిబ్రూ - సైఖోవా

దిబ్రూ - సైఖోవా

దిబ్రూ - సైఖోవా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో కలదు. ఇది దిబ్రూగఢ్ - అస్సాం లోయల మధ్య వ్యాపించి ఉన్నది. ఈ పార్క్ అంతరించిపోతున్న అరుదైన పక్షులకు ఆవాసం. దిబ్రూగఢ్ విమానాశ్రయం నుండి 80 కి. మీ ల దూరంలో ఉన్న పార్క్ ను సెప్టెంబర్ - మర్చి మధ్యలో సందర్శించవచ్చు.

చిత్రకృప : Dhruba Jyoti Baruah

మానస్

మానస్

మానస్ నేషనల్ పార్క్ గౌహతి లో పేరుపొందిన హెరిటేజ్ సైట్. ఇది భూటాన్ వరకు విస్తరించబడి ఉంది. అంతరించిపోతున్న అరుదైన పక్షులు, జంతువులు పిగ్మి హాగ్, గోల్డెన్ లంగర్, హిస్పిడ్ హెర్ వంటి వాటికి డి ఆవాసం. పార్కు లో టైగర్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్ మరియు ఎలిఫెంట్ రిజర్వ్ లు ఉన్నాయి.

సందర్శన సమయం : అక్టోబర్ - మర్చి వరకు.

చిత్రకృప : Lonav Bharali

కాజీరంగా

కాజీరంగా

కాజీరంగా నేషనల్ పార్క్ ప్రపంచంలో అంతరించిపోతున్న ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందినది. దీనిని కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. పార్క్ లో పులులను, ఖడ్గ మృగాలను, ఇతర జంతువులను చూడటానికి జీప్ సఫారీ లేదా ఏనుగు సఫారీ ఎంచుకోవడం ప్రత్యేక ఆకర్షణ.

చిత్రకృప : Kangkan.it2004

హాల్లోంగపర్ గిబ్బన్

హాల్లోంగపర్ గిబ్బన్

భారతదేశంలో దొరికే ఏకైక గిబ్బన్ పర్వత గిబ్బన్ కు ఈ పార్క్ నిలయం. బెంగాల్ స్లో లోరిస్, మకావ్ లు, ఏనుగులు, కొండముచ్చులు, నెమళ్ళు, చిరుత, పులులు తో పాటు చాలా రకాల వలస పక్షులు, స్థానిక పక్షులు ఇక్కడ చూడవచ్చు. జోర్హాట్ నుండి ఇది కేవలం 20 కి. మీ ల దూరంలో ఉంది. సందర్శన సమయం : అక్టోబర్ - ఫిబ్రవరి వరకు.

చిత్రకృప : Sankara Subramanian

ఒరాంగ్

ఒరాంగ్

ఒరాంగ్ జాతీయ పార్క్ సోనిత్పూర్ జిల్లాలో 78 చ. కి. మీ మేర విస్తరించి ఉన్నది. ఇది దాదాపు కాజీరంగా నేషనల్ పార్క్ నే పోలి ఉంటుంది కనుక దీనిని చిన్న కాజీరంగా నేషనల్ పార్క్ గా కూడా అభివర్ణిస్తారు జంతు ప్రేమికులు. ఇక్కడ ఒక కొమ్ము గల ఖడ్గ మృగాలు, ఆడ బాతు, వడ్రంగి పిట్ట, వలస పక్షులు మొదలైనవి చూడవచ్చు. తేజ్పూర్ కు 56 కి. మీ ల దూరంలో ఇది ఉంది.

చిత్రకృప : JayDalal5

పంబరి రిజర్వ్ ఫారెస్ట్

పంబరి రిజర్వ్ ఫారెస్ట్

ఈ ఫారెస్ట్ కాజీరంగా నేషనల్ పార్క్ కు మరియు జలపాతాలు దగ్గరగా గోలాఘాట్ జిల్లాలో ఉన్నది. బొచ్చు గోశ్వాక్, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అనే పక్షి వంటి అనేక అసాధారణ పక్షులను చూడవచ్చు. ఈ ఫారెస్ట్ చూడటానికి మొత్తం 2 గంటల సమయం పడుతుంది. గైడ్ సహాయంతో ఫారెస్ట్ దృశ్యాలను చూడవచ్చు.

చిత్రకృప : Gadajignesh

నమేరి నేషనల్ పార్క్

నమేరి నేషనల్ పార్క్

తేజ్పూర్ కు 35 కి. మీ ల దూరంలో నమేరి పార్క్ కలదు. ఇక్కడ చిరుత, బైసన్స్, ఎలుగుబంట్లు, లంగూర్స్ మొదలైనవి చూడవచ్చు. అలాగే పెద్ద సంఖ్యలో ఏనుగులను కూడా చూడవచ్చు. బర్డ్ వాచింగ్ కు, ఫిషింగ్ కు ఈ పార్క్ అనువైనది.

చిత్రకృప : Rennett Stowe

గరం పానీ

గరం పానీ

హిందీ లో గరం పానీ అంటే వేడి నీరు అని అర్థం. పార్క్ లో వేడినీటి బుగ్గలు ఉండటం వల్ల పార్క్ కు గరం పానీ వన్య ప్రాణుల అభయారణ్యం అనే పేరొచ్చింది. మిట్ట గిబ్బన్స్, గోల్డెన్ లాగూన్స్ వంటివి ఇక్కడ చూడవచ్చు. జలపాతాలు, సరీసృపాలు, పక్షులు కూడా చూడదగ్గవి. దిమాపూర్ విమానాశ్రయం నుండి 55 కి.మీ ల దూరంలో పార్క్ ఉన్నది.

చిత్రకృప : Travelling Slacker

భేర్జన్ - బోరాజన్ - పడుమోని పార్క్

భేర్జన్ - బోరాజన్ - పడుమోని పార్క్

ఈ అభయారణ్యం ఎగువ అస్సాంలో మూడు బ్లాక్ లుగా విస్తరించి ఉంది. మెకాక్, స్లో లోరిస్, లంగూర్, గిబ్బన్, చిరుతపులులు, అంతరించిపోతున్న పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు మొదలగునవి చూడవచ్చు. తిన్సుకియా నుండి రోడ్డు మార్గంలో రహదారి ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

చిత్రకృప : Paul White

చక్రశిల

చక్రశిల

చక్రశిల గోల్డెన్ లంగూర్ ల రెండవ ప్రసిద్ధ రక్షణ స్థావరం. ఇందులో పర్యాటకులు 14 రకాల సరీసృపాలు, 60 రకాల చేపలు, 273 జాతుల పక్షులు, 11 రకాల ఉభయచరాలను చూడవచ్చు. 6 కి.మీ ల దూరంలో ఉన్న కొక్రాఝార్ నుంచి పార్క్ కు సులభంగా చేరుకోవచ్చు.

చిత్రకృప : Travelling Slacker

బోర్నది అభయారణ్యం

బోర్నది అభయారణ్యం

ఈ అభయారణ్యం హిస్పిడ్ కుందేలుకు, పిగ్మీ హాగ్ లకు ప్రసిద్ధి చెందినది. పర్యాటకులు ఇక్కడ చైనీస్ అలుగు, పోర్కు పైన్, డీర్ బార్కింగ్ మరియు హిస్పిడ్ హరే వంటి అరుదైన వన్య ప్రాణులను చూడవచ్చు. మంగళ్దైనుంచి 90 కి. మీ ల దూరంలో ఇది ఉన్నది. సందర్శన సమయం : నవంబర్ - ఏప్రియల్.

చిత్రకృప : Sapna Pillutla

బురచపోరి

బురచపోరి

ఇది సోనిత్పూర్ జిల్లా, బ్రహ్మపుత్రా నది దక్షిణ ఒడ్డున 44. 06 చ. కి. మీ ల మేర విస్తరించి ఉన్నది. బెంగాల్ ప్లోర్కాన్, ఒక కొమ్ము ఖడ్గ మృగాలు, అడవి గేదెలు, చిరుతలు, పులులు, ఏనుగులు మరియు హాగ్ లేడి ఇక్కడ చూడవచ్చు. తేజ్పూర్ కు 30 కి. మీ ల దూరంలో ఉన్నది. సందర్శన సమయం : నవంబర్ - మర్చి.

చిత్రకృప : Paul White

కర్బి ఆంగ్లోన్గ్

కర్బి ఆంగ్లోన్గ్

ఇది తూర్పు, ఉత్తర ఆంగ్లోన్గ్ వన్యప్రాణుల అభయారణ్యాలుగా ఉన్నాయి. ఈ రెండు అభయారణ్యాలు మొరిగే జింక, టైగర్, ఏనుగు, ఎలుగుబంట్లు, అడవి పండుగలు, హులోచ్క్ గిబ్బన్స్ మొదలైన వాటికి ఆవాసంగా ఉన్నవి. దిమాపూర్ విమానాశ్రయం సమీపంలో ఉన్నది. సందర్శన సమయం నవంబర్ - మర్చి

చిత్రకృప : Sankara Subramanian

సనై రూపై

సనై రూపై

ఈ అభయారణ్యం సోనిత్పూర్ జిల్లా లో హిమాలయాల పర్వత పాదాల దిగువన 200 చ.కి.మీ మేర విస్తరించి ఉన్నది. ఈ అభయారణ్యం అద్భుతమైన వీక్షణలు మరియు సమృద్ధిగా వన్యప్రాణులను కలిగి ఉంది. తేజ్పూర్ సమీప పట్టణం. సందర్శన సమయం : ఏఱ్పయల్ - డిసెంబర్.

చిత్రకృప : Prashant Ram

పోబిటోర

పోబిటోర

గౌహతి నుండి సాంచురీకి చేరేందుకు గంట సమయం పడుతుంది. 30.80 చ. కి.మీ విస్తరించిన ఈ అభయారణ్యంలో 16 చ. కి. మీ వరకు ఖడ్గ మృగాలు ఉండటం విశేషం. ఆసియాటిక్ బఫెలో, చిరుత, అడవి పిల్లి మొదలుగునవి ఇక్కడ చూడవచ్చు.

చిత్రకృప : Dr. Raju Kasambe

పభ

పభ

పభ నేషనల్ పార్క్ లిఖిమ్పూర్ సమీపంలో 49 చ. కి. మీ మేర విస్తరించి ఉన్నది. ఇది ప్రత్యేకంగా ఆసియా దున్నపోతులకు ఆవాసంగా ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు అక్కడి సహజ అందాలను తిలకించటానికి వస్తుంటారు. సందర్శన సమయం : నవంబర్ - ఏప్రియల్.

చిత్రకృప : Heritageorissa

లొఖోవా

లొఖోవా

ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున నాగోర్ జిల్లాలో కలదు. ఇక్కడ అడవి గేదెలు, హాగ్ లేడి, పులి, చిరుత, ఏనుగు, సివేత్స్ మొదలైన వాటిని చూసి పర్యాటకులు ఆనందించవచ్చు. సందర్శన సమయం : నవంబర్ - మర్చి.

చిత్రకృప : Samrat456

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X